Gundeninda Gudigantalu Today Episode: మీనా చెల్లెలితో ర‌వి పెళ్లి ఫిక్స్ - భార్య‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన బాలు-gundeninda gudigantalu serial september 23rd episode baalu warns ravi to end his relationship with shruthi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: మీనా చెల్లెలితో ర‌వి పెళ్లి ఫిక్స్ - భార్య‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన బాలు

Gundeninda Gudigantalu Today Episode: మీనా చెల్లెలితో ర‌వి పెళ్లి ఫిక్స్ - భార్య‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన బాలు

Nelki Naresh Kumar HT Telugu
Sep 23, 2024 09:12 AM IST

Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 23 ఎపిసోడ్‌లో ర‌వి, శృతిల ప్రేమ విష‌యం భ‌ర్త‌కు చెబుతుంది మీనా. భార్య చెప్పిన మాట‌లు విని బాలు కోప‌గించుకుంటాడు. శృతిని ర‌వి మ‌ర్చిపోవాల్సిందేన‌ని అంటాడు. వారి ప్రేమ విష‌యంలో నీ జోక్యం త‌గ్గించుకుంటే మంచిద‌ని మీనాకు బాలు వార్నింగ్ ఇస్తాడు

గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 23 ఎపిసోడ్‌
గుండెనిండా గుడిగంట‌లు సెప్టెంబ‌ర్ 23 ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Today Episode: సంజుతో త‌న‌కు ఇష్టంలేని పెళ్లి కుదుర్చిన త‌ల్లిదండ్రులు సురేంద్ర‌, శోభ‌న‌పై శృతి ఫైర్ అవుతుంది. నాలైఫ్‌ను డిసైడ్ చేసే అధికారం మీకు ఎవ‌రు ఇచ్చారంటూ కోప్ప‌డుతుంది. మీరు నా విష‌యంలో ఇన్‌వాల్వ్ అయితే బాగుండ‌ద‌ని అంటుంది. నువ్వు ఇంకా స‌త్యం కొడుకు ర‌వితో తిరుగుతున్నావా అని శృతిని అడుగుతుంది శోభ‌న‌. అవున‌ని త‌ల్లికి స‌మాధాన‌మిస్తుంది శృతి.

ర‌విని ప్రేమిస్తున్నావా...

స‌త్యం మీ నాన్న‌ను కోర్టుకు లాగి అవ‌మానించాడు, అత‌డి కొడుకును ఎలా పెళ్లిచేసుకుంటావ‌ని శృతిని అడుగుతుంది శోభ‌న‌. అది నా స‌మ‌స్య కాదు...మీ స‌మ‌స్య అని త‌ల్లికి బ‌దులిస్తుంది శృతి. మా కంటే నీకు ర‌వి ఎక్కువైపోయాడా. అత‌డిని ప్రేమిస్తున్న‌వా అని కూతురిని నిల‌దీస్తుంది శృతి.

నీ కోసం గొప్పింటి సంబంధం చూస్తే...నువ్వు మాత్రం మిడిల్‌క్లాస్ వాడిని ఎలా ప్రేమిస్తున్నావ‌ని శృతితో గొడ‌వ‌ప‌డుతుంది శోభ‌న‌. మ‌న కుటుంబంపై ప‌గ‌ను తీర్చుకోవ‌డానికే స‌త్యం త‌న కొడుకును అడ్డం పెట్టుకొని ఈ ప్రేమ నాట‌కం ఆడుతున్నాడ‌ని శోభ‌న అంటుంది. మీరు ఏమైనా అనుకొండి కానీ సంజును మాత్రం పెళ్లిచేసుకునేది లేదంటూ శృతి తేల్చేస్తుంది.

పెళ్లి ఫిక్స్‌...

కానీ కూతురి మాట‌ల్ని శోభ‌న‌, సురేంద్ర ప‌ట్టించుకోరు. వ‌చ్చే నెల 15న మీ పెళ్లి ఫిక్స్ అని అంటారు. ఇక నుంచి డ‌బ్బింగ్ కూడా వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని, గొప్పింటి కుటుంబానికి కోడ‌లు అవుతూ డ‌బ్బింగ్ చెప్ప‌డం ఏంటి అని సంజు ఫీల‌వుతున్నాడ‌ని సురేంద్ర అంటాడు.

మీనా ఆలోచ‌న‌లు...

శృతి, రవి ప్రేమ విష‌యం భ‌ర్త‌కు ఎలా చెప్పాలా అని మీనా తెగ ఆలోచిస్తుంది. మీనా ఏదో త‌న‌తో చెప్పాల‌ని టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు బాలు గ్ర‌హిస్తాడు. ముఖ్య‌మైన విష‌యం అంటూ మీనా ఇచ్చే బిల్డ‌ప్ చూసి నువ్వు త‌ల్లిని కాబోతున్నావా అని మీనాను అడుగుతాడు బాలు. ద‌గ్గ‌ర‌కు వ‌స్తేనే త‌ప్పు జ‌రిగింద‌ని పోరిపోతుంటే నేను త‌ల్లిని ఎప్పుడు అవుతాన‌ని బాలును ఆట‌ప‌ట్టిస్తుంది మీనా.

బాలు ఆవేశం...

ఆ త‌ర్వాత శృతి త‌మ ఇంటికొచ్చిన విష‌యం బాలుకు చెబుతుంది మీనా. ర‌వి, శృతి ప్రేమించుకుంటున్నార‌ని, పెళ్లిచేసుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నార‌ని మీనా అంటుంది. మీనా మాట‌ల‌తో బాలు కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. నా అనుమానం నిజ‌మేన‌ని గ‌ట్టిగా అంటాడు. గ‌ట్టిగా అర‌వొద్ద‌ని భ‌ర్త‌తో అంటుంది మీనా. ర‌వి, శృతి ప్రేమ సంగ‌తి ప్ర‌భావ‌త‌మ్మ‌కు తెలిస్తే ఎగిరి గంతేస్తుంద‌ని, ఆస్తిప‌రులు సంబంధం కాబ‌ట్టి తండ్రి అవ‌మానాన్ని మార్చిపోయి తానే ఈ పెళ్లి ద‌గ్గ‌రుండి చేస్తుంద‌ని బాలు అంటాడు.

భార్య‌కు ర‌వి వార్నింగ్‌...

శృతి మంచిద‌ని బాలును క‌న్వీన్స్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది మీనా. శృతి, ర‌వి పెళ్లి జ‌రిపిస్తే మంచిద‌న్న‌ట్లుగా మాట్లాడుతుంది. ర‌వి త‌న ప్రేమ‌ను మ‌ర్చిపోవ‌డ‌మే మంచిద‌ని బాలు కోపంగా అంటాడు. నీ రాయ‌బారం అవ‌స‌రంలేద‌ని చెబుతాడు.ర‌వి, శృతిల ప్రేమ గురించి మావ‌య్య సత్యంతో మాట్లాడితే మంచిద‌ని భ‌ర్త‌తో అంటుంది మీనా.

అస‌లు ఈ విష‌యం మా నాన్న‌కు తెలియ‌డానికే వీలులేద‌ని భార్య‌కు వార్నింగ్ ఇస్తాడు బాలు. మా నాన్న‌కు ర‌వి వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌మ‌స్య రాలేద‌ని, వాడైనా జీవితంలో బాగుప‌డ‌తాడ‌ని ఎన్నో క‌ల‌లు కంటున్నాడ‌ని, ఈ ప్రేమ విష‌యం తెలిస్తే త‌న న‌మ్మ‌కం ముక్క‌లైపోవ‌డం ఖాయ‌మ‌ని మీనాకు కోపంగా బ‌దులిస్తాడు బాలు.

సురేంద్ర‌ను కొట్టిన బాలు...

నాన్న‌పై ప‌గతో సురేంద్ర పెన్ష‌న్ ఆపేశాడ‌ని, శృతిని ర‌వి ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి మ‌నుషుల‌ను పెట్టి త‌మ్ముడిని కొట్టించాడ‌ని అలాంటి వాడి కూతురిని ర‌వి ప్రేమించ‌డానికి వీలులేద‌ని బాలు ప‌ట్టుప‌డ‌తాడు. స‌మ‌యానికి నేను అక్క‌డికి వెళ్ల‌డంతో ర‌విని కాపాడ‌గ‌లిగాన‌ని, ఆ కోపంతోనే తాను సురేంద్ర ఇంటికెళ్లి అత‌డిని కొట్టాన‌ని జ‌రిగిన క‌థ మొత్తం మీనాకు చెబుతాడు. ఇప్పుడు వెళ్లి పిల్ల‌ను అడిగితే మెడ‌ప‌ట్టి బ‌య‌ట‌కు పంపిస్తాడ‌ని బాలు అంటాడు.

బోడి స‌ల‌హాలు అవ‌స‌రం లేదు...

ఇరు కుటుంబాల‌ను కూర్చోబెట్టి మాట్లాడితే స‌మ‌స్య సాల్వ్ కావ‌చ్చున‌ని బాలుతో మీనా చెబుతుంది. ఇలాంటి బోడి స‌ల‌హాలు ఇవ్వ‌డం మానేయ‌మ‌ని మీనాను హెచ్చ‌రిస్తాడు బాలు. ఈ పెళ్లి జ‌రిపిస్తాన‌ని వాళ్ల‌కు ఏమైనా మాటిచ్చావా...ఇంత‌టితో ఇది వ‌దిలేయ‌మ‌ని భార్య‌కు వార్నింగ్ ఇస్తాడు.

ర‌వికి కాల‌ర్ ప‌ట్టుకున్న బాలు...

వాళ్ల ప్రేమ సంగ‌తి ఏదో నేనే తేల్చుకుంటానంటూ ఆవేశంగా ర‌వి ప‌నిచేస్తున్న రెస్టారెంట్‌కు వెళ‌తాడు. ర‌వి కాల‌ర్ ప‌ట్టుకొని ఏం జ‌రుగుతుంది, నేను ఏం చెప్పాను. నువ్వేం చేశావ‌ని నిల‌దీస్తాడు. అ అమ్మాయితో మాట్లాటొద్ద‌ని, ఏదైనా ఉంటే మ‌ర్చిపొమ్మ‌ని చెప్పానుగా అని గ‌ట్టిగా అడుగుతాడు.

ర‌వి ప‌నిచేసే చోట గొడ‌వ చేస్తే అత‌డికి విలువ ఉండ‌ద‌ని, బ‌య‌ట‌కు వెళ్లి మాట్లాడుదామ‌ని భ‌ర్త‌ను బ‌తిమిలాడుతుంది మీనా. అయినా బాలు ఆవేశం త‌గ్గించ‌డు. నువ్వు అస‌లు రెస్టారెంట్‌కు వెళ్లి ప‌నిచేస్తున్నావా...లేదంటే ఆ అమ్మాయిని వేసుకొని ఊరంతా తిరుగుతున్నావా అంటూ గ‌ట్టిగా అరుస్తాడు.

శృతి ఇంటికొచ్చింది...

శృతిని తాను దూరం పెట్టాన‌ని బాలుతో అంటాడు ర‌వి. నువ్వు దూరం పెడితే ఆ అమ్మాయి మ‌నింటికి వ‌చ్చి నిన్ను ప్రేమిస్తున్న‌ట్లు మీనాతో ఎందుకు చెప్పింద‌ని ర‌వితో అంటుంది బాలు. నువ్వే ప్రేమ విష‌య ఇంట్లో చెప్ప‌మ‌ని శృతిని మ‌నింటికి పంపించి ఉంటావ‌ని ర‌విని అనుమానిస్తాడు బాలు.

శృతిని మ‌ర్చిపోవాల్సిందే...

శృతిని నిజంగా నువ్వు ప్రేమించావా లేదా అని ర‌విని అడుగుతాడు బాలు. శృతి మొత్తం నాతో చెప్పింద‌ని, నువ్వు ఇన్నాళ్లు ఎందుకు దాచావ‌ని ర‌వితో అంటుంది మీనా. ర‌వి ఏదో చెప్ప‌బోతుంటే బాలు అడ్డుకుంటాడు. నువ్వు ఆ అమ్మాయిని మ‌ర్చిపోవాల్సిందేన‌ని అంటాడు. నువ్వు ఆవేశం త‌గ్గించుకంటే మంచిద‌ని బాలును రిక్వెస్ట్ చేస్తాడు ర‌వి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించి నాన్న‌ను మ‌ళ్లీ గొడ‌వ‌ల్లోకి లాగాల‌ని చూస్తున్నావా అంటూ ర‌విని అడుగుతాడు బాలు.

న‌న్ను ఒప్పించాల‌ని చూడ‌కు...

శృతి మంచి అమ్మాయి అని బాలుతో అంటాడు ర‌వి. త‌మ్ముడి మాట‌ల‌తో బాలు కోపం మ‌రింత పెరుగుతుంది. న‌న్ను ఒప్పించాల‌ని చూస్తే ఊరుకోన‌ని అంటాడు. నాన్న గౌర‌వం పోగొట్టే ప‌నిచేస్తే స‌హించ‌న‌ని అంటాడు. ర‌వి ఏదో చెప్పాల‌ని చూస్తే బాలు ప‌ట్టించుకోడు. నాన్న నువ్వు మంచివాడ‌ని న‌మ్ముతాడ‌ని, నీపైనే ఆశ‌లు పెట్టుకున్నాడ‌ని, ఇంకోసారి ప్రేమ‌, దోమ అనే మాట నీ నోటి నుంచి వ‌స్తే ఊరుకోన‌ని త‌మ్ముడికి వార్నింగ్ ఇచ్చి అక్క‌డి వ‌స్తాడు బాలు.

ర‌విని కొడ‌తాను

ర‌వి ద‌గ్గ‌ర నుంచి వ‌చ్చిన బాలు...అత‌డు చెప్పిన మాట‌ల గురించే ఆలోచిస్తుంటాడు. మ‌ళ్లీ ఆ అమ్మాయితో ర‌విని చూస్తే త‌మ్ముడిని కొడ‌తాన‌ని మీనాతో అంటాడు బాలు.ఆ అమ్మాయిని మ‌ర్చిపొమ్మ‌ని నువ్వే ర‌వితో చెప్ప‌మ‌ని మీనాకు చెబుతాడు.

సుమతితో పెళ్లి…

మీనాను తీసుకొని అత్తింటికివ‌స్తాడు బాలు. మ‌ళ్లీ ఏదైనా గొడ‌వ జ‌రిగి ఉండొచ్చ‌ని మీనా త‌ల్లి కంగారు ప‌డుతుంది. ర‌విని మీ సుమతికి ఇచ్చి పెళ్లిచేయ‌మ‌ని అడ‌గ‌టానికి వ‌చ్చాన‌ని బాలు అంటాడు. బాలు మాట‌ల‌తో మీనా కంగారు ప‌డుతుంది. అక్క‌డితో నేటి గుండెనిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.