Fenugreek Seeds For Hairs : అబ్బో.. మెంతులతో జుట్టుకు ఎన్ని ఉపయోగాలో..-hair growth tips use fenugreek seeds for hairs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fenugreek Seeds For Hairs : అబ్బో.. మెంతులతో జుట్టుకు ఎన్ని ఉపయోగాలో..

Fenugreek Seeds For Hairs : అబ్బో.. మెంతులతో జుట్టుకు ఎన్ని ఉపయోగాలో..

HT Telugu Desk HT Telugu
Apr 02, 2023 09:20 AM IST

Fenugreek Seeds For Hairs : చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ఇంట్లోనే చిట్కాలను ఉపయోగించి చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. జుట్టుకు మెంతులు చక్కగా ఉపయోగపడతాయి.

హెయిర్ టిప్స్
హెయిర్ టిప్స్

జుట్టు రాలడం(Hair Loss), చుండ్రు(Dandruff), జుట్టు పెరుగుదల(Hair Growth) ఆగడం లాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు కూడా కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలను(home remedies) పాటించి.. మీ జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. సులభంగా ఇంట్లో లభించే.. పదార్థాలతో మంచి చిట్కాను తయారు చేయోచ్చు. దీని వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం(Dry Hair), జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం, త‌ల‌లో దుర‌ద‌ వంటి జుట్టు సమస్యలకు(Hair Problems) చెక్ పెట్టొచ్చు.

ఈ చిట్కాను తయారు చేసేందుకు మెంతులను(Fenugreek) ఉపయోగించాలి. అలాగే.. పెరుగు(Curd), బాదం నూనెను, విటమిన్ ఈ క్యాప్సుల్స్, కలబంద(Aloe Vera) గుజ్జును ఉపయోగించాల్సి ఉంటుంది. మెుదట జుట్టుకు సరిపోయేంత మెంతులను తీసుకోవాలి. నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ మెంతులను జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, 2 విటమిన్ ఇ క్యాప్సుల్స్, ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టు(Hair) కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టించాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత తలస్నానం(Head Bath) చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. మీ జుట్టు రాలడం సమస్య సులభంగా తగ్గిపోతుంది. ఈ చిట్కా ఉపయోగిస్తే.. జుటు కుదుళ్లు ధృడంగా తయారు అవుతాయి. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. జుట్టు రాలడం తగ్గి మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బట్టతల సమస్య తలెత్తకుండా ఉంటుంది.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

సంబంధిత కథనం