Bigg Boss 8 Nominations: హౌజ్‌లో పృథ్వీ, సోనియా ర‌చ్చ - ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ వీళ్లే!-bigg boss 8 telugu contestants nominated for elimination in fourth week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Nominations: హౌజ్‌లో పృథ్వీ, సోనియా ర‌చ్చ - ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ వీళ్లే!

Bigg Boss 8 Nominations: హౌజ్‌లో పృథ్వీ, సోనియా ర‌చ్చ - ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ వీళ్లే!

Nelki Naresh Kumar HT Telugu
Sep 23, 2024 11:06 AM IST

Bigg Boss: బిగ్‌బాస్ నాలుగో వారం నామినేష‌న్స్ మొత్తం గొడ‌వ‌ల‌తోనే సాగిన‌ట్లుగా కొత్త ప్రోమోలో క‌నిపిస్తోంది. నామినేష‌న్స్‌లో పృథ్వీతో ఆదిత్య‌...న‌బీల్‌తో సోనియా గొడ‌వ‌లు ప‌డిన‌ట్లుగా సోమ‌వారం రిలీజ్ చేసిన ప్రోమోలో చూపించారు. ఈ వీక్ నామినేష‌న్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్ నామినేష‌న్స్
బిగ్‌బాస్ నామినేష‌న్స్

Bigg Boss 8 Nominations: బిగ్‌బాస్‌ను తిట్ట‌డ‌మే కాకుండా త‌న‌ను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నందుకు అభ‌య్ న‌వీన్‌కు గ‌ట్టి ప‌నిష్‌మెంట్ ప‌డింది. మూడో వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ కావాల్సివ‌చ్చింది. ఓటింగ్ త‌క్కువ వ‌చ్చినందుకే అభ‌య్ ఎలిమినేట్ అయిన‌ట్లు సండే ఎపిసోడ్‌లో నాగార్జున అన్నాడు. బిగ్‌బాస్‌ను తిడితే ప‌రిణామాలు ఇలాగే ఉంటాయ‌ని మిగిలిన కంటెస్టెంట్స్‌కు హెచ్చ‌రిక‌ను జారీచేశాడు.

బిగ్‌బాస్ కొత్త ప్రోమో...

నాలుగో వారం నామినేష‌న్స్ కూడా గొడ‌వ‌ల‌తో సాగిన‌ట్లుగా బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో చూపించారు. సోమ‌వారం రిలీజ్ చేసిన ప్రోమోలో ఆదిత్య‌, పృథ్వీ ఒక‌రినొక‌రు గ‌ట్టిగా వాదించుకున్నారు. ఆ త‌ర్వాత న‌బీల్ త‌న‌ను నామినేట్ చేయ‌డం సోనియా స‌హించ‌లేక‌పోతుంది. ఈ ఇద్ద‌రు గొడ‌వ‌ప‌డిన‌ట్లుగా ప‌డిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

ఫోమ్ స్ప్రే టాస్క్‌...

ప్రోమో ఆరంభంలో నామినేష‌న్స్ ప్ర‌క్రియ ఈ రోజు మొద‌వుతుంద‌ని చెప్పిన బిగ్‌బాస్... ఫోమ్ స్ప్రే టాస్క్‌ను కంటెస్టెంట్స్‌కు బిగ్‌బాస్ ఇచ్చాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో కొన‌సాగ‌డానికి ఎవ‌రు అర్హులో..ఎవ‌రు అన‌ర్హులో చెబుతూ ఇద్ద‌రు కంటెస్టెంట్స్‌పై ఫోమ్ స్ప్రే చేయాల‌ని కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ ఆదేశించాడు.

పృథ్వీతో నామినేట్ చేసిన ఆదిత్య‌...

పృథ్వీని ఆదిత్యం ఓం నామినేట్ చేశాడు. మీరు ఇన్‌స‌ల్ట్ గ‌ట్టిగా చేస్తారు. కానీ అపాల‌జీ మాత్రం అంత గ‌ట్టిగా వినిపించ‌ద‌ని పృథ్వీతో ఆదిత్యం ఓం అన్నాడు. నేను మిమ్మ‌ల్ని ఇన్‌స‌ల్ట్ చేయ‌లేదు అంటూ ఆదిత్య‌తో పృథ్వీ వాదించాడు. మీరు నాకు వార్నింగ్ ఇచ్చిన‌ప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి అంటూ ఆదిత్య‌కు పృథ్వీ స‌మాధాన‌మిచ్చాడు.

సోనియా వ‌ర్సెస్ న‌బీల్‌...

ఆ త‌ర్వాత సోనియాను న‌బీల్ నామినేట్ చేసిన‌ట్లుగా ప్రోమోలో క‌నిపిస్తుంది. నువ్వు గ‌ట్టి గ‌ట్టిగా అరుస్తున్నావ‌ని, న‌రాల‌న్నీ క‌నిపిస్తున్నాయ‌ని, ఆ అరుపుల కార‌ణంగా నా మాట నీకు వినిపించ‌డం లేద‌ని సోనియాతో న‌బీల్ అన్నాడు. న‌బీల్ మాట్లాడుతుండ‌గా అడ్డుకొని సోనియా అత‌డితో గొడ‌వ‌ప‌డింది. నా టోన్ గురించి కంప్లైంట్ చేయ‌డానికి నువ్వు ఎవ‌రూ అంటూ న‌బీల్ కోపంగా అన్నాడు.

మ‌ణికంఠ నామినేట్‌...

ఆ త‌ర్వాత మ‌ణికంఠ‌ను నైనిక నామినేట్ చేసింది. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేక‌పోతే వేరేవాళ్ల కాన్ఫిడెన్స్ త‌గ్గించొద్ద‌ని అత‌డికి క్లాస్ ఇచ్చింది. ఆ త‌ర్వాత న‌బీల్‌, పృథ్వీ కూడా గొడ‌వ‌ప‌డిన‌ట్లుగా ప్రోమోలో క‌నిపిస్తుంది. నేను ఇక్క‌డే ఉంటా అంటూ న‌బీల్‌తో కోపంగా పృథ్వీ అరిచిన‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

ఫ‌స్ట్ మూడు రోజుల్లో క‌నిపించిన సోనియా ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ని సోనియాతో ఆదిత్య అన్నాడు. తాను మాట్లాడుతోండ‌గా అడ్డువ‌చ్చిన సోనియాపై బిగ్‌బాస్‌కు న‌బీల్ కంప్లైంట్ ఇచ్చాడు. నామినేష‌న్స్ మొత్తం గొడ‌వ‌లతోనే సాగిన‌ట్లు ప్రోమో చూస్తుంటే క‌నిపిస్తోంది. ఒక‌రికొక‌రు పోటీప‌డి వార్నింగ్‌లు ఇచ్చ‌కునున్న‌ట్లుగా ప్రోమోలో చూపించారు.

నామినేష‌న్స్‌లో ఏడుగురు…

మొత్తంగా నాలుగో వారంనామినేష‌న్స్‌లో మ‌ణికంఠ‌, ప్రేర‌ణ‌, ఆదిత్య‌, పృథ్వీ, సోనియా, న‌బీల్, నైనిక ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వారం ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా ఆడ‌ట‌మే కాకుండా టాస్క్‌లు అద్భుతంగా ఆడిన య‌ష్మి, నిఖిల్‌, సీత‌, విష్ణుప్రియ సేఫ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ వారం బిగ్‌బాస్ నుంచి సోనియా ఎలిమినేట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.