మహిళలు ఏ సమయంలో ఎక్కువగా 'సెక్స్'‌ను ఇష్టపడుతారో తెలుసా?-the month when people have the most sex in the year ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మహిళలు ఏ సమయంలో ఎక్కువగా 'సెక్స్'‌ను ఇష్టపడుతారో తెలుసా?

మహిళలు ఏ సమయంలో ఎక్కువగా 'సెక్స్'‌ను ఇష్టపడుతారో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Sep 22, 2022 08:29 PM IST

తాజాగా శృంగారం గురించి బ్రిటీన్‌లో జరిగిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం, వేసవి కాలంలో జంటలు ఎక్కువగా సెక్స్ చేయడానికి ఇష్టపడతారట. ఈ బ్రిటీష్ అధ్యయనం సెక్స్ గురించి వెల్లడైన మరిన్ని షాకింగ్ విషయాల గురించి తెలుసుకుందాం.

Month Of Sex:
Month Of Sex:

అలుమగాలను మానసికంగా, శరీరకంగా ఏకం చేసే ప్రక్రియ శృంగారం. అయితే వివాహం తర్వాత ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గోన్నప్పటికీ క్రమేణా దానిపై ఆసక్తి తగ్గుతుంది. అయితే కొంత మంది జంటల్లో మాత్రం సెక్స్‌పై అమితా ఆసక్తి ఉంటుంది. అయితే తాజాగా బ్రిటీన్‌లో జరిగిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం, వేసవి కాలంలో జంటలు ఎక్కువగా సెక్స్ చేయడానికి ఇష్టపడతారట. ఈ బ్రిటీష్ అధ్యయనం సెక్స్ గురించి వెల్లడైన మరిన్ని షాకింగ్ విషయాల గురించి తెలుసుకుందాం.

2,000 మంది బ్రిటీషర్స్‌పై నిర్వహించిన ఈ పరిశోధనలో, సంవత్సరంలో ఏ నెలలో ఎక్కువ సెక్స్‌లో పాల్గొన్నారనే ప్రశ్న అడిగారు.చాలా మంది జూన్, జూలై, ఆగస్టు పేర్లను చెప్పగా.. ఇక శీతాకాలం కంటే వేసవి కాలంలోనే సెక్స్ చేయడానికి ఇష్టపడతమని వెల్లడించారు.

వాట్ విమెన్ లైక్ -

యాప్ ద్వారా నిర్వహించిన మరో అధ్యయనంలో 1.27 మిలియన్ల వినియోగదారుల అభిప్రాయాన్ని విశ్లేషించారు. ఇందులో మహిళలు వేసవిలో సెక్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారని తేలింది. ఈ మొత్తం సెషన్లలో 40 శాతం వేసవిలో సెక్స్ చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలింది. ఇక శరదృతువులో 38.8 శాతం, చలికాలంలో 36.8 శాతం మరియు వసంతకాలంలో 35.8 శాతం మంది ఎక్కువగా సెక్స్ చేసినట్లు వెల్లడించారు.

అదే విధంగా, ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళలు కూడా శీతాకాలంలో కంటే వేసవిలో ఎక్కువ ఉద్వేగం అనుభూతి చెందుతున్నారని వెల్లడించారు.శీతాకాలం ఎక్కువగా శృంగారం చేయడానికి ఫిబ్రవరి నెల చివరి స్థానంలో ఉంది.

WhatsApp channel