OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్-ott malayalam crime thriller cid ramachandran retd si streaming now on manorama max ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Crime Thriller: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Hari Prasad S HT Telugu
Sep 20, 2024 05:04 PM IST

OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్న ఈ సినిమా శుక్రవారమే (సెప్టెంబర్ 20) డిజిటల్ ప్రీమియర్ కు రావడం విశేషం.

ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. మే 17వ తేదీని థియేటర్లలో రిలీజైన సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ మూవీ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా రిలీజైన సమయంలో పాజిటివ్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు రావడంతోపాటు ఐఎండీబీలో మంచి రేటింగ్ కూడా వచ్చింది.

సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ ఓటీటీ

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సనూప్ సత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళాభవన్ షాజాన్, బైజు సంతోష్, సుధీర్ కరమన నటించారు. ఈ ఏడాది మే 17న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అన్యాయంగా కేసులో ఇరుక్కున్న ఓ గ్రామీణ ప్రాంత అమాయకుల కేసును ఓ రిటైర్డ్ ఎస్ఐ దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో అసలు నిజాలను బయటకు తీయడంతోపాటు ఆ నేరం చేసిన వారికి శిక్ష పడేలా చేస్తాడు.

ఈ సినిమాలో షాజాన్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఊర్మిళ అనే హౌజ్‌వైఫ్ మర్డర్ కేసు చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని చాలా ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్ సనూప్ సత్యన్. థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ థ్రిల్లర్ ను ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ ఆశతో ఉన్నారు.

మరో తమిళ థ్రిల్లర్ కూడా..

ఓటీటీలోకి శుక్రవారం (సెప్టెంబర్ 20) మరో తమిళ థ్రిల్లర్ మూవీ కూడా వచ్చింది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కే రావడం విశేషం. ముందు నుంచీ పెద్దగా ప్రమోషన్లేవీ లేని ఈ సినిమా.. శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే మూవీ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తోపాటు డిఫరెంట్ టైటిల్ తోనూ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఈ మూవీ ఆకర్షిస్తోంది.

నేరుగా ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చిన సినిమా పేరు డోపమైన్@2.22. ఇదొక తమిళ థ్రిల్లర్ మూవీ. అయితే ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం మాత్రం లేదు. రూ.99 రెంట్ చెల్లించి చూసే వీలు కల్పించింది ప్రైమ్ వీడియో ఓటీటీ. ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.