OTT Murder Mystery: ఓటీటీలోకి తెలుగులో మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Chapra Murder Case OTT Streaming Date: అంచక్కల్లకోక్కన్ సినిమా తెలుగు వెర్షన్‍లో వచ్చేస్తోంది. చాప్రా మర్డర్ కేస్ పేరుతో తెలుగులో అందుబాటులోకి రానుంది. ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
ఉల్లాస్ చంబన్ దర్శకత్వం వహించిన అంచక్కల్లకోక్కన్ చిత్రం ఈ ఏడాది మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. ఈ మలయాళం మర్డర్ మిస్టరీ యాక్షన్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీలో నరేషన్‍పై ప్రశంసలు వచ్చాయి. అంచక్కల్లకోక్కన్ చిత్రం ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. ‘చాప్రా మర్డర్ కేస్’ పేరుతో ఈ చిత్రం తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.
ఓటీటీ రిలీజ్ వివరాలివే
చాప్రా మర్డర్ కేస్ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సెప్టెంబర్ 26వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.
అంచక్కల్లకోక్కన్ మలయాళం వెర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమానే తెలుగులో చాప్రా మర్డర్ కేస్ పేరుతో ఆహా ఓటీటీలోకి సెప్టెంబర్ 26న అడుగుపెట్టనుంది. ఇటీవల కొన్ని మలయాళం చిత్రాలను తెలుగు ఆడియోతో ఆహా తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే చాప్రా మర్డర్ కేస్‍ను స్ట్రీమింగ్‍కు తెస్తోంది.
చాప్రా మర్డర్ కేస్ (అంచక్కల్లకోక్కన్) చిత్రంలో లుక్‍మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్ లీడ్ రోల్స్ చేశారు. మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్, మెరిన్ మేరీ ఫిలిప్, శ్రీజిత్ రవి, సెంథిల్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని డైరెక్టర్ ఉల్లాస్ చంబన్ తెరకెక్కించారు. ఓ మర్డర్ కేసును పోలీసులు ఛేదించడం చుట్టూ ఈ మూవీ సాగుతోంది.
చాప్రా మర్డర్ కేస్ మూవీని చెంబోస్కి మోషన్ పిక్చర్స్ పతాకంపై చెంబన్ వినోద్ జోస్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీ సుమారు రూ.55కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఈ చిత్రానికి మణికందన్ అయ్యప్ప సంగీతం అందించారు.
స్టోరీలైన్
చాప్రా మర్డర్ కేస్ చిత్రం 1980ల బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది. కేరళ - కర్ణాటక సరిహద్దు గ్రామంలో స్టోరీ నడుస్తుంది. భూస్వామి అయిన చాప్రా (శ్రీజిత్ రవి) హత్యకు గురవుతారు. అప్పుడే అక్కడి పోలీస్ స్టేషన్‍కు వాసుదేవన్ (లుక్మన్ అవరన్) కానిస్టేబుల్‍గా వస్తాడు. అప్పటికే హెడ్ కానిస్టేబుల్ నందవరంబన్ పీటర్ (చెంబన్ వినోద్ జోస్) పట్టుకలిగి ఉంటాడు. చాప్రా హత్య కేసును వీరి విచారిస్తారు. తన తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చాప్రా కుమారులు కూడా కసిగా ఉంటారు. ఈ క్రమంలో స్టోరీలో మలుపులు ఉంటాయి. ఆ తర్వాత ఏమైంది? చాప్రాను చంపిందెవరు? మిస్టరీ వీడిందా? అనేవి ఈ మూవీలో ఉంటాయి.
ప్రతినిధి 2 కూడా ఈవారమే
ప్రతినిధి 2 చిత్రం కూడా ఈ వారమే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ పొటిలికల్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 27న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం ఆహాలోకి వస్తోంది. ప్రతినిధి 2 మూవీకి మూర్తి దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. సెప్టెంబర్ 27 నుంచి ఆహాలో ప్రతినిధి 2 చూసేయవచ్చు.