OTT Thriller Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తమిళ థ్రిల్లర్ మూవీ.. ఆ ఒక్క ట్విస్టుతోనే..
OTT Thriller Movie: ఓ తమిళ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. అసలు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్ గా ఈ సినిమా వచ్చింది.
OTT Thriller Movie: తమిళ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ముందు నుంచీ పెద్దగా ప్రమోషన్లేవీ లేని ఈ సినిమా.. శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే మూవీ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తోపాటు డిఫరెంట్ టైటిల్ తోనూ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఈ మూవీ ఆకర్షిస్తోంది.
డోపమైన్ ఓటీటీ స్ట్రీమింగ్
నేరుగా ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చిన సినిమా పేరు డోపమైన్@2.22. ఇదొక తమిళ థ్రిల్లర్ మూవీ. అయితే ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం మాత్రం లేదు. రూ.99 రెంట్ చెల్లించి చూసే వీలు కల్పించింది ప్రైమ్ వీడియో ఓటీటీ. ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
డోపమైన్ స్టోరీ ఏంటంటే?
డోపమైన్@2.22 ఏడుగురు వేర్వేరు వ్యక్తులు, ఓ హత్య చుట్టూ తిరిగే స్టోరీ. ఈ ఏడుగురు వ్యక్తుల్లో ఒకరికొకరికి ఎలాంటి సంబంధం లేదు. అయితే వాళ్లకు ఉన్న ఓ వ్యసనమే ఓ అపార్ట్‌మెంట్ లో వాళ్లను ఒక్కచోటికి చేరుస్తుంది. అక్కడే సరిగ్గా 2.22 గంటలకు ఓ హత్య జరుగుతుంది.
అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఎలా జరిగింది? దానికి వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? మనిషి శరీరంలో ముఖ్యమైన హార్మోన్ ఈ డోపమైన్. ఇది కాస్త ఎక్కువైనా, తక్కువైనా తీవ్ర మానసిక, నాడీ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ పాయింట్ ను బేస్ చేసుకొనే దర్శకుడు ధీరవ్ మూవీని తెరకెక్కించాడు.
ఈ సినిమా సింప్లీ సౌత్ అనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతున్నా.. ప్రస్తుతానికి అది ఇండియాలోని ప్రేక్షకులకు కాకుండా కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
డోపమైన్ మూవీ గురించి..
డోపమైన్ మూవీని ధీరవ్ డైరెక్ట్ చేయగా.. ఇందులో తిరవ్, విజయ్ డ్యూక్, విపిత, నిఖిల శంకర్, సత్యలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీని పూర్తిగా చెన్నైలోనే కేవలం 20 రోజుల్లోనే షూట్ చేయడం విశేషం.
మూవీకి పెద్దగా ప్రమోషన్లు లేకుండా నేరుగా ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేసి నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు. డోపమైన్ స్థాయిలు పెరగడం వల్లే మూవీలో ఆ హత్య జరిగినట్లుగా చూపించారు. అయితే అది ఎవరు, ఎందుకు, ఎలా చేశారన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది.