Gundeninda Gudigantalu Today Episode: భర్తపై అలిగిన మీనా - బాలును చులకన చేసి మాట్లాడిన రోహిణి - ప్రభావతికి పంచ్
Gundeninda Gudigantalu Today Episode: గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 13 ఎపిసోడ్‌లో మనోజ్ ఆఫీస్ నుంచి త్వరగా రావడం చూసి ఉద్యోగం నుంచి పీకేశారా అని బాలు అనుమానంగా అడుగుతాడు. ఆఫ్ట్రాల్ కారు నడిపేవాళ్లకు తన భర్త కష్టం ఏం తెలుస్తుందని బాలును అవమానిస్తూ మాట్లాడుతుంది రోహిణి.
Gundeninda Gudigantalu Today Episode: మీనా చెల్లెలు సుమతితో రవి ప్రేమలో ఉన్నాడనే నిజం ప్రభావతికి తెలిసిపోతుంది. సుమతి తన ఇంటి కోడలు కాకూడదని ప్రభావతి ఫిక్సవుతుంది. రవికి వేరే అమ్మాయిని ఇచ్చిపెళ్లిచేయాలని అనుకుంటుంది. పెళ్లి ప్రపోజల్‌ను కుటుంబసభ్యులందరి ముందు పెడుతుంది. సత్యం మాత్రం రవికి తన స్నేహితుడు రంగారావు తమ్ముడి కూతురిని ఇచ్చి పెళ్లిచేయాలనుకుంటాడు. సంబంధం ఖాయం చేసుకురమ్మని బాలును పంపిస్తాడు.
సంబంధం క్యాన్సిల్...
సంబంధం మాట్లాడటానికి వెళ్లిన బాలు ఇంటికొస్తాడు. బాలు ఏం మాట్లాడివచ్చాడో, అతడు ఏం చెబుతాడోనని మీనా, సత్యంతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. రంగారావు ఈ పెళ్లికి ఒప్పుకోలేదనే, నా తమ్ముడికి కూతురిని మీ ఇంటికి కోడలిగా పంపించి దాని గొంతు కోయలేనని ఆన్సర్ ఇచ్చాడనే అసలు నిజం చెబుతాడు బాలు.
ప్రభావతిని రాకసి, గయ్యాళిగంప అని రంగారావు అన్నాడని బాలు అంటాడు. బాలు మాటల్ని ప్రభావతి నమ్మదు. రంగారావు మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేస్తాడు బాలు. ఆ వాయిస్ రికార్డ్‌ను ప్రభావతికి వినిపిస్తాడు. రంగారావు తనను చులకన చేసి మాట్లాడటం ప్రభావతి సహించలేకపోతుంది. వాయిస్ రికార్డ్‌ను ఆపేయమని అంటుంది.
ప్రభావతి కోపం...
కోడలిని నేను కష్టపెడుతున్నానా అని ప్రభావతి అంటుంది. నన్నైతే అత్తయ్య బాగానే చూసుకుంటుందని రోహిణి అంటుంది. నన్నైతే అంటే మిగిలిన వాళ్లను బాగా చూడటం లేదనే అర్థం కదా అని బాలు సెటైర్లు వేస్తాడు. నీకు ఇప్పట్లో పెళ్లయ్యే యోగం లేదని రవితో అంటాడు బాలు. ఇప్పట్లో అంటే అని మౌనిక అడుగుతుంది. నేను బతికి ఉన్నంత వరకు అని కోపంగా ప్రభావతి కూతురికి సమాధానమిస్తుంది.
బాలు ఎగ్జైట్‌మెంట్...
ఒకప్పుడు ఆ అమ్మాయిని నీకు ఇద్దామని రంగారావు మావయ్య అనుకున్నాడని రవితో అంటాడు సత్యం. ఆ అమ్మాయి బాగుంటుందా? నన్ను చూసిందా? ఇష్టపడిందా అని బాలు ఎగ్జైట్ అవుతాడు. మనోజ్ లక్షలు మింగి పారిపోకుండా ఉంటే ఆ అమ్మాయితో నాకు పెళ్లి జరిగేది కదా అని బాలు అనగానే మీనా కోపం పట్టలేకపోతుంది. భర్తపై అలిగి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అన్నయ్యకు రవి థాంక్స్...
రవికి తానే మంచి సంబంధం కుదుర్చుతానని ప్రభావతి తీర్మాణిస్తుంది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రవి సమాధానమిస్తాడు. బాలుకు థాంక్స్ చెప్పివెళ్లిపోతాడు. బాలు మాటలకు మీనా అలుగుతుంది. ఓయ్ పూలగంప ఏమైందని మీనాను అడుగుతాడు బాలు.
మీ నిజస్వరూపం బయటపడిందని కోపంగా అంటుంది మీనా. రంగారావు తమ్ముడి కూతురిని మీకు ఇచ్చి పెళ్లిచేయాలని మావయ్య అనగానే...ఆ అమ్మాయి ఎర్రగా ఉంటుందా..బుర్రగా ఉంటుందా పొగిడారు కదా...ఆ అమ్మాయినే పెళ్లిచేసుకొండి అంటూ భర్తపై మీనా ఫైర్ అవుతుంది.
ఆరడుగుల అందగాడు...
పెళ్లికి ముందు ఆ అమ్మాయి తనకు సైట్ కొట్టేదని బాలు అంటాడు. మిమ్మల్ని పూర్తిగా చూసి ఉంటే జీవితంలో సైట్ కొట్టేది కాదని భర్త ఎగతాళి చేస్తుంది మీనా. తాను ఆరడుగుల అందగాడినని బాలు అంటాడు. అయ్యగారి అందాన్ని గురించి అయ్యగారే పొగుడుకోవాలని మీనా సమాధానమిస్తుంది. ఇద్దరు సరదాగా గొడవపడతారు.
మీనా వంటల లిస్ట్...
వంట చేయకుండా ఉండిపోతుంది మీనా. ఆమె ఆలక చూసి రవి నీ కంటే బాగా వండుతాడని బాలు సెటైర్లు వేస్తారు. ఇంట్లో ఒక్కొక్కరికి ఇష్టమైన వంటలు చేయడం ఎంత కష్టమో లిస్ట్ ఏకరువు పెడుతుంది మీనా . ఆ లిస్ట్ చూసి బాలు గాబరా పడతాడు. ఆమె కష్టం చూసి చలించిపోతాడు.
జీవితానికి పూలగంప చాలు...
నిన్ను ఏడిపించడానికే రంగారావు మావయ్య తమ్ముడి కూతురి గురించి నాన్నను అడిగానని అసలు నిజం బయటపెడతాడు బాలు. ఈ ముళ్లకంప జీవితానికి పూలగంప చాలని మీనాను కౌగిలించుకుంటాడు.
మీనా వంట పనులతో బిజీగా ఉంటే ప్రభావతి, రోహిణి కాఫీ తాగుతూ తీరిగ్గా కబుర్లు చెబుకుంటూ కనిపిస్తారు. ఆ సీన్ చూసి బాలు కోపం అణుచుకోలేకపోతాడు. నువ్వు, మౌనిక తప్ప ఇంట్లో ఆడవాళ్లు ఎవరూ లేరా అని అని అంటాడు. అత్తాకోడళ్లు ఇద్దరు ఇంటి ఖర్చులు ఎలా పెంచాలి, ఎవరికి తెలియకుండా ఏ వస్తువు తాకట్టు పెట్టాలో మాట్లాడుకుంటూ ఉంటారా అని ప్రభావతి, రోహిణిపై పంచ్‌లు వేస్తాడు.
ఉద్యోగం నుంచి పీకేశారా...
మనోజ్ ఆఫీస్ నుంచి త్వరగా రావడం చూసి ఈ ఉద్యోగం కూడా పీకేశారా బాలు అనుమానంగా అడుగుతాడు. నువ్వు ఈ ఉద్యోగంలో మంచి పేరుతో పాటు ప్రమోషన్ తెచ్చుకుంటే ఇలాంటివాళ్లు నిన్ను మాటల్ని అనాల్సిన అవసరం రాదని భర్తతో అంటుంది రోహిణి.
మీ బాస్ నా కస్టమర్ కదా...ఆమెతో నీ ప్రమోషన్ గురించి నేను మాట్లాడుతానని మనోజ్‌తో అంటుంది రోహిణి. భార్య మాటలు విని మనోజ్ కంగారు పడతాడు. నా ప్రమోషన్ గురించి ఎవరితో మాట్లాడాల్సిన పనిలేదని అంటాడు.
ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకు మనోజ్ డబ్బులు ఇస్తాడని ఎవరో మంగమ్మ శపథం చేశాడని బాలు అనగానే మనోజ్ కంగారు పడతాడు. అతడి టెన్షన్ చూసి అసలు నువ్వు జాబ్‌కు వెళుతున్నావా అని బాలు అనుమానంగా అడుగుతాడు.
రోహిణి షాక్...
మనోజ్ చేసే పని ఎంత కష్టమో నీకు తెలుసా అని భర్తకు సపోర్ట్‌గా మాట్లాడుతుంది రోహిణి. కష్టం చేస్తేనే కదా తెలిసేది నాకు అని మనోజ్ నోరు జారుతాడు. అతడి మాటలకు రోహిణితో పాటు ప్రభావతి షాకవుతారు. కష్టాన్ని కూడా ఇష్టపడి చేస్తున్నానని మాట మార్చుతాడు మనోజ్.
భర్తకు మీనా సపోర్ట్...
ఆఫ్ట్రాల్ కారు నడిపేవాళ్లకు, షోరూమ్‌లో పనిచేసేవాళ్లకు కష్టం విలువ ఏం తెలుస్తుందని బాలును అవమానిస్తుంది రోహిణి. నువ్వు తాగే కాఫీ, నీ భర్త తీసుకెళుతున్న క్యారేజీలోని అన్నం నేను చేస్తున్న ఆఫ్ట్రాల్ సంపాదనతోనే వస్తున్నాయని రోహిణికి తగ్గ సమాధానమిస్తాడు బాలు.
మనం చేసే వృత్తి ఏదైనా దేవుడితో సమానమని, ఇంకోసారి ఆఫ్ట్రాల్ అంటే ఊరుకోనని భర్తకు సపోర్ట్‌గా మీనా మాట్లాడుతుంది. ఇళ్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టిన నీకు కష్టం విలువ ఏం తెలుస్తుందని రోహిణితో అంటుంది మీనా. కోడలిపై ప్రభావతి ఫైర్ అవుతుంది.
రవి, మౌనిక పెళ్లిచూపులు...
రవి, మౌనికలకు పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తుంది ప్రభావతి. తన చిన్ననాటి స్నేహితురాలు ధనలక్ష్మి కూతురికి రవిని ఇచ్చి పెళ్లిచేయాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఇప్పుడు తమకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రవి, మౌనిక ఎంత చెప్పిన ప్రభావతి వినదు. సాయంత్రం వారు పెళ్లి చూపులకు వస్తున్నారని, అందరూ రెడీ అవ్వమని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. అసలు వాళ్ల గురించి ఎంక్వైరీ చేయకుండా నువ్వే సొంతంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటావని భార్యను నిలదీస్తాడు సత్యం.
మనోజ్ సెటైర్లు...
మరోవైపు ప్రభావతి చెప్పిన ధనలక్ష్మి తన కూతురు శృతికి మరో సంబంధం ఖాయం చేసే పనిలో ఉంటుంది. పెళ్లి చూపులకు ఉండకుండా రవి బయటకు వెళ్లడానికి సిద్ధపడతాడు. రెస్టారెంట్ బిజినెస్ చేసే రవి గొప్పింటివాళ్లకు నచ్చతాడో లేదో అని మనోజ్ తమ్ముడిని చులకన చేసి మాట్లాడుతాడు. వాళ్లేం పూల బిజినెస్ చేసేవాళ్లు కాదు అంటూ మీనాను అవమానిస్తాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.
మనోజ్ ఆఫీస్ నుంచి త్వరగా రావడం చూసి ఉద్యోగం నుంచి పీకేశారా అని బాలు అనుమానంగా అడుగుతాడు. ఆఫ్ట్రాల్ కారు నడిపేవాళ్లకు తన భర్త కష్టం ఏం తెలుస్తుందని బాలును అవమానిస్తూ మాట్లాడుతుంది రోహిణి. నా ఆఫ్ట్రాల్ సంపాదనతోనే నువ్వు, నీ భర్త బతుకుతున్నారని రోహిణి తగ్గ సమాధానమిస్తాడు బాలు.