Telugu Cinema News Live September 23, 2024: OTT Murder Mystery: ఓటీటీలోకి తెలుగులో మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 23 Sep 202404:05 PM IST
- Chapra Murder Case OTT Streaming Date: అంచక్కల్లకోక్కన్ సినిమా తెలుగు వెర్షన్‍లో వచ్చేస్తోంది. చాప్రా మర్డర్ కేస్ పేరుతో తెలుగులో అందుబాటులోకి వస్తోంది. ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
Mon, 23 Sep 202403:36 PM IST
- Devara Movie Tickets: దేవర సినిమా టికెట్ ధరలపై తెలంగాణలోనూ క్లారిటీ వచ్చేసింది. అదనపు రేట్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఏపీ కంటే పెంపు తక్కువే ఉంది. అలాగే, అదనపు షోలకు కూడా అనుమతి లభించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Mon, 23 Sep 202401:39 PM IST
- Prathinidhi 2 OTT Release Date: ప్రతినిధి 2 సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో రిలీజైన చాలా రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
Mon, 23 Sep 202411:53 AM IST
- Devara Ticket Bookings: దేవర సినిమా టికెట్ల బుకింగ్స్ షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‍లో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. వేగంగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఆ వివరాలు ఇవే..
Mon, 23 Sep 202410:36 AM IST
- Chiranjeevi Guinness Record: చిరంజీవి తన గిన్నిస్ వరల్డ్ రికార్డు ను తనతో పని చేసిన నిర్మాతలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లకు అంకితమిచ్చాడు. ఆదివారం (సెప్టెంబర్ 22) అతడు ఈ అవార్డును ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే.
Mon, 23 Sep 202410:32 AM IST
- The GOAT Video Song: గోట్ సినిమా నుంచి అప్పడే ఓ పాట వీడియో ఫుల్‍గా వచ్చేసింది. మూవీకి హైలైట్‍గా నిలిచిన స్పెషల్ సాంగ్ వీడియో రిలీజ్ రిలీజ్ అయింది. దళపతి విజయ్, త్రిష పాటకు జోష్‍తో స్టెప్స్ వేశారు.
Mon, 23 Sep 202409:35 AM IST
- Bigg Boss 8 Telugu Promo: నామినేషన్లలో మరోసారి సోనియా హైలైట్ అయ్యారు. నబీల్, ఆదిత్యతో ఆమె గొడవ పడ్డారు. ఈ వారం నామినేషన్ల కూడా హీట్‍తో జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమోలు వచ్చాయి.
Mon, 23 Sep 202409:00 AM IST
- Bigg Boss 8 Telugu Wild Card Entries: బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్ లోకి ఒకేసారి నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఈవారమే వాళ్లు హౌజ్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు సెలబ్రిటీల పేర్లు కూడా కన్ఫమ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
Mon, 23 Sep 202408:58 AM IST
Mahesh Babu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం స్టార్ హీరో మహేష్‌బాబు కలిశాడు. వరద బాధితుల సహాయర్థం యాభై లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశాడు మహేష్‌బాబు. రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటోల్లో మహేష్‌బాబు పొడవైన హెయిర్‌స్టైల్, గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించారు.
Mon, 23 Sep 202408:43 AM IST
- Jani Master Case: జానీ మాస్టర్ కేసు ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. ఈ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాధితురాలికి మద్దతుగా ఉన్నారనే విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ పాత్ర ఏంటనే ప్రశ్న పుష్ప మూవీ నిర్మాతకు ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.
Mon, 23 Sep 202408:11 AM IST
Padutha Theeyaga Tv Show: తెలుగులో ఎక్కువ కాలం పాటు కొనసాగుతోన్న సింగింగ్ టీవీ షోగా పాడుతా తీయగా రికార్డ్ సృష్టించింది. తాజాగా మరో అరుదైన మైలురాయికి పాడుతా తీయగా చేరుకుంది. త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకోనున్న తొలి టీవీ షోగా నిలవనుంది.
Mon, 23 Sep 202407:56 AM IST
- Laapataa Ladies Oscars: ఆస్కార్స్ కు ఈసారి ఇండియా నుంచి లాపతా లేడీస్ మూవీ అధికారిక ఎంట్రీగా ఉండనుంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ మూవీ వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డు కోసం పోటీ పడనుంది.
Mon, 23 Sep 202407:16 AM IST
Political Thriller OTT: నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రతినిధి 2 మూవీకి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించాడు.
Mon, 23 Sep 202407:09 AM IST
- OTT Movie: ఓటీటీలోకి ఈ వారమే ఓ లీగల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. దీని గురించి ఇప్పటి వరకూ పెద్దగా తెలియకపోయినా.. పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమా.. మరో మూడు రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది.
Mon, 23 Sep 202406:03 AM IST
- Zee Telugu Serials TRP: ఆదివారం సీరియల్స్‌తో జీ తెలుగు ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కొన్నాళ్ల కిందటే బ్రేక్ లేకుండా ఆదివారం కూడా సీరియల్స్ ను ప్రసారం చేయనున్నట్లు సదరు ఛానెల్ వెల్లడించిన విషయం తెలుసు కదా.
Mon, 23 Sep 202405:35 AM IST
Bigg Boss: బిగ్‌బాస్ నాలుగో వారం నామినేషన్స్ మొత్తం గొడవలతోనే సాగినట్లుగా కొత్త ప్రోమోలో కనిపిస్తోంది. నామినేషన్స్‌లో పృథ్వీతో ఆదిత్య...నబీల్‌తో సోనియా గొడవలు పడినట్లుగా సోమవారం రిలీజ్ చేసిన ప్రోమోలో చూపించారు. ఈ వారి నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Mon, 23 Sep 202405:27 AM IST
- Hari Hara Veera Mallu Release Date: హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. సోమవారం (సెప్టెంబర్ 23) సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఈ మచ్ అవేటెడ్ గుడ్ న్యూస్ వెల్లడించారు. అంతేకాదు ఈరోజు నుంచే పవన్ తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడం విశేషం.
Mon, 23 Sep 202404:37 AM IST
OTT: తెలుగు హీరోయిన్ మాళవికా నాయర్ కృష్ణమ్ ప్రణయ సఖి మూవీతో కన్నడంలో ఎంట్రీ ఇచ్చింది. 2024లో కన్నడంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీగా నిలిచిన కృష్ణమ్ ప్రణయ సఖి ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Mon, 23 Sep 202404:12 AM IST
- NNS 23rd September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 23) ఎపిస్డోలో మనోహరిని అమర్ నిలదీయగా.. ఆమె ఏదో అబ్ధం చెప్పి తప్పించుకుంటుంది. అటు అంజు చేతికి తాయత్తు ఇస్తుంది మనోహరి.
Mon, 23 Sep 202403:40 AM IST
Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 23 ఎపిసోడ్‌లో రవి, శృతిల ప్రేమ విషయం భర్తకు చెబుతుంది మీనా. భార్య చెప్పిన మాటలు విని బాలు కోపగించుకుంటాడు. శృతిని రవి మర్చిపోవాల్సిందేనని అంటాడు. వారి ప్రేమ విషయంలో నీ జోక్యం తగ్గించుకుంటే మంచిదని మీనాకు బాలు వార్నింగ్ ఇస్తాడు
Mon, 23 Sep 202402:31 AM IST
- Janhvi Kapoor Telugu: జాన్వీ కపూర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అంతేకాదు బ్లూ కలర్ లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఇక్కడి ప్రేక్షకులకు తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసింది. దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇలా కనిపించింది.
Mon, 23 Sep 202402:06 AM IST
Brahmamudi : బ్రహ్మముడి సెప్టెంబర్ 23 ఎపిసోడ్‌లో సైకిల్‌పై వెళుతున్న కావ్యను కారుతో గుద్దుతాడు రాజ్. ఇంటికి రమ్మంటే రానన్నాననే కోపంతో రాజ్ కావాలనే తనకు యాక్సిడెంట్ చేశాడని కావ్య రచ్చ చేస్తుంది. కావ్య మాటలను సహించని రాజ్ ఇంకోసారి మా ఇంటి వైపు కన్నెత్తిచూడటానికి వీలు లేదని అంటాడు.
Mon, 23 Sep 202402:06 AM IST
- OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఓ బ్లాక్‌బస్టర్ మలయాళ మూవీ వచ్చేసింది. మలయాళం, తెలుగుతోపాటు మరో మూడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ కామెడీ డ్రామా థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.
Mon, 23 Sep 202401:36 AM IST
- Karthika deepam 2 serial today september 23rd episode: ఎల్లుండి శ్రీకాంత్ తో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత మీరిద్దరూ అమెరికా వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకోండి అని శ్రీధర్ కూతురు స్వప్నతో చెప్తాడు. ఈ మాటలు చాటుగా కాశీ విని పెళ్లి ఎలాగైనా ఆపాలని అనుకుంటాడు.
Mon, 23 Sep 202412:48 AM IST
NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో మీ కంటే నేనే ఎక్కువ బాధపడుతున్నానని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్ అన్నాడు. ఈ రోజు కలవకపోయినా సెప్టెంబర్ 27న థియేటర్లలో కలుద్దామని ఎన్టీఆర్ చెప్పాడు.