CM Revanth Reddy : పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్-పెండింగ్ రాయితీలు చెల్లిస్తామని ప్రకటన-hyderabad cm revanth reddy released new msme policy 2024 promised to continue subsidies ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్-పెండింగ్ రాయితీలు చెల్లిస్తామని ప్రకటన

CM Revanth Reddy : పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్-పెండింగ్ రాయితీలు చెల్లిస్తామని ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Sep 18, 2024 07:51 PM IST

CM Revanth Reddy : తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమీ చేయాలనేది మా లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నానన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పాలసీని సీఎం విడుదల చేశారు.

పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్-పెండింగ్ రాయితీలు చెల్లిస్తామని ప్రకటన
పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్-పెండింగ్ రాయితీలు చెల్లిస్తామని ప్రకటన

CM Revanth Reddy : తెలంగాణలో ఎంఎస్ఎంఈలు బలపడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి పరిశ్రమలు రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రజా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఒక పాలసీ లేకుండా ఏ రంగం కూడా అభివృద్ధి సాధించలేదని, అందుకే తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పాలసీ-2024 తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎంఎస్ఎంఈలు బలపడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలు భాగస్వామిగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నానని, అందుకు ఎంఎస్ఎంఈల సహాకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చెప్పారు.రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలను కొనసాగిస్తామని, పెండింగ్ రాయితీలను కూడా చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

అదే మా లక్ష్యం

"రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే లక్ష్యం. ఈ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తుంది. పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ విషయంలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ఆ వర్గాలకు అవసరమైన భూముల కేటాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పిస్తాము"- సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సమగ్రాభివృద్ధికి అనేక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఆ కోవలోనే తెలంగాణలో ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్, దానికి సమాంతరంగా రీజినల్ రింగ్ రోడ్డు, ఈ రెండింటి మధ్య రేడియల్ రోడ్లతో పెట్టుబడుల కోసం సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను రచించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. పెట్టుబడుల కోసం అనేక దేశాలు చైనా ప్లస్ వన్ బాట పట్టాయని, పెట్టుబడులకు ప్రత్యామ్నాయం తెలంగాణ మాత్రమేనని ఈ రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులను సీఎం సమగ్రంగా వివరించారు.