OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ డ్రామా.. మరో నాలుగు భాషల్లోనూ..-ott malayalam comedy movie vaazha biopic of a billion boys now streaming on disney plus hotstar in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ డ్రామా.. మరో నాలుగు భాషల్లోనూ..

OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ డ్రామా.. మరో నాలుగు భాషల్లోనూ..

Hari Prasad S HT Telugu
Sep 23, 2024 07:36 AM IST

OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఓ బ్లాక్‌బస్టర్ మలయాళ మూవీ వచ్చేసింది. మలయాళం, తెలుగుతోపాటు మరో మూడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ కామెడీ డ్రామా థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.

ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ డ్రామా.. మరో నాలుగు భాషల్లోనూ..
ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ డ్రామా.. మరో నాలుగు భాషల్లోనూ..

OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఈవారం మొదది రోజే ఓ బ్లాక్ బస్టర్ మలయాళం సినిమా వచ్చింది. సాధారణంగా వీకెండ్స్ లోకి ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు సోమవారం (సెప్టెంబర్ 23) నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు వాజా.

వాజా ఓటీటీ స్ట్రీమింగ్

వాజా బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్ ఈ ఏడాది మలయాళంలో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో రూపొంది.. రూ.40 కోట్లు వసూలు చేసిన మూవీ ఇది.

ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజై ఈ మూవీ.. ఇప్పుడు సోమవారం (సెప్టెంబర్ 23) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో ఇక్కడి మలయాళీ సినిమా లవర్స్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.

వాజా మూవీ గురించి..

వాజా మూవీని ఆనంద్ మేనన్ డైరెక్ట్ చేయగా.. విపిన్ దాస్ కథ అందించాడు. సిజు సన్నీ, సాఫ్ బ్రోస్, జోమోన్ జ్యోతిర్, జగదీశ్, కొట్టాయం నజీర్, అజీస్ నెడుమంగడ్, నోబీ మార్కోస్ లాంటి వాళ్లు నటించారు. ఆగస్ట్ 15న రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వాజా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనీ పాటా లేకుండా సోమరులుగా తిరిగే వాళ్ల కోసం కూడా ఇదే పదాన్ని వాడతారు. మూవీ కూడా అలాంటి ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరిగేదే. జీవితంలో ఏమీ సాధించక లూజర్స్ అంటూ అందరూ వాళ్లను తిడుతుంటారు. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఇంట్లో పేరెంట్స్, సమాజం నుంచీ వాళ్లపై ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది.

ఏదో సాధించి తమను తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్లలాగే ఇలాంటి పరిస్థితి అనుభవిస్తున్న కోట్లాది మంది యువత తమను తాము ఈ సినిమాలోని ఐదుగురు స్నేహితుల్లో చూసుకుంటూ కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సినిమాకు వాజా బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్ అనే పేరు పెట్టడం విశేషం. మూవీ స్టోరీ, నవ్వించే డైలాగులు, డైరెక్షన్, మ్యూజిక్.. ఇలా అన్నింటిలోనూ వాజా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అందుకే కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఓటీటీలో మలయాళంతోపాటు మరో నాలుగు భాషల్లో రావడంతో హాట్‌స్టార్ లోనూ ఈ వాజా మూవీ సూపర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.