తెలుగు న్యూస్ / ఫోటో /
Spices for Diabetes: మధుమేహంను అదుపు చేసే మసాలాలు, మూలికలు ఇవిగో!
Spices to Control the Sugar Level: భారతీయ వంటగదిలోని కొన్ని మసాలా దినుసులు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు డయాబెటిస్ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవేమిటో మీకు తెలుసా? తెలియకపోతే ఇక్కడ చూసి తెలుసుకోండి.
(1 / 6)
మీ వంటకాలలో కొన్ని మసాలాలు వాడితే మధుమేహం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అవేమిటో ఇక్కడ చూసి తెలుసుకోండి. (Freepik)
(2 / 6)
పసుపు: తాజా పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి మీ రోజువారీ వంటలలో తాజా పసుపును వేయండి. (Freepik)
(3 / 6)
దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. మధుమేహాన్ని నయం చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. (Freepik)
(4 / 6)
తులసి: తులసి ఆకు మధుమేహాన్ని నివారించే గుణాలు కలది. ఈ ఆకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. (Freepik)
(5 / 6)
వెల్లుల్లి: వెల్లుల్లిలో జింక్, యాంటీఆక్సిడెంట్లు సహా ఇతర అనేకమైన ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయి. రక్తంలో చక్కెరను నార్మల్‌గా ఉంచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో వెల్లుల్లి పనిచేస్తుంది. (Freepik)
ఇతర గ్యాలరీలు