గర్భధారణతో స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గర్భంతో ఉన్నప్పుడు పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు (Pregnant Women) ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు కాళ్ల పాదాలలో వాపులు (Swelling in Feet) రావడం సర్వసాధారణం. తరచుగా కాళ్లు, చీలమండలు, పాదాలు, వేళ్లు ఉబ్బినట్లుగా కొంత వాపు రావడం కనిపిస్తుంది. ఈ వాపులు సాధారణంగా కడుపులోని బిడ్డకు ఎలాంటి హాని కలిగించదు కానీ ఆ గర్భాన్ని మోసే స్త్రీకి ఈ సమస్య కొంత అసౌకర్యానికి గురిచేస్తుంది.
గర్భిణీ స్త్రీలకు పాదాలలో వాపు (Edema) రావడానికి గల కారణాలు, దీనిని ఎలా చికిత్స చేయవచ్చు, ఏ సమయంలో డాక్టరును సంప్రదించాలి మొదలైన అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి, హార్మోన్లలో కూడా మార్పులు జరుగుతాయి. దీనివల్ల గర్భిణీల శరీరం ఎక్కువ నీరు, ఇతర ద్రవాలను (Water and Fluids) కలిగి ఉంటుంది. కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ, గర్భిణీలు కూడా బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో అధిక బరువు (Weight Gaining) వారి కాళ్ళలోని సిరలపై ఒత్తిడిని వర్తింపజేస్తుంది. ఈ ఒత్తిడి సిరల నుండి ద్రవాలను, నీటిని విడుదల చేస్తుంది, తద్వారా గర్భిణీలకు తరచుగా చీలమండలు, పాదాలు ఉబ్బడానికి కారణమవుతుంది.
సరళంగా చెప్పాలంటే గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ శరీరం సాధారణం కంటే ఎక్కువ బరువు ఉంటుంది, ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది అందువల్ల వీరి బరువును మోసే పాదాలలో వాపు వస్తుంది.
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా నిలబడి ఉన్నప్పుడు ఈ పాదాల వాపు మొదలవుతుంది.
గర్భిణీలు సాధారణంగా ఉదయం పూట వాపును అనుభవిస్తారు, రోజంతా అది పురోగమిస్తుంది (Inflammation), సాయంత్రం లేదా రాత్రికి మరింత పెరుగుతుంది. అయితే సరైన విశ్రాంతి తీసుకుంటే ఆ వాపు తగ్గుతుంది.
పెరుగుతున్న గర్భం వలన కలిగే ఒత్తిడి వారి కాళ్ళలో రక్త ప్రవాహాన్ని (Blood Pressure) కూడా ప్రభావితం చేస్తుంది. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది, ఇది గుండెకు రక్తాన్ని తిరిగి పంపడం కష్టతరం చేస్తుంది.
సరైన విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా వాపు (pregnancy swelling) తగ్గకపోతే, పాదాల వాపును సీరియస్ గా పరిగణించాలి. ఇంకా, ఒక కాలులో మాత్రమే వాపు పెరిగితే, ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, చూపు మసకబారడం, ఛాతీ నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్య సహాయం పొందాలి.
గర్భిణీ స్త్రీలలో పాదాల వాపును తగ్గించేందుకు ఈ కింది చిట్కాలు (Remedies for Swollen Feet) పాటించండి.
- ప్రతి పాదాన్ని ఒక గాలిలో 8 సార్లు గుండ్రంగా తిప్పండి, మరొక 8 సార్లు మరొక వైపు తిప్పండి. ఇలా రెండు కాళ్లకు వ్యాయామం అందించండి. పాదాల వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, చీలమండలలో వాపును తగ్గిస్తాయి, కండరాలలో తిమ్మిరిని నివారిస్తాయి.
పాదాల వాపు తగ్గించేందుకు పై చిట్కాలను పాటించండి. గర్భిణీలకు పాదాలలో వాపు సాధారణమే అయినప్పటికీ క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తుండాలి.
సంబంధిత కథనం