Secrets of Sex । పడకగదిలో స్త్రీలు పురుషుల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?
Secrets of Sex: పడకగదిలో స్త్రీలు తమ భాగస్వామి నుంచి కొన్ని ఆశిస్తారు. పురుషులు ఆ రహస్యాలు తెలుసుకుంటే వారి సంసారం సుఖమయమే. అవేంటో ఇక్కడ చూడండి.
శృంగారం చేయటం ముఖ్యం కాదు, ఆ కార్యాన్ని ఆస్వాదించటం ముఖ్యం. శృంగారంలో ఆడ, మగ ఇద్దరూ సంతృప్తి చెందాలి. మహిళలను అర్థం చేసుకోవటం ఎప్పుడైనా కొంచెం కష్టమే, కానీ పడకగదిలో వారు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం నిజంగా అంత కష్టమేం కాదు. పడకగదిలో స్త్రీ ఆశించేది పురుషుడు గనక అందిస్తే, వారి బంధం దృఢంగా పెనవేసుకుంటుంది. ఎనలేని ప్రేమను ఆ పురుషుడిపై స్త్రీ కురిపిస్తుంది.
పడకగదిలో స్త్రీలు ఏమైతే ఆశిస్తుందో కొన్ని చర్యల ద్వారా వ్యక్తపరుస్తారు. పురుషులు ఆ చర్యలను గనక పునికిపుచ్చుకుంటే, దుప్పటి గుడిసెలో ఇరువురి వెచ్చని తనువులు ఏకమై, ఆవిర్లు ఊరుతాయి. ఈ ఉల్లాసవంతమైన సెషన్ మిమ్మల్ని స్వర్గసుఖాలను అందించిన అనుభూతి కలుగుతుంది.
పురుషులు తెలుసుకోవాలని మహిళలు కోరుకునే ఆ రహస్యాలేమిటో (Secrets of Sex) ఇక్కడ విప్పి చూపిస్తున్నాం. ఇవి మీకు పడకగది పిచ్‌పై అద్భుతమైన స్కోర్ చేయటానికి ఉపయోగపడతాయి.
మంచి మాటలతో కామప్రేరణ
స్త్రీ పడకగదికి రాగానే అన్ని మరిచిపోయి విశ్రాంతిగా గడపాలనుకుంటుంది. కాబట్టి పురుషులు దీనిని అర్థం చేసుకొని మంచి మాటలు మాట్లాడాలి. ప్రేమగా కబుర్లు చెప్పాలి. సంబంధం లేని ఏ విషయాలను తీసుకురావద్దు. సన్నిహితంగా మెలుగుతూ ప్రేమగా మాట్లాడే మాటలు స్త్రీలలో కామోద్రేకాన్ని ప్రేరేపిస్తాయి. ఇక ఆ రాత్రి వెన్నెల కురిసినట్లే.
మెచ్చుకుంటూ రెచ్చిపోండి
స్త్రీలని మెచ్చుకోకపోవడం వలన తనపై ప్రేమ లేదని భావిస్తారు. లేదా తాము ఆకర్షణీయంగా కనిపించడం లేదని భావిస్తారు. కాబట్టి వారి అందచందాలను పొగడండి. ఒక్కొక్క అందాన్ని వర్ణించండి, అల్లుకుపోండి, గిల్లుకుపోండి. మెచ్చుకుంటూ రెచ్చిపోండి.
స్త్రీలకు సెక్స్ అనేది ఒక మంచి భావన
ఒక్కోసారి పురుషులు తమ ఒత్తిడిని వదులుకునేందుకు సెక్స్ చేస్తారు. స్త్రీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎగబడి కలబడిపోవద్దు. బాధ కలిగించే మొరటుగా వ్యవహరించడం, కరుకైన మాటలతో బెదిరించడం చేయవద్దు. సెక్స్ అంటే స్త్రీలలో మంచి భావన ఉంటుంది. ప్రేమకు మరొక రూపంగా భావిస్తారు కాబట్టి ప్రేమతో చేయండి.
భావప్రాప్తి అనేది ఒక అవసరం కాదు
ఒక మంచి ప్రేమికుడు అనిపించుకోవాలంటే, స్త్రీని శృంగారంలో తారాస్థాయికి చేర్చడం అవసరం అని చాలా మంది పురుషులు భావిస్తారు. అలాంటి ఆలోచనలను కలిగి ఉండటం మంచిదే, కానీ ఎల్లప్పుడూ అవసరం లేదు. ఇలాంటి హార్డ్ కోర్ సెక్స్ చేయడం వలన స్త్రీలు ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉంటుంది. సున్నితమైన స్పర్శలతో కూడా భావప్రాప్తిని కలిగించవచ్చు.
ఆటకు ముందు ఫోర్ ప్లే
పడకగదిలో తొందరపాటు పనికి రాదు. నేరుగా క్లైమాక్స్ కు వెళ్లిపోకూడదు. ఒక్కొక్కటిగా చేస్తూ ఉండటమే స్త్రీలకు ఇష్టం. ఆమె శరీరంలో ఎన్నో అద్భుతమైన నిధులు ఉంటాయి. అవన్నీ దోచుకుంటూ ఉండండి. తేనేల రుచులను ఆస్వాదించండి. అమృతపు వర్షంలో మునిగి తేలండి. ఆ క్రమంలోనే హాయిగా హ్యాపీ ఎండింగ్ చేయండి. ఆపై వెంటనే పక్కకు తప్పుకోకుండా కాసేపు ఒకరినొకరు కౌగిలించుకొని రిలాక్స్ అవ్వండి.
ఈ రహస్యాలు ఎప్పుడూ మీ మెదడులో ఉంచుకోండి. మీ బంధాన్ని కలకాలం పచ్చగా ఉంచుకోండి.
సంబంధిత కథనం