Sex & Sleep । సుఖమైన నిద్రకు సుఖసంసారమే మార్గం.. శృంగారం ఎంతో ఆరోగ్యకరం!
మానసిక, శారీరక ఆరోగ్యానికి శృంగారం చాలా అవసరం. హాయిగా నిద్రపోవటానికి శృంగారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. శృంగారంలో దశలు ఇక్కడ తెలుసుకోండి.
మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్ర ఎంత ముఖ్యమో సెక్స్ కూడా అంతే ముఖ్యం. లైంగిక చర్య అనేది శారీరక శ్రమను కలిగించటమే కాదు, భావోద్వేగాలు నియంత్రించటంలో, బంధాల బలపరచటంలో అలాగే జీవన నాణ్యతను మెరుగుపరచటంలో మంచి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతే కాదు, దీర్ఘమైన శృంగార సెషన్ మీరు హాయిగా, సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. శృంగారానికి, నిద్ర మధ్య సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర, సెక్స్ ఈ రెండూ మీ ఆరోగ్యంలో అతిపెద్ద పాత్ర పోషిస్తాయి. ఈ రెండింటికి మధ్య గొప్ప కనెక్షన్ ఉంటుంది. అదెలా అంటే మంచి నిద్ర మీ సెక్స్ లైఫ్ నాణ్యతను మెరుగుపరుస్తుంటే.. సెక్స్ మీకు మంచి నిద్రను కల్పిస్తుంది. మంచి లైంగిక జీవనం కలిగిన వారు మంచి నిద్రను పొందుతారు, తద్వారా మంచి మానసిక, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారని పలు అధ్యయనాలు నిరూపించాయి.
ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. కనీసం 8 నుండి 9 గంటల విశ్రాంతి అవసరం. అయితే ఒక గొప్ప శృంగారం సెషన్లో పాల్గొన్న తర్వాత శరీరం అలసిపోతుంది. శరీరం చల్లబడుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో గాఢమైన నిద్రలోకి జారుకుంటారు. ఎలాంటి అంతరాయం లేని స్థిరమైన నిద్రను అనుభవిస్తారు. ఉదయం లేచినపుడు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది.
ఆరోగ్యకరమైన సెక్స్ సెషన్‌కు ముఖ్యమైన దశలు
నిద్రకు శృంగారానికి మధ్య ఉన్న అవినావభావ సంబంధాన్ని పైన వివరించుకున్నాం. అయితే ఆరోగ్యకరమైన సెక్స్ సెషన్ జరగాలంటే అందులో కొన్ని ముఖ్య దశలు ఉంటాయి. అవి
1. లిబిడో లేదా కోరిక:
ఏదో నామమాత్రంగా, యాంత్రికంగా మమ అనిపించేలా శృంగారం చేయకూడదు. సెక్స్ కోసం ఇద్దరి మధ్య సహజంగా కోరికలు రావాలి.
శృంగారం కోసం భాగస్వామితో పరస్పరం తహతహలాడాలి. ఒంటి శరీర వాసన ఆస్వాదించాలి, ప్రేమతో దగ్గరవ్వాలి.
2. ఉద్దీపన
నేరుగా కార్యం జరపకుండా ఫోర్ ప్లే చేసుకోవాలి. శరీర భాగాలను తాకుతున్నప్పుడు నరాలు జివ్వుమనిపించాలి. స్పర్శతో ఇద్దరిలో ప్రతిస్పందనలు కలగాలి. ఇవి ఇంకా పెరుగుతూ పోవాలి. అప్పుడే పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగి అది విస్తరిస్తుంది. అలాగే ఆడవారిలో యోని ఉత్సర్గను ఉత్పత్తి చేస్తుంది.కలయిక సాఫీగా జరిగేందుకు ఉపయోగపడుతుంది.
3. ఉద్వేగం
దీని క్లైమాక్స్ అని కూడా పిలుస్తారు, ఈ సెక్స్ దశ లైంగిక ప్రేరేపణ, ఆనందపు శిఖరం. ఉద్వేగానికి ముందు, శరీరం అంతటా కండరాల ఉద్రిక్తత పెరుగుతుంది. ఆడవారు వారి యోని కండరాలలో ఈ ఉద్రిక్తతను అనుభవించవచ్చు, ఇది ఉద్వేగానికి చేరుకున్నప్పుడు అనుభూతి చెందుతుంది. మగవారికి వీర్యం ఉత్పత్తి జరిగితే అప్పుడు హ్యాపీ ఎండింగ్.
సంబంధిత కథనం