Gundeninda Gudigantalu Today Episode: త‌మ్ముడి ప్రేమ‌కు బాలు అడ్డు -చిక్కుల్లో మీనా కాపురం -శృతి ప్రేమ‌క‌థ‌లో ట్విస్ట్‌-gundeninda gudigantalu september 20th episode meena shocked to know about ravi and shruthi love story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Today Episode: త‌మ్ముడి ప్రేమ‌కు బాలు అడ్డు -చిక్కుల్లో మీనా కాపురం -శృతి ప్రేమ‌క‌థ‌లో ట్విస్ట్‌

Gundeninda Gudigantalu Today Episode: త‌మ్ముడి ప్రేమ‌కు బాలు అడ్డు -చిక్కుల్లో మీనా కాపురం -శృతి ప్రేమ‌క‌థ‌లో ట్విస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 20, 2024 08:57 AM IST

Gundeninda Gudigantalu:గుండెనిండా గుడి గంట‌లు సెప్టెంబర్ 20 ఎపిసోడ్‌లో ర‌విని ప్రేమిస్తున్న సంగ‌తి మీనాతో చెబుతుంది శృతి. త‌మ పెళ్లి జ‌రిగేలా చేయ‌మ‌ని మీనా స‌హాయం అడుగుతుంది. ర‌వి, శృతిల పెళ్లి జ‌రిపిస్తే త‌న కాపురం చిక్కుల్లో ప‌డ‌టం ఖాయ‌మ‌ని మీనా భ‌య‌ప‌డుతుంది. ర‌వి ప్రేమ‌కు బాలు అడ్డుచెబుతాడు.

గుండెనిండా గుడి గంట‌లు సెప్టెంబర్  20 ఎపిసోడ్‌
గుండెనిండా గుడి గంట‌లు సెప్టెంబర్ 20 ఎపిసోడ్‌

Gundeninda Gudigantalu Today Episode: రోహిణి పార్ల‌ర్‌కు ప్ర‌భావ‌తి వ‌స్తుంది. తాను పార్ల‌ర్ అమ్మిన విష‌యం అత్త‌య్య‌కు తెలియ‌కుండా రోహిణి జాగ్ర‌త్త‌లు ప‌డుతుంది. పార్ల‌ర్ పేరు మార్చిన బోర్డ్‌పై క్లాత్ క‌ప్పేస్తుంది.

కానీ రోహిణి ప్లాన్ ఫెయిల‌వుతుంది. త‌న పేరుపై క్లాత్‌ ఎందుకు క‌ప్పి ఉంచార‌ని రోహిణిని అడుగుతుంది ప్ర‌భావ‌తి. మీ నేమ్ బోర్డ్ డిజైన్ మార్చుతున్నామ‌ని, డిజైన్ పూర్త‌వ్వ‌గానే మొద‌ట మీకే చూపిస్తాన‌ని రోహిణి అబ‌ద్ధం ఆడుతుంది. ప్ర‌భావ‌తి బోర్డ్ చూడ‌కుండా అడ్డుకుంటుంది.

పార్ల‌ర్ ఓన‌ర్ ఎంట్రీ...

అప్పుడే రోహిణి ద‌గ్గ‌ర‌కు పార్ల‌ర్ కొన్న ఓన‌ర్ చెకింగ్‌కు వ‌స్తుంది. త‌న డ్రామా బ‌య‌ట‌ప‌డ‌కుండా ప్ర‌భావ‌తి క‌ళ్ల‌పై కీర‌దోస క‌ప్పి ఉంచుతుంది. తాను చెప్పే వ‌ర‌కు క‌ళ్లు తెర‌వ‌ద్దంటూ స్నేహితురాలు విద్య‌ను ప్ర‌భావ‌తి ద‌గ్గ‌ర ఉంచేసి ఓన‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంది రోహిణి. త‌న ద‌గ్గ‌ర ఉంది విద్య అని తెలియక ప్ర‌భావ‌తి నోరు జారుతుంది.

విద్య‌తో ర‌వి చ‌నువుగా ఉండ‌టం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, విద్య‌ను దూరం పెడితే మంచిదంటూ చెబుతుంది. ప్ర‌భావ‌తి మాట‌ల‌తో విద్య‌కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. కానీ రోహిణి గురించి ఆలోచించి సెలెంట్‌గా ఉంటుంది.

రోహిణి స‌త‌మ‌తం...

అబ‌ద్దాల మీద అబ‌ద్దాలు ఆడుతూ ఇలా ఎన్నాళ్లు నెట్టుకు రావాలో తెలియ‌క రోహిణి స‌త‌మ‌త‌మ‌వుతుంది. నీ గురించి ప్ర‌భావ‌తికి నిజాలు తెలిసేలోపు మ‌నోజ్‌ను తీసుకొని ఆ ఇంటి నుంచి వ‌చ్చేయ‌మ‌ని రోహిణికి విద్య స‌ల‌హా ఇస్తుంది. త‌న పేరు మీద పార్ల‌ర్ పెట్టిన రోహిణిని తెగ పొగుడుతుంది ప్ర‌భావ‌తి. త‌న పేరు మీద సిటీలో మ‌రిన్ని బ్రాంచ్‌లు పెట్ట‌మ‌ని కోడ‌లితో అంటుంది.

మీనాకు షాకుల మీద షాకులు...

త‌మ ప్రేమ విష‌యం వెంట‌నే తేల్చేయాల‌ని రెస్టారెంట్ నుంచి ఆవేశంగా ర‌వి ఇంటికొస్తుంది శృతి. ర‌విని ప్రేమించిన సంగ‌తి మీనాకు చెబుతుంది. శృతి చెప్పిన మాట విని మీనా షాక‌వుతుంది. మీనా మాట‌ల‌తో త‌మ ప్రేమ విష‌యం ర‌వి ఇంట్లో చెప్ప‌లేద‌ని శృతి అర్థం చేసుకుంటుంది. ర‌వి, తాను వెంట‌నే పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు, ఈ విష‌యం ఇప్పుడే ప్ర‌భావ‌తికి చెబుతాన‌ని శృతి ఆవేశ‌ప‌డుతుంది.

మీనా కంగారు...

శృతి మాట‌లు ప్ర‌భావ‌తి వింటే త‌న కాపురం క‌ష్టాల్లో ప‌డ‌టం ఖాయ‌మ‌ని మీనా కంగారుప‌డుతుంది. శృతిని బిల్డింగ్‌పైకి తీసుకెళుతుంది. ర‌వితో త‌న ల‌వ్ స్టోరీ మొత్తం మీనాకు చెబుతుంది శృతి. ఇంట్లోవాళ్లు త‌న‌కు వేరే పెళ్లి సంబంధం ఫిక్స్ చేశార‌ని, ఆ పెళ్లిని అడ్డుకోవాలంటే ర‌వి, తాను వెంట‌నే పెళ్లిచేసుకోవ‌డం మిన‌హా మ‌రే దారిలేదంటూ శృతి అంటుంది.

ఒక‌వేళ మా అత్తయ్య‌తో పాటు ఇంట్లో వాళ్లు ఒప్పుకోక‌పోతే ఏం చేస్తావ‌ని శృతిని అడుగుతుంది మీనా. ర‌విని లేపుకుపోయి రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకుంటాన‌ని శృతి స‌మాధాన‌మిస్తుంది.

శృతి స్పీడు...

శృతి ఆవేశం చూసి ఆమె అన్నంత ప‌ని చేసేలా ఉంద‌ని మీనా అనుకుంటుంది. స్పీడు త‌గ్గిస్తే మంచిద‌ని, ఆడ‌పిల్ల‌ల‌కు ఆవేశం ప‌నికిరాద‌ని శృతికి స‌ల‌హా ఇస్తుంది మీనా. శృతి మాత్రం త‌గ్గేదేలేద‌ని అంటుంది. ర‌వికి, త‌న‌కు మీరే పెళ్లి చేయాల‌ని, లేదంటే ర‌విని మీరే త‌న‌తో పెళ్లికి ఒప్పించాల‌ని మీనాను కోరుతుంది శృతి. బాలును జైలు నుంచి విడిపించి తాను చేసిన సాయానికి బ‌దులుగా ఈ చిన్న హెల్ఫ్ చేయ‌మ‌ని మీనాను రిక్వెస్ట్ చేస్తుంది శృతి.

ఒక్క రోజు టైమ్‌...

మీనా ఎంత క‌న్వీన్స్ చేసిన శృతి విన‌దు. త‌న‌కు ఒక్క‌రోజు టైమ్ ఇవ్వ‌మ‌ని, బాలు, ర‌వితో మాట్లాడి మీ ప్రేమ విష‌యం తేల్చేస్తాన‌ని అని కంగారుగా శృతిని ఇంట్లో నుంచి పంపించ‌బోతుంది మీనా. కానీ శృతిని ప్ర‌భావ‌తి, రోహిణి చూస్తారు.

శృతి డ్రెస్సింగ్ స్టైల్, మెడ‌లోని న‌గ‌లు చూసి గొప్పింటి అమ్మాయి అనుకుంటారు. అంత గొప్పింటి అమ్మాయికి మీనాతో ఏం ప‌ని అని ఇద్ద‌రు అనుమాన‌ప‌డ‌తారు. శృతిని కంగారుగా ఇంట్లో నుంచి పంపిస్తుంది మీనా. శృతిని చూసి ఎవ‌ర‌ని మీనాను అడుగుతుంది ప్ర‌భావ‌తి. త‌న స్నేహితురాలు అంటూ మీనా అబ‌ద్ధం చెబుతుంది.

శృతి ఫైర్‌...

సంజుతో సీక్రెట్‌గా త‌న పెళ్లి కుద‌ర్చ‌డంపై త‌ల్లిదండ్రుల‌పై శృతి ఫైర్ అవుతుంది. త‌న లైఫ్‌ను డిసైడ్ చేసే అధికారం మీకు ఎవ‌రు ఇచ్చారు అని వాదిస్తుంది. ర‌విని ప్రేమిస్తోన్న సంగ‌తి బ‌య‌ట‌పెడుతుంది. మ‌రోవైపు ర‌వి, శృతిల ప్రేమ విష‌యం భ‌ర్త‌కు చెబుతుంది మీనా. ఆమాట‌లు విన‌గానే బాలు ఫైర్ అవుతాడు.

మ‌నుషుల‌తో నిన్ను కొట్టించిన వాడి కూతురితో నీకు ప్రేమ ఏంటి అని ర‌వికి రెస్టారెంట్‌కు వెళ్లి మ‌రి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి ప్రేమ‌, గీమా అనే మాట‌లు నీ నోటి నుంచి వ‌స్తే బాగుండ‌ద‌ని హెచ్చ‌రిస్తాడు. అక్క‌డితో నేటి గుండెనిండా గుడిగంట‌లు సీరియ‌ల్ ముగిసింది.