Couple Spooning | భాగస్వామితో ఈ భంగిమలో పడుకుంటే సుఖమైన నిద్ర కలుగుతుందట!
భాగస్వామిని ఒక 10 నిమిషాల పాటు పెనవేసుకొని పడుకుంటే మంచి నిద్రతో పాటు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిద్రపట్టడం అనేది ఈ రోజుల్లో ఒక అంతుచిక్కని మిస్టరీగా మారింది. త్వరగా నిద్రపడితే మంచిదే కానీ నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా నిద్రరాకపోతే ఆ మరుసటి రోజు ఉదయం నరకమే. అయితే నిద్రపోడానికి ఎన్నో రకాల చిట్కాలు ఉంటాయి. మీరు అలాంటి చిట్కాలు పాటించినా ఫలితం లేదా? అయితే దిల్లీకి చెందిన నిద్ర, ఆరోగ్య నిపుణురాలైన నిహారిక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు.
భాగస్వామిని గట్టిగా హత్తుకొని 'స్పూనింగ్ పొజిషన్'లో పడుకుంటే మంచిగా నిద్రపట్టడమే కాకుండా ఇద్దరి మధ్య బంధం మరింత దృఢపడుతుందని ఆమె తెలిపారు.
ఈ స్పూనింగ్ పొజిషన్ ఏంటి అనుకుంటున్నారా? స్పూనింగ్ అంటే పెనవేసుకోవడం. మీరు మీ భాగస్వామితో నిద్రపోయేటపుడు వారిని వెనక నుంచి అంటే వారి వీపు మీ ఛాతికి తగిలేలా గట్టిగా హత్తుకోవాలి. చేతులతో దగ్గరకు లాక్కొని, కాళ్లతో పెనవేసుకొని పడుకోవాలి. దీనిని స్పూనింగ్ చేయడం అంటారు. ఈ భంగిమలో పడుకోవడాన్ని స్పూనింగ్ పొజిషన్ అని చెప్తున్నారు. ఇక్కడ కౌగిలించుకునే వ్యక్తి చిన్న చెంచా అని, కౌగిలి పొందే వ్యక్తిని పెద్ద చెంచా అని పిలుస్తున్నారు. ఇలా అల్లుకొని పడుకోవడం చూస్తే.. రెండు చంచాలను పక్కపక్కన పేర్చినట్లు ఉంటాయని దీనికి ఆ పేరు పెట్టారు.
భాగస్వామిని స్పూనింగ్ చేయడం వలన కలిగే ప్రయోజనం
నిద్రించేటపుడు భాగస్వామితో ఈ స్పూనింగ్ భంగిమలో కనీసం 10 నిమిషాలు పడుకోవాలి. ఇలా చేయడం వలన ఇరువురి శరీరాల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల జరుగుతుంది. దీంతో ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది మనిషిని శరీరకంగానే కాకుండా మానసికంగా చల్లబరుస్తుంది. ఇది ఆలుమగలను మరింత చేరువ చేసి వారి బంధాన్ని బలపరుస్తుంది. ఈ క్రమంలో సంతృప్తికరమైన పరిస్థితులకు లోనై ఎలాంటి అవరోధాలు లేని సుఖమయ నిద్రలోకి జారుకుంటారు అని నిపుణులు వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్