Thalapathy Vijay GOAT: ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే గోట్ నుంచి విజయ్, త్రిష స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
The GOAT Video Song: గోట్ సినిమా నుంచి అప్పడే ఓ పాట వీడియో ఫుల్‍గా వచ్చేసింది. మూవీకి హైలైట్‍గా నిలిచిన స్పెషల్ సాంగ్ వీడియో రిలీజ్ రిలీజ్ అయింది. దళపతి విజయ్, త్రిష పాటకు జోష్‍తో స్టెప్స్ వేశారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ (ది గోట్) భారీ అంచనాలతో వచ్చింది. అయితే, సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్ దక్కినా.. ఆ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్ చేశారు. ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ నేడు (సెప్టెంబర్ 23) రిలీజ్ అయింది.
ది గోట్ చిత్రంలో దళపతి విజయ్‍తో కలిసి స్టార్ హీరోయిన్ త్రిష ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీశారు. ఈ పాట మూవీకి హైలైట్‍గా నిలిచింది.
వీడియో సాంగ్ రిలీజ్
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్ మూవీలో దళపతి విజయ్, త్రిష స్పెషల్ సాంగ్‍కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మాస్ బీట్‍కు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. పోటాపోటీగా స్టెప్స్ వేసి వారెవా అనిపించారు. ముఖ్యంగా చీరకట్టులో త్రిష లుక్, డ్యాన్స్ విపరీతంగా మెప్పించింది. విజయ్ మరోసారి తన స్వాగ్ చూపించారు. దీంతో మట్టా అంటూ ఉన్న ఈ సాంగ్ పాపులర్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా జోష్ ఉండే ట్యూన్ ఇచ్చారు.
ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. అయితే, ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 23) ఈ ఫుల్ వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ యూట్యూబ్‍లో రిలీజ్ చేసింది. టీస సిరీస్ యూట్యూబ్ ఛానెల్‍లో ఈ వీడియో సాంగ్‍ను అందుబాటులోకి తెచ్చింది. తమిళంతో పాటు తెలుగులో మస్తీ, హిందీలో ఆయా పేరుతోనూ ఈ వీడియో సాంగ్ వచ్చేసింది.
ది గోట్ నుంచి సర్‌ప్రైజింగ్‍గా ఈ వీడియో సాంగ్ రావటంతో విజయ్, త్రిష అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. విజయ్, త్రిష డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
ది గోట్ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ మూవీని తీసుకుంది. ది గోట్ చిత్రం అక్టోబర్ 3 లేకపోతే అక్టోబర్ 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపై నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై స్పష్టమైన సమాచారం బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కంటే ముందే మట్టా సాంగ్ యూట్యూబ్‍లోకి వచ్చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ది గోట్ చిత్రంలో దళపతి విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. విజయ్ రెండు పాత్రలు చేశారు. యంగ్ లుక్ కోసం డీ ఏజింగ్ టెక్నాలజీ వాడగా దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా ఇప్పటి వరకు సుమారు రూ.400కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.