(1 / 7)
మధుమేహాన్ని నివారించడంలో మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో చాలా గుణాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మెంతి టీ తాగడం ప్రయోజనకరమని.. దీనితో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని అంటారు. కానీ చాలా మందికి మెంతి టీ తయారు చేయడం రాదు. అయితే ఈ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(2 / 7)
ఈ టీ సిద్ధం చేయడానికి ముందుగా మెంతులు గింజలను బాగా పౌడర్ చేసుకోవాలి.
(3 / 7)
మరొక వైపు నీటిని వేడి చేయండి. ఆ వేడి నీళ్లను ఒక కప్పు తీసుకోండి. దానికి ఒక టీస్పూన్ మెంతిపొడి కలపండి.
(4 / 7)
ఇప్పుడు మీరు ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్‌తో వడకట్టవచ్చు. ఇది నీటి నుంచి మెంతి పొడిని వేరు చేస్తుంది. మెంతి టీ దాదాపు సిద్ధమైనట్లే.
(5 / 7)
దీని రుచిని పెంచుకోవడానికి మీరు దీనిని తేనెతో కలపి సేవించవచ్చు. ఇది మెంతి టీ నాణ్యతను మరింత పెంచుతుంది. మీరు తేనె తీసుకునేముందు.. అది మీకు సరైనదో.. కాదో.. వైద్యుడి సలహా తీసుకోండి.
(6 / 7)
ఇప్పుడు ఈ టీని వేడిగా తాగండి. ఇది మధుమేహం సమస్యను తగ్గిస్తుంది. ఇది కాకుండా జీర్ణ సమస్యలు కూడా కొద్దిగా తగ్గుతాయి.
(7 / 7)
చాలా మంది మెంతి నీటిని కూడా తీసుకుంటారు. దీనికోసం మెంతులను రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత నీటిని ఫిల్టర్ చేసి.. తులసి ఆకులను నీటిలో కలిపి మరిగించాలి. ఆ తర్వాత దానిని టీ లాగా తాగాలి. దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు