OTT Movie: ఓటీటీలోకి ఈవారమే వస్తున్న సరికొత్త లీగల్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Movie: ఓటీటీలోకి ఈ వారమే ఓ లీగల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. దీని గురించి ఇప్పటి వరకూ పెద్దగా తెలియకపోయినా.. పలువురు ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమా.. మరో మూడు రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది.
OTT Movie: ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా స్టార్లను కాకుండా కథనే నమ్ముకొని వస్తున్న సినిమాలకు ఓటీటీల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో అలాంటిదే మరో ఇంట్రెస్టింగ్ లీగల్ థ్రిల్లర్ సినిమా రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సోమవారం (సెప్టెంబర్ 23) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
ఆర్టీఐ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్
ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పేరు ఆర్టీఐ. వచ్చే గురువారం (సెప్టెంబర్ 26) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు అయిన రవిశంకర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, శశాంక్ లాంటి నటీనటులు నటించిన ఈ మూవీ పోస్టర్ కూడా ఇంటెన్స్ గా ఉంది.
"జనాలకు ఆర్టీఐ పవరేమిటో తెలియాలి.. ఆర్టీఐ సెప్టెంబర్ 26న ఈటీవీ విన్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.
ఆర్టీఐ చట్టం గురించి..
ఆర్టీఐ.. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. సమాచార హక్కు చట్టం. 2005లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా సాధారణ పౌరుడు ఎలాంటి సమాచారం అయినా కోరే హక్కును సంపాదించారు. అయితే ఈ చట్టం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు.
మరి అంత శక్తివంతమైన చట్టం గురించి చెబుతూ ఈ ఆర్టీఐ మూవీ సాగనుంది. రవిశంకర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటీనటులు ఉండటంతో ఈ మూవీ ఆసక్తి రేపుతోంది. పోస్టర్ లోనూ రవిశంకర్, వరలక్ష్మి ఇద్దరు పవర్ ఫుల్ లాయర్ల పాత్రల్లో నటించినట్లు కనిపిస్తున్నారు.
ఈటీవీ విన్ మూవీస్
ఈటీవీ విన్ ఓటీటీ కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే అందిస్తున్న డిజిటల్ ప్లాట్ ఫామ్. ఈటీవీకి అనుబంధంగా ఈ ఓటీటీ పని చేస్తోంది. ఇందులో అన్ని ఈటీవీ సీరియల్స్, షోలతోపాటు ఒరిజనల్స్, కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనూ ఈటీవీ విన్ ఓటీటీలోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి.
గత నెలలో థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన కమిటీ కుర్రోళ్లు మూవీతోపాటు వరుణ్ సందేశ్ నటించిన నింద, దీపావళి, సురాపానం, సోపతులు, మ్యూజిక్ షాప్ మూర్తి, చిత్రం చూడర, మాయా పేటిక, డియర్ నాన్న, వీరాంజనేయులు విహారయాత్రలాంటి సినిమాలు ప్రస్తుతం ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.