Gundeninda Gudigantalu Today Episode: పెళ్లిచూపుల్లో బాలు తండ్రికి అవమానం - ప్రభావతి అబద్దాలు - రవిపై మనోజ్ జెలసీ
గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 16 ఎపిసోడ్‌లో తమ్ముడు రవికి గొప్పింటి సంబంధం కుదరనుందని తెలిసి మనోజ్ జెలసీగా ఫీలవుతాడు. తమ్ముడు చేసేది చెఫ్ జాబ్ అంటూ చీప్‌గా మాట్లాడుతాడు. రవి జాబ్‌ను మనోజ్ కించపరుస్తూ మాట్లాడటం బాలు సహించలేకపోతాడు.
Gundeninda Gudigantalu Today Episode: రవితో కూతురి ప్రేమకు ఎలాగైనా పుల్‌స్టాప్ పెట్టాలని శృతి తల్లిదండ్రులు సురేంద్ర, శోభన అనుకుంటారు. కోటీశ్వరుడి కొడుకుతో శృతి పెళ్లిచూపులుఏర్పాటుచేస్తారు. పెళ్లిచూపులు అన్న సంగతి శృతి దగ్గర దాచిపెడతారు. చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న వారింటికి లంచ్‌కు వెళుతున్నామని, వాళ్లు నిన్ను చూడాలని కోరుకుంటున్నారని శృతితో అబద్ధం చెబుతుంది శోభన.
శృతి రానని అంటుంది.నిన్ను తీసుకొస్తానిన ఆప్తులకు మాటిచ్చానని, నా మాటను నిలబెట్టమని కూతురిని బతిమిలాడుతాడు సురేంద్ర. తండ్రి మాటలకు శృతి ఒప్పుకుంటుంది.
ప్రభావతి హడావిడి...
పెళ్లిచూపుల ఏర్పాట్లతో ప్రభావతి హడావిడి చేస్తుంటుంది. వచ్చేవాళ్లు కోటీశ్వరులని, వాళ్ల స్థాయికి తగ్గట్లు వంటలు రెడీ చేయాలని మీనాకు ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. వచ్చే వాళ్ల స్థాయి నీలాంటిదానికి ఏం తెలుస్తుందని మీనా మనసు గాయపడేలా ప్రభావతి మాట్లాడుతుంది. మీ ఆయన్ని రాత్రి బయటే తిరిగమని, ఇంటికిరావద్దని చెప్పమని మీనాతో అంటుంది ప్రభావతి.
తల్లి మాటల్ని బాలు వింటాడు. తమ్ముడు, చెల్లి చూపులకు అన్నయ్య లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారని ప్రభావతిని నిలదీస్తుంది మీనా. బాలు ఉంటే ఏదో ఒకటి తిక్కతిక్కగా మాట్లాడి సంబంధం చెడగొడతాడని ప్రభావతి కోపంగా అంటుంది. భర్తకు మీనా సపోర్ట్ చేస్తుంది. ఆయనకు ఎక్కడ ఏం మాట్లాడాలో బాగా తెలుసునని అంటుంది. భర్తను ఇంటికి రావద్దొని తాను చెప్పలేనని ప్రభావతికి బదులిస్తుంది మీనా.
అప్పులు, తప్పులు బయటపెట్టడానికి...
నన్ను ఇంటికి రావొద్దని అంటున్నావంటే మళ్లీ ఏదో మాస్టర్ ప్లాన్ వేశావని తల్లితో అంటాడు బాలు. నీ అప్పులు, తప్పులు బయటపెట్టడానికే నేను ఉన్నానని సెటైర్‌వేస్తాడు. పెళ్లిచూపుల్లో నువ్వు ఏదైనా తప్పుగా మాట్లాడినా, అబద్దాలు చెప్పిన ఊరుకోనని అంటాడు. నువ్వు ఉండొద్దని అన్నందుకైనా నేను ఇంట్లోనే ఉంటానని, క్యాబ్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుంటానని ప్రభావతికి షాకిస్తాడు బాలు.
సురేంద్ర కంగారు...
శృతి పెళ్లిచూపులకు లేట్‌గా తయారుకావడం చూసి శోభన, సురేంద్ర కంగారు పడతారు. శృతికి రవి తప్ప లోకంలో ఎవరూ నచ్చేలా లేరని భర్తతో అంటుంది శోభన. రవి సంగతి, వాళ్ల ప్రేమ సంగతి నేను చూసుకుంటానని భార్యకు మాటిస్తాడు సురేంద్ర. అప్పుడే అక్కడికి శృతి రావడంతో టాపిక్ మార్చేస్తారు.
వర్జ్యం రాకముందే అక్కడ ఉండాలని కూతురితో అంటుంది శోభన. తల్లి మాటలు వినగానే శృతి షాకవుతుంది. నాకు తెలియకుండా పెళ్లిచూపులు ఏమైనా ఏర్పాటుచేశారా అని తల్లిదండ్రులను నిలదీస్తుంది. నిజం బయటపడకుండా సురేంద్ర సర్ధిచెబుతాడు.
బాలు ఫైర్...
ఇంట్లో దుమ్ము, బూజు దులపమని మీనాకు ఆర్డర్స్ వేస్తుంటుంది ప్రభావతి, ఆ సీన్ చూసి బాలు కోప్పడుతాడు. రోహిణి మేకప్ వేసుకొని కూర్చుంటే మీనా పనిచేయాలా...నా భార్య ఏమైనా ఈ ఇంటి పని మనిషా అంటూ ప్రభావతిపై ఫైర్ అవుతాడు బాలు. ఇంటిపని, వంట పని అన్నీ మీనా ఎందుకు చేయాలని నిలదీస్తాడు. మధ్యలో రోహిణిని ఎందుకు లాగుతావని మనోజ్ భార్యకు సపోర్ట్ చేయబోతాడు.
షాకిచ్చిన రవి...
ఆ గొడవ జరుగుతుండగానే అక్కడికి రవి వస్తాడు. తాను రెస్టారెంట్‌కు వెళుతున్నానని అంటాడు. నీ పెళ్లి చూపులు పెట్టుకొని నువ్వే ఉండకపోతే ఎలా అందరూ అంటారు. తనకు ఇప్పుడే పెళ్లిచేసుకునే ఆలోచన లేదని రవి అంటాడు. రెస్టారెంట్ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు.
పెళ్లి చేసుకోనని అంటే ఎందుకు బలవంతం చేస్తున్నారని రవికి మీనా సపోర్ట్ చేస్తుంది. మధ్యలో నీ జోక్యం ఏమిటని మీనా మాటల్ని ప్రభావతి అడ్డుకుంటుంది.
మనోజ్ జెలసీ...
తన స్నేహితురాలు ధనలక్ష్మికి ఉన్న ఆస్తుల లిస్ట్ చెప్పేస్తుంది ప్రభావతి. గొప్ప సంబంధం మిస్సయితే మళ్లీ రాదని రవిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి. తల్లి మాటలతో రవికి ఇంత గొప్ప సంబంధంకుదిరితే తాను, రోహిణి ఇంట్లో లోకువైపోతామని మనోజ్ కంగారుపడతాడు.
చెఫ్‌గా పనిచేస్తోన్న తమ్ముడికి గొప్ప సంబంధం కుదరడం తట్టుకోలేకపోతాడు. అదే మాట బయటకు అంటాడు. అంత డబ్బున్న వాళ్లతో సంబంధం ఎలా సెట్ అవుతుందని అనుకుంటున్నావని మనసులో ఉన్న అసూయ మొత్తం బయటపెడతాడు.
మనోజ్‌కు బాలు క్లాస్..
రవి చేస్తోన్నచెఫ్ జాబ్ గురించి చీప్‌గా మాట్లాడుతాడు మనోజ్. రవి చేసే పని గురించి బాలు గొప్పగా చెబుతాడు. చెఫ్‌లను ఈజీగా తీసిపారేస్తే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు. చూస్తుంటే రవికి గొప్ప సంబంధం రావడం నీకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని మనోజ్‌తో అంటాడు బాలు.
అన్ని నిజాలే చెప్పాలి...
మన తాతలు మలేషియాలో మసాజ్ సెంటర్లు నడిపారని, టీ బిస్కెట్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టారని గొప్పలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగానే పెళ్లిచూపులకు వచ్చేవాళ్లకు అన్ని నిజాలే చెబుదామని బాలు అంటాడు. వచ్చేవాళ్ల ముందు ప్రభావతమ్మ ఇంటి యాజమానిలా బిల్డప్ ఇచ్చి నాన్నను తక్కువ చేస్తే సహించనని బాలు అంటాడు. నాన్నకు గౌరవం ఇచ్చేవాళ్లయితేనే పెళ్లికి ఒప్పుకుంటానని, ఏ మాత్రం తక్కువ చేసిన ఇంట్లో నుంచి పంపిచేస్తానని చెబుతాడు.
నీలకంఠం ఎంట్రీ...
సీరియల్‌లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. తనకు వార్నింగ్ ఇవ్వడానికి ఇంటికొచ్చిన పోలీస్ ఆఫీసర్‌ను నీలకంఠం చితక్కొడతాడు. అప్పుడే పెళ్లిచూపుల కోసం సురేంద్ర, శోభన తమ ఇంటికి రావడంతో అక్కడ ఏం జరిగిందో వాళ్లకు తెలియకుండా జాగ్రత్తపడతాడు నీలకంఠం. తన కొడుకు సంజును పిలుస్తాడు నీలకంఠం. సంజు నడవడిక, అతడి కోపం చూసి శృతి షాకవుతుంది.\
సత్యానికి అవమానం...
పెళ్లిచూపులకు వచ్చిన తన స్నేహితురాలికి అన్ని అబద్దాలే చెబుతుంది ప్రభావతి. రవి రెండు పెద్ద రెస్టారెంట్స్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడని అంటుంది. మౌనిక చదువు గురించి కూడా కల్పించి చెబుతుంది. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లు సత్యాన్ని అవమానిస్తారు. సత్యం చేతకాని దద్దమ్మనా, పిల్లలను ఎలా పెంచాలో తెలియని వెర్రివాడా అంటూ చులకన చేసి మాట్లాడుతారు. తండ్రిని తక్కువ చేయడంతో బాలు కోపం పట్టలేకపోతాడు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లను చితక్కొడతాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.