NTR: మీతో పాటు నేను బాధపడుతున్నా - దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్‌పై ఎన్టీఆర్ కామెంట్స్
NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో మీ కంటే నేనే ఎక్కువ బాధపడుతున్నానని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్ అన్నాడు. ఈ రోజు కలవకపోయినా సెప్టెంబర్ 27న థియేటర్లలో కలుద్దామని ఎన్టీఆర్ చెప్పాడు.
NTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుకావడంపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. ఈ రోజు కలవకపోయినా సెప్టెంబర్ 27న దేవరతో థియేటర్లలో కలుద్దామని అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన ఓ వీడియోను సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ఈ వీడియోలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం చాలా బాధాకరంమని ఎన్టీఆర్ అన్నాడు. ఇది తనకు చాలా బాధను కలిగించిందని తెలిపాడు.
ఆజన్మాంతం రుణపడి ఉంటా…
అంతే కాకుండా ఈ వీడియోలో అభిమానులను ఉద్దేశించి "అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవర మూవీ గురించి, మూవీ కోసం మేము పడిన కష్టం గురించి అందరికి వివరిద్దామని నేనుచాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది.
ఈవెంట్ రద్దు కారణంగా మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది. ఎక్కువ కూడా. ఈ విషయంలో దేవర ప్రొడ్యూసర్ల, ఈవెంట్ ఆర్గనైజర్లను బ్లేమ్ చేయడం తప్పు. మీరు కురిపించే ఈ ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈ రోజు కలవకపోయినా సెప్టెంబర్ 27న మనందరం కలవబోతున్నాం. దేవర సినిమాను మీరు అందరూ థియేటర్లలో చూడబోతున్నారు" అని ఎన్టీఆర్ అన్నాడు.
అదే నా బాధ్యత...
“దేవర సినిమాతో మీరు కాలర్ ఎగరవేసుకొని తిరిగేలా చేయడమే నా బాధ్యత, దానితో వచ్చే ఆనందం ఎంతో మాటల్లో చెప్పలేను. సెప్టెంబర్ 27న అదే జరుగుతుంది. డైరెక్టర్ కొరటాల శివ ఎంతో కష్టపడి దేవర సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అందరూ సినిమాను చూసి ఆనందించాలి. మీ ఆశీర్వాదం దేవరకు, నాకు చాలా అవసరం” అని ఈ వీడియోలో ఎన్టీఆర్ చెప్పాడు.
పరిమితికి మించి...
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళంగా మారింది. అభిమానుల తోపులాట కారణంగా కొందరు గాయపడ్డారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోన్న వేదిక మొత్తం నిండిపోయిన తర్వాత కూడా వేలాది మంది అభిమానులు పాస్‌లతో బయటే వేచి ఉన్నారు. వారంతా ఒక్కసారిగా హోటల్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
దాంతో హోటల్ అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులతో పాటు హోటల్ వర్గాలు ప్రయత్నించిన వీలుకాకపోవడంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సిందిగా సినిమా టీమ్‌ను కోరినట్లు సమాచారం. అభిమానులను నిలువరించడం కష్టం కావడంతో వేడుకను రద్దు చేస్తున్నట్లు దేవర టీమ్ ప్రకటించింది.
ఈవెంట్ ఆర్గనైజర్లదే తప్పు...
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ విషయంలో ఈవెంట్ ఆర్గనైజర్లను అభిమానులు తప్పుపడుతున్నారు. పరిమితికి మించి ఈవెంట్ ఆర్గనైజర్స్ పాసులు జారీ చేయడం వల్లే పరిస్థితి అదుపుతప్పిందని అంటున్నారు. హోటల్‌లో కాకుండా ఓపెన్ స్టేడియంలో మూవీ టీమ్ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తే బాగుండేదని నిర్మాతలకు ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్ విలన్...
దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రిలీజ్ ట్రైలర్..
దేవర మూవీ రిలీజ్ ట్రైలర్‌ను ఆదివారం మేకర్స్ విడుదలచేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసినట్లు సమాచారం.