Romantic Positions । చలికాలంలో చెలరేగడానికి అద్భుతమైన శృంగార భంగిమలు ఇవే!-romantic lovemaking positions to spice up your intimate relationship ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Romantic Positions । చలికాలంలో చెలరేగడానికి అద్భుతమైన శృంగార భంగిమలు ఇవే!

Romantic Positions । చలికాలంలో చెలరేగడానికి అద్భుతమైన శృంగార భంగిమలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 08:17 PM IST

Romantic Sex Positions: ఈ చలికాలంలో పడకగదిలో వేడి పుట్టించాలంటే కొన్ని అద్భుతమైన శృంగార భంగిమలను గురించి ఇక్కడ తెలుసుకోండి.

Romantic Sex Positions:
Romantic Sex Positions: (Freepik)

Romantic Sex Positions: శీతాకాలంలో శృంగారం వెచ్చగా, హాయిగా ఉంటుంది. రాత్రి గడిచేకొద్దీ, చలి తీవ్రత పెరిగేకొద్దీ దుప్పట్ల మధ్య దూరిపోయి భాగస్వాములు ఇద్దరూ ఏకమవుతున్న సమయంలో, మెత్తటి మృదువైన శరీర భాగాలు తాకుతుంటే నరాలు జివ్వుమనే అనుభూతి కలుగుతుంది.

జంటల శృంగారం తారాస్థాయికి చేరిన తర్వాత చిలకరింపుల పులకరింపులు ఎంతో సంతృప్తిని అందిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు ఒక్కసారిగా దూరమై గమ్మత్తుగా కమ్మటి నిద్రలోకి జారుకుంటారు. అందుకే అనేది సుఖమయ నిద్రకు సుఖ సంసారమే మార్గం అని.

అయితే ఈ చలిరాత్రులను వేడెక్కించడానికి ఎన్నో గొప్ప శృంగార భంగిమలు ఉన్నాయని మీకు తెలుసా? ఎముకలు కొరికే చలిలో చమటలు కక్కే అత్యుత్తమ సెక్స్ పొజిషన్‌లను గురించి ఇప్పుడు మేము మీకు వివరిస్తాము. స్వర్గ సుఖాలను అందించే ఈ భంగిమలతో చెలగిపోండి, అలసి సొలసి పరిపూర్ణ సంతృప్తితో నిదురపోండి.

మిషనరీ భంగిమ

ఈ భంగిమ సాధారణంగా అనిపించే ఆసాధారణమైన భంగిమ. ఈ భంగిమలో స్తీ వెల్లకిలా పడుకుంటే, ఆమె మేను మీదుగా పురుషుడు అల్లుకుపోతాడు. ఈ పొజిషన్ లో మీరే మీ భాగస్వామికి వెచ్చని దుప్పటిగా మారుతారు. మీరు వెచ్చగా ఉండేలా దుప్పటిని కప్పుకొని వెచ్చని శ్వాసలు మార్చుకోవచ్చు.

స్పూనింగ్

దీనిని కపుల్ స్పూనింగ్ అని కూడా అంటారు. ఈ భంగిమలో ఒక పక్కగా పడుకున్న మీ భాగస్వామిని వెనుక నుంచి లేదా ముందు నుంచి దగ్గరకు లాక్కొని పడుకోవడం. అప్పుడు రెండు నగ్నశరీరాలు ఒకదానికొకటి రుద్దుకుంటే అంతకంటే శృంగారభరితం మరొకటి ఏం ఉంటుంది.

69

ఇదొక సాహసోపేతమైన భంగిమ. ఈ భంగిమలో మీ భాగస్వామి పొత్తికడుపు కింది భాగం మీ ముఖంపైకి వస్తే, మీ పొత్తికడుపు కింది భాగం వారి ముఖానికి చేరువగా ఉంటుంది. రుచుల సువాసనల ఆస్వాదనకు ఇది అద్భుతమైన భంగిమ.

టాప్ పొజిషన్

చలికాలంలో సెగలు కక్కే స్త్రీని ఆపడం పురుషుడి తరమా? ఈ భంగిమలో పురుష భాగస్వామి కింద ఉంటే పైనుంచి స్త్రీ ఆక్రమిస్తుంది, పురుషుడి సర్వస్వాన్ని దోచుకునేందుకు ఈ భంగిమ ఒక అద్భుతం.

హాట్ డాగ్ పోజ్

ప్రతికుక్కకు ఒక రోజు అన్నట్లు ఒక్కోసారి మనుషుల కంటే కుక్కలే శృంగారంలో గొప్ప అనిపిస్తాయి, అలాంటిదే ఈ భంగిమ. వయ్యారంగా వంగిన స్త్రీ శరీరాన్ని, ఎక్కుపెట్టిన విల్లుతో వెనకనుంచి బాణాలు విసిరినట్లుగా ఉంటుంది.

ఆలుమగల బంధం బలోపేతం కావడానికి శృంగారం కూడా ఒక మార్గం. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలకు ఇది అద్భుత పరిష్కారం.

Whats_app_banner

సంబంధిత కథనం