Gundeninda Gudigantalu Today Episode: ప్రభావతికి ఎదురుతిరిగిన మీనా - శృతి పెళ్లి ఫిక్స్ - అడ్డంగా బుక్కయిన రోహిణి
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 19 ఎపిసోడ్‌లో బాలు, మీనా కలిసి కావాలనే రవి, మౌనికలకు వచ్చిన గొప్పింటి సంబంధం చెడగొట్టారని ప్రభావతి అపోహపడుతుంది. కొడుకు, కోడలుపై ఫైర్ అవుతుంది. పెళ్లి సంబంధం చెడగొట్టి మంచి పనిచేశాడని బాలును వెనకేసుకొస్తారు రవి, మౌనిక,
Gundeninda Gudigantalu Today Episode: రవి, మౌనికలకు వచ్చిన గొప్పింటి పెళ్లి సంబంధం చెడగొట్టిన బాలుపై ప్రభావతి ఫైర్ అవుతుంది. పెళ్లి సంబంధం చెడిపోవాలనే పని మానుకొని ఇంట్లో ఉన్నావా అంటూ కోపంగా బాలును అడుగుతుంది ప్రభావతి.
నువ్వు పేర్చిన అద్దాల అబద్దాల మేడ కూలిపోయిందని కొడుకుపై కోప్పడుతున్నావా అంటూ బాలుకు సత్యం సపోర్ట్‌గా మాట్లాడుతాడు. నీ అబద్దాల వల్ల ఎన్నో అనర్థాలు జరిగాయని, మళ్లీ మొదలుపెట్టావా అంటూ భార్యను నిలదీస్తాడు సత్యం. మమ్మల్ని ఈ మాత్రం బతకనివ్వవా అంటూ ప్రభావతిపై కోప్పడుతాడు సత్యం.
ప్రభావతి సెటైర్లు...
మీతో కాపురం చేసిన 30 ఏళ్లలో ఎన్ని రత్నాలు, వజ్రాలు కొనిచ్చారు అంటూ సత్యంపై సెటైర్లు వేస్తుంది ప్రభావతి. మీరు ఎదగరు..పిల్లలను ఎదగనివ్వరు అంటూ భర్తను తక్కువచేస్తూ మాట్లాడుతుంది. మోసాలు చేసి పెళ్లిల్లు చేస్తే కాపురాలు సవ్యంగా సాగవని తల్లికి సలహా ఇస్తాడు బాలు.
కూలీ పనోడిలా...
మీనా గురించి ప్రభావతి పెళ్లి వారి ముందు తక్కువ చేసి మాట్లాడటం సత్యం సహించలేకపోతాడు. మీనా కుటుంబం బెదిరించి ఆమెను మనకు అంటగట్టారని ఎలా మాట్లాడావని భార్యను అడుగుతాడు సత్యం. రవి, మౌనిక కూడా తమకు సంబంధం నచ్చలేదని అంటారు. పెళ్లికూతురుకు హోటల్ మేనేజ్‌మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదని, కూలీ పనిచేసేవాడిలా తనను చూసిందని రవి అంటాడు.
పెళ్లికొడుకు తినడానికే పుట్టినట్లున్నాడని, సంబంధం ఓకే అయినా వాడిని తాను పెళ్లిచేసుకునేదానికి కాదని మౌనిక తెగేసి చెప్పేసింది. పెళ్లి చెడగొట్టి బాలు మంచి పనిచేశాడని రవి, మౌనిక అంటారు. అందరూ ప్రభావతిపై మాటల దాడి చేయడంతో సెలైంట్ అయిపోతుంది. కోటీశ్వరుడి సంబంధం రవి, మౌనికలకు మిస్సవ్వడంపై లోలోన మనోజ్ సంతోషపడతాడు. నాన్నను గౌరవించని కుటుంబంతో సంబంధం కుదర్చుకునేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తాడు బాలు.
మీనానే కారణం...
బాలును ఇంట్లో ఉండేలా చేసి పెళ్లి సంబంధం చెడిపోవడానికి మీనానే కారణమని ప్రభావతి లోలోన రగిలిపోతుంది. కావాలనే నువ్వు ఇదంతా చేశావు కదా అని మీనాపై నిందలు వేస్తుంది. బాలును ప్రభావతి దరిద్రుడు అనడంతో ప్రభావతిపై మీనా ఫైర్ అవుతుంది. నా భర్తను నా ముందు తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది.
మీ కళ్ల ముందే మీ భర్తను అన్ని మాటలు అన్నవాళ్లపై కోపం రాకుండా ఇంకా వాళ్లనే వెనకేసుకొని వస్తున్నారా అంటూ అత్తకు క్లాస్ ఇస్తుంది మీనా. ఇన్నాళ్లు మీపై గౌరవం ఉంటేది...ఇవాళ అది కూడా పోయిందని ప్రభావతితో అంటుంది మీనా. పొగరుతోనే మీనా అలా మాట్లాడుతుందని ప్రభావతి అపోహపడుతుంది. రవితో సుమతి పెళ్లి జరిపించడానికే మీనా ఇదంతా చేసిందని ప్రభావతి అనుకుంటుంది.
శృతికి పెళ్లి ఫిక్స్...
మరోవైపు నీలకంఠం కొడుకు సంజుతో శృతి పెళ్లిని ఇరు కుటుంబాల వారు ఫిక్స్ చేస్తారు. శృతిని తాను ఉండమంటే ఉండలేదని, తనకు ఎవరైనా ఎదురుచెప్పడం నచ్చదని సంజు అంటాడు. పెళ్లికి ముందే శృతి ఎవరినైనా ప్రేమించిందేమోనని సంజు అనుమానపడతాడు. రవితో ప్రేమ విషయం దాచేస్తారు సురేంద్ర, శోభన. తాంబులాలు మార్చేసుకుంటారు. పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు.
బాలు కోపం...
బాలు చాలా కోపంగా కనిపిస్తాడు. తన తండ్రిని అవమానించిన పెళ్లి పెద్దలకు సరైన డోస్ ఇవ్వలేదని ఫీలవుతుంటాడు. ఇంటికి వచ్చిన వాళ్లను అంతలా అవమానించాలా? బుద్ది చెప్పే పద్దతి అది కాదేమోనని భర్తతో అంటుంది మీనా. అంటే చెప్పుతో కొట్టిన చప్పుడు కాకుండా కొట్టాలని అంటావా అని భార్యతో ఎగతాళిగా అంటాడు బాలు. ఇవ్వాళ తాను ఇంట్లో లేకపోతే రవి, మౌనికలకు అబద్దాలు చెప్పి ప్రభావతి పెళ్లిచేసేదని బాలు చెబుతాడు. అబద్దాలు ఆడి పెళ్లిచేస్తే ఆ కాపురం ఎక్కువ కాలం నిలబడదని, అబద్దాలు ఎప్పటికైనా బయటపడకతప్పదని మీనా అంటుంది.
ఇష్టంలేని పెళ్లి...
ఇష్టంలేని పెళ్లిళ్లు కూడా కొన్నిసార్లు ఇష్టంగా మారిపోతాయని నిన్ను, నన్ను చూసిన తర్వాతే అర్థమైందని మీనాపై ప్రేమను కురిపిస్తాడు బాలు. పెళ్లైనా కొత్తలో నిజంగానే నిన్ను ముళ్లకంపలానే భావించానని అంటాడు. నన్ను చేసుకున్నందుకు విచారపడుతున్నారా...నా గురించి ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేదన్నమాటా అని భర్తతో అంటుంది బాలు. భార్యల గురించి పూర్తిగా తెలుసుకున్నవాళ్లందరూ కాశీలు, రామేశ్వరాలు వెళ్లారని బాలు అంటాడు.మీరు కాశీ, రామేశ్వరం వెళితే నా పరిస్థితి ఏంటి సరదాగా మీనా భర్తతో అంటుంది.
నిజం దాచిన బాలు...
రవి, మౌనికలకు తల్లి కుదుర్చిన సంబంధాలు ఫిక్స్ కాకుండా చూడాలని బాలు అనుకుంటాడు. డబ్బుంటే చాలానే తల్లి అనుకుంటుందని ఆలోచిస్తాడు. రవికి, శృతికి పెళ్లి జరిపించాలని అనుకుంటాడు. రవికి మీరు చూసిన పెళ్లికూతురు ఎవరు అని మీనా ఎంత అడిగినా బాలు చెప్పడు. టైమ్ వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని తప్పించుకుంటాడు.
శృతి పెళ్లి ప్రపోజల్...
సంజు ఇంటి నేరుగా రవి రెస్టారెంట్‌కు వస్తుంది శృతి. మనం ఇప్పుడే పెళ్లిచేసుకుందామని రవితో అంటుంది శృతి. మా ఇంట్లో వాళ్లను ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకుందామని శృతితో అంటాడు రవి.
మా బాలు అన్నయ్య, నాన్న ఒప్పుకుంటే ఇంట్లో వాళ్లందరూ ఓకే అన్నట్లేనని చెబుతాడు. పెద్దల పర్మిషన్ తీసుకునే టైమ్ కూడా లేదని శృతి అంటుంది. ఇది మన లైఫ్ కాబట్టి మనమే నిర్ణయాలు తీసుకోవాలని రవితో సీరియస్‌గా అంటుంది. నీతో మాట్లాడితే కుదరదని, ఏం చేయాలో నాకు తెలుసునని కోపంగా రవితో అంటుంది. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రోహిణి ఎమోషనల్...
బ్యూటీ పార్లర్‌పై ఉన్న ప్రభావతి పేరును తీసేయడంతో రోహిణి ఎమోషనల్ అవుతుంది. ఈ నిజం అత్తయ్యకు తెలిస్తే తనపై ఉన్న నమ్మకం మొత్తం పోతుందని భయపడుతుంది. మరోవైపు తాను పెట్టిన పార్లర్‌లో తానే ఎంప్లాయ్‌గా మారడం జీర్ణించుకోలేకపోతుంది. అమ్మ వల్ల తన గురించి నిజం ఎక్కడ బయటపడుతుందోనని కంగారు పడుతుంది. నిజం బయటపడకుండా ఉండాలంటే వెంటనే అమ్మను ఊరి నుంచి పంపించాలని అనుకుంటుంది.
బయటపడ్డ నాటకం...
అప్పుడే రోహిణికి ప్రభావతి ఫోన్ చేసి బ్యూటీ పార్లర్‌కు వచ్చానని అంటుంది. క్వీన్ బ్యూటీ పార్లర్ అనే పేరు చూస్తే తన నాటకం మొత్తం బయటపడుతుందని కంగారుగా నేమ్ బోర్డ్‌పై క్లాస్ కప్పేస్తుంది. పార్లర్ అమ్మిన విషయం ప్రభావతికి తెలియకుండా కొత్త నాటకం మొదలుపెడుతుంది.
రవి ఇంటికి శృతి...
హోటల్ నుంచి డైరెక్ట్‌గా రవి ఇంటికొస్తుంది శృతి. రవిని ప్రేమించిన విషయం మీనాకు చెబుతుంది. రవిని లేవదీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది. అనుకోండా శృతిని ప్రభావతి, రోహిణి చూస్తారు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.