Mahesh Babu: తెలంగాణ సీఏంను క‌లిసిన మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి మూవీ లుక్ ఇదేనా?-hero mahesh babu meets telangana cm revanth reddy and donated 50 lakhs to cm relief fund ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: తెలంగాణ సీఏంను క‌లిసిన మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి మూవీ లుక్ ఇదేనా?

Mahesh Babu: తెలంగాణ సీఏంను క‌లిసిన మ‌హేష్‌బాబు - రాజ‌మౌళి మూవీ లుక్ ఇదేనా?

Nelki Naresh Kumar HT Telugu
Sep 23, 2024 02:39 PM IST

Mahesh Babu: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని సోమ‌వారం స్టార్ హీరో మ‌హేష్‌బాబు క‌లిశాడు. వ‌ర‌ద బాధితుల స‌హాయ‌ర్థం యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని ముఖ్య‌మంత్రికి అంద‌జేశాడు మ‌హేష్‌బాబు. రేవంత్ రెడ్డిని క‌లిసిన ఫొటోల్లో మ‌హేష్‌బాబు పొడ‌వైన హెయిర్‌స్టైల్‌, గ‌డ్డంతో కొత్త లుక్‌లో క‌నిపించారు.

తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డితో మహేష్ బాబు
తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డితో మహేష్ బాబు

Mahesh Babu: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ అగ్ర హీరో మ‌హేష్ బాబు క‌లిశారు. వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం తెలంగాణ సీఏం రిలీఫ్ ఫండ్‌కు యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ విరాళాన్ని మ‌హేష్‌బాబు అంద‌జేశారు. సోమ‌వారం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి త‌న స‌తీమ‌ణి న‌మ్ర‌తాతో క‌లిసి వ‌చ్చిన మ‌హేష్‌బాబు యాభై ల‌క్ష‌ల చెక్‌ను సీఏంకు అంద‌జేశారు. వ్య‌క్తిగ‌తంగా యాభై ల‌క్ష‌లు వ‌ర‌ద సాయం అందించిన మ‌హేష్‌బాబు... ఏఎమ్‌బీ సినిమాస్ త‌ర‌ఫున త‌న భాగ‌స్వాముల‌తో క‌లిసి మ‌రో ప‌ది ల‌క్ష‌లువిరాళాన్ని ముఖ్య‌మంత్రికి అంద‌జేశారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌...

సీఏం రేవంత్ రెడ్డిని మ‌హేష్‌బాబు క‌లిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఇందులో పొడ‌వాటి జ‌ట్టు, గ‌డ్డంతో స్టైలిష్ లుక్‌లో మ‌హేష్‌బాబు క‌నిపిస్తోన్నాడు. మ‌హేష్ కొత్త లుక్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

లుక్‌తోనే హైప్‌...

రాజ‌మౌళి మూవీ కోస‌మే మ‌హేష్‌బాబు ఈ లుక్‌లోకి మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంద‌రూ టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌తో సినిమాకు బ‌జ్ తీసుకొస్తే మ‌హేష్ మాత్రం త‌న లుక్‌తోనే భారీగా హైప్ పెంచుతున్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో రాజ‌మౌళి పొడ‌వాటి హెయిర్‌స్టైల్‌, గ‌డ్డంతోనే క‌నిపిస్తాడ‌ని అంటున్నారు.

1000 కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు 1000 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్‌తో మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌హేష్, రాజ‌మౌళి మూవీలో వివిధ భార‌తీయ భాష‌ల‌కు చెందిన ప‌లువురు న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో న‌టించ‌నున్న‌ట్లు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, విక్ర‌మ్‌తో పాటు ప‌లువురు స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

29వ మూవీ...

మ‌హేష్‌బాబు కెరీర్‌లో 29వ మూవీ ఇది. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తోన్నారు. హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫ్రాంచైజ్ ఇండియానా జోన్స్ త‌ర‌హాలో మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీ ఉన్న‌ట్లు చెబుతోన్నారు.ఈ ఏడాది చివ‌ర‌లో ఈ మూవీ సెట్స్‌పైకి రానున్న‌ట్లు స‌మాచారం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలిసింది. 2026లోఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

గుంటూరు కారం...

కాగా ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు మ‌హేష్‌బాబు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. గుంటూరు కారం మూవీలో శ్రీలీల మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. త్రివిక్ర‌మ్‌, టేకింగ్‌, మేకింగ్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూవీ వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అయినా నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నే తెచ్చిపెట్టింది.