Rohini karthe: రోహిణి కార్తె నుంచి వీరికి శుభ ఘడియలు రాబోతున్నాయి.. అందులో మీరు ఉన్నారా?
Rohini karthe: మే 25వ తేదీ సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు రాబోతున్నాయి. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

Rohini karthe: మే 25 నుంచి సూర్య భగవానుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. కృతిక నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రంలోకి తన గమనాన్ని ప్రారంభిస్తాడు. దీంతో అప్పటి నుంచి రోహిణి కార్తె మొదలవుతుంది.
సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సమయాన్ని రోహిణి కార్తెగా భావిస్తారు .ప్రస్తుతం కృత్తికా నక్షత్రంలో ఉన్న సూర్యుడు రేపటి నుంచి రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో సూర్య దేవుడిని ఆరాధించడం వల్ల ఎండ వేడి నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడి వేడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశులకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రాశుల వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం.
మేష రాశి
సూర్యుడి నక్షత్ర మార్పు మేష రాశి వారికి ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది. ఫలితంగా ఆర్థికపక్షం బలోపేతం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. తోబుట్టువులు సహాయం చేస్తారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. పనిలో విజయవకాశాలు మెరుగవుతాయి. మీకు అదృష్టం మద్దతు ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు ఇది అనుకూలమైన సమయం. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కుటుంబం నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుకుంటారు.
మిథున రాశి
రోహిణి కార్తె నుంచి మిథున రాశి వారికి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైన సమయం. గౌరవం లభిస్తుంది. అనేక పనుల్లో విజయం సాధిస్తారు .కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది .కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్త అందుతుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. లావాదేవీలకు అనుకూలమైన సమయం.
సింహ రాశి
సింహ రాశి వారికి సూర్యుడి సంచారం జీవితంలో వెలుగులు నింపబోతుంది. ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధన లాభం ఉంటుంది. ఇది ఆర్థిక కోణాన్ని బలోపేతం చేస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
కన్యా రాశి
ఈ సమయం కన్యా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లావాదేవీలు చేసేందుకు మంచి సమయం. అనేక రంగాల ద్వారా లాభాలు ఉంటాయి. ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సమయం ఒక వరం లాంటిది.
ధనుస్సు రాశి
సూర్యుడి నక్షత్ర మార్పు ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు పొందుతారు. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.