Newborn Baby Care in Winter। చలికాలంలో నవజాత శిశువులను వెచ్చగా నిద్రపుచ్చండి, ఇవిగో చిట్కాలు!
Newborn Baby Care in Winter: అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో సంరక్షణ చిట్కాలు చూడండి.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీ నవజాత శిశువులకు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లటి గాలి, పడిపోతున్న ఉష్ణోగ్రతలు నవజాత శిశువులకు చాలా హానికరం. అందువల్ల, తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డను అనారోగ్యం బారిన పడకుండా రక్షించడానికి వారిపై అదనపు శ్రద్ధ వహించాలి. మీ నవజాత శిశువు శరీరం పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు, కాబట్టి వారు మారుతున్న వాతావరణ పరిస్థితులకు తట్టుకోవడం సవాలుగా ఉంది. పైగా శిశువులకు ఏదైనా సమస్య వస్తే తెలుసుకోవడం కష్టం. కొన్నిసార్లు శిశువు ఏడుపుకు కారణం ఏమిటో అర్థం కాని పరిస్థితి. ప్రతీసారి వైద్యుల వద్దకు తీసుకెళ్లడం కూడా మీకు సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల శిశువుకు ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణ సృష్టించాలి.
Newborn Baby Care in Winter- చలికాలంలో నవజాత శిశువుల సంరక్షణ చిట్కాలు
ఈ చలికాలంలో నవజాత శిశువులకు చర్మం పొడిబారడం, పొట్టులా ఊడిపోవడం, డైపర్ల వలన కలిగే దద్దుర్లు, అసౌకర్యం, గరుకైన చర్మం, సాధారణ ఫ్లూ, ఇతర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఇలా జరగకుండా శిశువుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
గోరు వెచ్చని స్నానం
ఈ శీతాకాలంలో, శిశువులకు క్రమం తప్పకుండా స్నానం చేయించాల్సిన అవసరం లేదు. అయితే స్పాంజ్ వైప్‌లతో శరీరాన్ని సున్నితంగా తుడుస్తూ శుభ్రపరచవచ్చు. ఒకవేళ మీ బిడ్డకు స్నానం చేయించాల్సి వస్తే వేడి నీటిని ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఇది శిశువు చర్మం రక్షిత పొరకు హాని కలిగించవచ్చు. శిశువులకు ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితోనే స్నానం చేయించాలని సిఫారసు చేస్తారు. మీ నవజాత శిశువు అనారోగ్యం బారిన పడకుండా రక్షించడానికి ఇది చాలా ముఖ్యం.
ఆయిల్ మసాజ్
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి మీ నవజాత శిశువుకు క్రమం తప్పకుండా నూనెతో మసాజ్ చేయండి. ఈ ఆయిల్ మసాజ్‌లు పిల్లల శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. శిశువులకు మసాజ్ చేయడానికి అధిక నాణ్యత గల సహజ నూనెలను మాత్రమే ఎంచుకోండి. శిశువుల కోసం మీరు ఆలివ్, అశ్వగంధతో కలిపిన నూనెను ఉపయోగించవచ్చు.
నాసల్ డ్రాప్స్ ఉపయోగించండి
శీతాకాలంలో, చల్లని వాతావరణం కారణంగా పిల్లల ముక్కు తరచుగా బ్లాక్ అవుతుంది. ఇందుకోసం డాక్టర్ సూచించిన విధంగా నాసల్ డ్రాప్స్ ఉపయోగించండి. ఇది శిశువు నాసికా రంధ్రాలను తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నాసల్ డ్రాప్స్ అందుబాటులో ఉంచుకోవాలి, అయితే ఇష్టారీతిన వాడకూడదు.
వెచ్చని దుస్తులు
చల్లని వాతావరణం నుండి శిశువును రక్షించడానికి, అనేక దుస్తులను ధరింపజేయడానికి బదులు మృదువైన, శిశువు చర్మాన్ని చికాకు పెట్టని బట్టలు ఎంచుకోండి. వెచ్చని దుస్తులతో లేయర్లు వేయాలి. వారి తలకు టోపీ, చేతికి తొడుగులు తొడగడం మరిచిపోవద్దు.
చల్లటి ఆహారం తినిపించకండి
శీతాకాలం అంతా, మీ శిశువుకు చల్లని ఆహారాలను తినిపించడం పూర్తిగా మానేయాలి. అలాగే ఎప్పటికప్పుడు సిద్ధం చేసిన ఆహారాలనే తినిపించాలి. అంతకు ముందు మిగిల్చిన ఆహారాలను అస్సలు తినిపించకూడదు, ఇది వారిని అనారోగ్యానికి గురిచేస్తుంది. అలాగే ఈ శీతాకాలంలో అప్పుడప్పుడు శిశువుకు లేలేత సూర్యకిరణాలు తాకేలా చూడండి, ఒక పది నిమిషాల పాటు శిశువును ఎత్తుకొని బయట తిరగండి, ఇది వారి ఆరోగ్యానికి మంచిది.
సంబంధిత కథనం