Bigg Boss 8 Telugu: సోనియాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆదిత్య.. ఫైర్ అయిన నబీల్ : వీడియో-bigg boss 8 telugu today promo aditya om gave flying kiss to sonia and nabeel fires ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: సోనియాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆదిత్య.. ఫైర్ అయిన నబీల్ : వీడియో

Bigg Boss 8 Telugu: సోనియాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆదిత్య.. ఫైర్ అయిన నబీల్ : వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 23, 2024 03:13 PM IST

Bigg Boss 8 Telugu Promo: నామినేషన్లలో మరోసారి సోనియా హైలైట్ అయ్యారు. నబీల్, ఆదిత్యతో ఆమె గొడవ పడ్డారు. ఈ వారం నామినేషన్లు కూడా హీట్‍తో జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమోలు వచ్చాయి.

Bigg Boss 8 Telugu: సోనియాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆదిత్య.. ఫైర్ అయిన నబీల్ : వీడియో
Bigg Boss 8 Telugu: సోనియాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆదిత్య.. ఫైర్ అయిన నబీల్ : వీడియో

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో నాలుగో వారం మొదలుకానుంది. నేటి సోమవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్‍లో నామినేషన్ల ప్రక్రియ ఉండనుంది. మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయారు. ఈ నాలుగో వీక్ ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది. సోనియా మరోసారి వాదనల్లో హైలైట్ అయ్యారు. నామినేషన్లకు సంబంధించిన నేటి ఎపిసోడ్ రెండో ప్రోమో కూడా వచ్చేసింది. దీంట్లో ఏముందంటే..

ఆదిత్య, సోనియా మధ్య..

ఆదిత్య ఓంను సోనియా నామినేట్ చేశారు. ఎక్కువ పర్ఫార్మెన్స్ లేకపోవటంతో.. తన వద్ద ఎక్కువ పాయింట్స్ కూడా లేవని ఆదిత్యతో సోనియా చెప్పటంతో ఈ ప్రోమో మొదలైంది. దీంతో ఫ్రస్ట్రేషన్‍కు గురైన ఆదిత్య ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన లవ్యూ ఆల్‍వేస్ అని సోనియాతో చెప్పారు. ఈ వారంలో వెళతారనే డిసైడ్ అయ్యారు కదా.. వెళ్లిపోండి అంటూ సోనియా మాట్లాడారు.

నైనికను ప్రేరణ నామినేట్ చేశారు. గేమ్ కనిపించడం లేదని ప్రేరణ చెప్పారు. “మీ చీఫ్‍కే గట్టి పోటీ ఇచ్చా” అని నైనిక అంటే.. “నువ్వు నాకు కనిపించలేదు” అని ప్రేరణ అన్నారు. అయితే గొడవలు పడాలన్న మాట అంటూ వెటకారం చేశారు నైనిక.

ముందు ముందు గేమ్స్ ఆడే సమయంలో దెబ్బలు తగులుతాయనే భయం తనలో ఉందని పృథ్విరాజ్‍కు మణికంఠ నామినేట్ చేశారు. దీంతో సోనియావైపు చూస్తే వెటకారంగా పృథ్వి నవ్వారు. “నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి” అని మణికంఠతో చెప్పారు.

ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేశారు. వారి మధ్య గొడవ గురించి మరోసారి ప్రస్తావించుకున్నారు. మణికంఠను ప్రేరణ నామినేట్ చేశారు. “అందరి దగ్గర నీట్‍గా ఉండి.. టైమ్ వచ్చినప్పుడు ఎవరిని పొడుస్తావో నాకు తెలియదు” మణితో ప్రేరణ చెప్పారు. దీంతో మణి అసంతృప్తి చెందారు.

నబీల్‍ను రెచ్చగొట్టిన సోనియా

నామినేషన్లలో సోనియా మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడారు. నబీల్‍ను మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటూ కామెంట్ చేశారు. అలా అనొద్దని నబీల్ అంటే.. మరోసారి ఫెయిల్డ్ సంచాలక్ అని సోనియా మళ్లీ అన్నారు. ఎంత ఇస్తానో తీసుకునేంత దమ్ము కూడా ఉందని చెప్పారు. ఆ తర్వాత నబీల్ కూర్చోగా.. నిల్చోవాలని అన్నారు. పర్లేదు అంటూ వెటకారం చేశారు నబీల్.

వ్యక్తిగా కూడా ఫెయిల్ అయ్యావని నబీల్‍తో సోనియా అన్నారు. దీంతో అతడు ఫ్రస్ట్రేషన్‍కు గురయ్యారు. “నేను రాంగ్, నేను ఫేక్, నేను రియల్ కాదు.. వావ్.. అమేజింగ్” అని నబీల్ అరిచాడు. దీంతో వెటకారంగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు సోనియా.

ఈ నామినేషన్ల ఎపిసోడ్‍కు సంబంధించి తొలి ప్రోమో కూడా వచ్చింది. నచ్చని కంటెంస్టెంట్ ముఖంపై ఫోమ్ కొట్టి.. కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్‍బాస్ సూచించారు. పృథ్వి ఇన్‍సల్ట్ గట్టి చేస్తున్నారని, వివరణ ఇచ్చుకోవడం మాత్రం అంత వినిపించడం లేదని ఆదిత్య అభ్యంతరం తెలిపారు. పృథ్వి గురించి నబీల్ మాట్లాడుంటే సోనియా మధ్యలో వచ్చారు. మధ్యలో ఎందుకు వస్తున్నావని నబీల్ ప్రశ్నించారు. సోనియాను ఆదిత్య నామినేట్ చేశారు. పృథ్వి ఇంకోసారి రెచ్చిపోయారు.

ఈ వారం నామినేషన్లలో సోనియా, నబీల్, పృథ్విరాజ్, నైనిక, మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఉంటారని తెలుస్తోంది. నేటి ఎపిసోడ్‍లో ఇది తేలనుంది.