Sex Conversations | సెక్స్ ముందు, తర్వాత మీ పార్టనర్​తో మాట్లాడాల్సిందేనా.. -you should have right conversations before and after sex here is the reasons why ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  You Should Have Right Conversations Before And After Sex Here Is The Reasons Why

Sex Conversations | సెక్స్ ముందు, తర్వాత మీ పార్టనర్​తో మాట్లాడాల్సిందేనా..

HT Telugu Desk HT Telugu
Mar 31, 2022 10:48 AM IST

సెక్స్‌కు ముందు సంభాషణలు ఉద్రేకం కలిగిస్తాయని అందరికీ తెలుసు. అయితే సెక్స్ తర్వాత సంభాషణలు మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయంటున్నారు నిపుణులు. బెడ్​ రూమ్​లో సంభాషణలు.. మీ సంబంధాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయని సూచిస్తున్నారు. శృంగారానికి ముందు, తర్వాత సరైన సంభాషణలు జరగడం చాలా ముఖ్యమంటున్నారు సెక్స్ ఎడ్యుకేటర్ సీమా ఆనంద్. మరి ఆ సంభాషణలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్ సంభాషణలు
సెక్స్ సంభాషణలు

Sex Conversations | బలమైన లైంగిక సంభాషణను కలిగి ఉన్న జంటలు.. వారి లైంగిక జీవితాలతో మరింత సంతృప్తి చెందుతారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మరింత బహిరంగ సంభాషణతో, సాన్నిహిత్యం, బలమైన సంబంధం పెరుగుతుందని వెల్లడిస్తున్నాయి. కొత్త విషయాలను ప్రయత్నించాలనే కోరికల విషయంలో కూడా ఈ సంభాషణలే కీలకం అంటున్నారు నిపుణలు. సెక్స్‌కు ముందు సంభాషణలు గాసిప్‌గా, కొంటెగా ఉండాలని.. సూచిస్తున్నారు.

సెక్స్ సంభాషణలు

సెక్స్ అనేది చాలా భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చే చర్య. ఇది కౌగిలించుకోవడం, మసాజ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా మరిన్నింటిని కలిగి ఉంటుంది.“సెక్స్ తర్వాత ఇది సంతోషకరమైన, అందమైన, ప్రశాంతమైన సంభాషణలకు సంబంధించినదిగా ఉండాలి. శరీరాన్ని తిరిగి నియంత్రిత స్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం కాబట్టి.. లైంగిక సంరక్షణ అనేది మంచి పద్ధతి.

చేయకూడని పనులు

సెక్స్ తర్వాత మీ భాగస్వామి పనితీరును విమర్శించకుండా ఉండటం చాలా ముఖ్యం. మీరు చేయకూడని ఇతర విషయం ఏమిటంటే.. వారి శరీరాలపై, ఆకృతిపై వ్యాఖ్యానించడం. ఎందుకంటే వారు మీతో సన్నిహిత క్షణాన్ని పంచుకున్నారు కాబట్టి. అలాగే, మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడం మంచి ఆలోచన... అని మీరు భావిస్తే, వెంటనే దాన్ని ఆపండి. ఆ క్షణంలో అలాంటి సబ్జెక్ట్‌లను తీసుకురాకపోవడమే మంచిది. ఆ సంభాషణలను సాధారణ సమయాల కోసం వదిలివేయండి. ఆ సమయంలో వారిని కౌగిలించుకుని ఆ సమయాన్ని ఆస్వాదించండి.

అసౌకర్యంగా ఉంటే..

మీ మాజీ లైంగిక అనుభవాలను ప్రస్తుతంతో పోల్చవద్దు. వాస్తవానికి ఈ విషయాలను చర్చించడం చాలా అవసరం. కానీ సెక్స్ తర్వాత వెంటనే చేయడం మాత్రం సరికాదు. తీవ్రమైన విషయాలను చర్చించకుండా... మీ భాగస్వామిని మీకు నచ్చిన విధంగా చేయమని ఒప్పించడం ఉత్తమం. ఒకవేళ అతను/ఆమె అంతకుముందు ఏదైనా విషయంలో సౌకర్యంగా లేకుంటే.. దానిని అక్కడితో వదిలేయడమే మంచిదని సీమా ఆనంద్ స్పష్టం చేశారు.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్