Jani Master Case: జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా? స్పందించిన పుష్ప నిర్మాత-pushpa 2 producer ravi shankar reacts on allu arjun involvement in jani master case ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jani Master Case: జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా? స్పందించిన పుష్ప నిర్మాత

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా? స్పందించిన పుష్ప నిర్మాత

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 23, 2024 02:21 PM IST

Jani Master Case: జానీ మాస్టర్ కేసు ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. ఈ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాధితురాలికి మద్దతుగా ఉన్నారనే విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ పాత్ర ఏంటనే ప్రశ్న పుష్ప మూవీ నిర్మాతకు ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా? స్పందించిన పుష్ప నిర్మాత
Jani Master Case: జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నారా? స్పందించిన పుష్ప నిర్మాత

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వ్యవహారం దుమారం రేపుతోంది. మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి చేశారన్న అభియోగాలతో జానీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రిమాండ్‍లో ఉన్నారు. తన తప్పులను కూడా అంగీకరించారనే సమాచారం బయటికి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు బాధితురాలైన ఆ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. అయితే, ఆ చిత్రంలో హీరోగా నటిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ అమ్మాయికి భరోసా ఇచ్చారనే సమాచారం చక్కర్లు కొడుతోంది.

ఈ విషయంపైనే పుష్ప 2 నిర్మాత రవిశంకర్‌కు ప్రశ్న ఎదురైంది. మత్తువదలరా 2 చిత్రం బ్లాక్‍బస్టర్ మీట్‍కు ఆయన నేడు (సెప్టెంబర్ 23) హాజరయ్యారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ కేసుపై ప్రశ్నలు వచ్చాయి.

పర్సనల్ గొడవ

జానీ మాస్టర్, ఆ అమ్మాయి మధ్య అది పర్సనల్ గొడవ అని నిర్మాత రవిశంకర్ చెప్పారు. పుష్ప 2 మూవీకి ఆమె మొదటి నుంచి పని చేస్తున్నారని తెలిపారు. అన్ని పాటలకు ఆ అమ్మాయి పని చేస్తున్నారని చెప్పారు. మరో రెండు సాంగ్స్ చేయాల్సి ఉందని, వాటికి కూడా ఆమె ఉంటారని స్పష్టం చేశారు.

స్పెషల్ సాంగ్ చేయాల్సింది

పుష్ప 2 చిత్రంలో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కోసం డ్యాన్స్ కంపోజ్ చేయాల్సిందని రవిశంకర్ అన్నారు. అయితే రెండు రోజుల ముందే ఇదంతా జరిగిందని తెలిపారు. వీళ్లంతా తమతో ఎప్పటి నుంచో పని చేస్తున్నారని అన్నారు.

అల్లు అర్జున్‍కు తెలియదు

జానీ మాస్టర్ వివాదం గురించి అల్లు అర్జున్‍కు పెద్దగా తెలియదని నిర్మాత రవిశంకర్ అన్నారు. కొందరు ఏదో ఒకటి చెబుతున్నారని అన్నారు. “డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ అంటూ విషెస్ చెబితే హీరో (అల్లు అర్జున్).. తిరిగి పలుకరిస్తారు. అంతకంటే ఆయనకు ఏమీ తెలియదు. జానీని ఆపేసి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలని ఆయన అసలు అనుకోలేదు. అలాంటివి ఏమీ ఉండవు. ఆరు నెలల ముందు రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలోనూ ఆ అమ్మాయి పేరు ఉంది. కొందరు చేస్తున్న అలజడిలో నిజాలు లేవు” అని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు.

జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా కొరియోగ్రాఫర్‌కు అల్లు అర్జున్ అండగా నిలిచారనే సమాచారం చక్కర్లు కొట్టింది. ఇకపై తాను చేసే అన్ని చిత్రాల్లో ఆమె వర్క్ ఇచ్చేలా భరోసా ఇచ్చారనే రూమర్లు వచ్చాయి. పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా ఆ అమ్మాయికి మద్దుతుగా నిలిచారని టాక్ నడిచింది.

జానీ మాస్టర్ తనను చాలా కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని 21 ఏళ్ల ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైట్ ఇచ్చారు. మైనర్‌గా ఉన్న సమయంలోనూ దురాగతం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో జానీపై పోక్సో కేసు కూడా నమోదైంది. గోవాలో ఆయనను ఇటీవలే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పరపల్లి కోర్టు జానీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.