Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. సరికొత్త రికార్డు-ambajipeta marriage band ott streaming suhas movie record viewership in aha ott tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ambajipeta Marriage Band Ott: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. సరికొత్త రికార్డు

Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. సరికొత్త రికార్డు

Hari Prasad S HT Telugu
Mar 06, 2024 04:00 PM IST

Ambajipeta Marriage Band OTT: సుహాస్ మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఆహా ఓటీటీలో రికార్డు వ్యూస్ సొంతం చేసుకోవడంతోపాటు ఇప్పటికీ ఇంకా స్ట్రాంగా వెళ్తోంది.

ఓటీటీలోనూ దుమ్ము రేపుతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ
ఓటీటీలోనూ దుమ్ము రేపుతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ

Ambajipeta Marriage Band OTT: ఓ చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. సుహాస్ నటించిన ఈ సినిమాకు దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 2న రిలీజైన ఈ మూవీ.. మార్చి 1న ఆహా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో సక్సెసైన ఈ సినిమా ఓటీటీలో మరింత వేగంగా దూసుకెళ్తోంది.

yearly horoscope entry point

ఆహాలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు దూకుడు

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ మార్చి 1న ఆహా ఓటీటీలోకి వచ్చింది. అయితే తొలి ఐదు రోజుల్లోనే ఈ సినిమాకు ఆహా ఓటీటీలో 10 కోట్ల నిమిషాల మార్క్ అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది. "మా ఊరు అంబాజీపేట.. 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు, అయినా ఆగదు మా పాట"అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఈ విషయాన్ని షేర్ చేసింది.

ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూశారు. మార్చి 1న ఆహా ఓటీటీలోకి రాగానే ఎగబడి చూడటంతో ఐదు రోజుల్లోనే ఈ మూవీ రికార్డు 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ మైల్ స్టోన్ అందుకుంది. కథ, ఎమోషన్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు స్టోరీ ఇదీ

కుల అంత‌రాలు, పేద‌, ధ‌నిక కాన్సెప్ట్ అన్న‌ది ఎవ‌ర్‌గ్రీన్ ఫార్ములా. ఈ కాన్సెప్ట్‌తో తెలుగు తెర‌పై ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాలొచ్చాయి. మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు అనుగుణంగా క‌మ‌ర్షియ‌ల్ కోణంలో కాకుండా వాస్త‌విక‌త‌ను పెద్ద‌పీట ఈ ప్రేమ‌క‌థ‌ల‌ను చెప్ప‌డం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో ద‌ర్శ‌కుడు అదే ప్ర‌య‌త్నం చేశాడు.

అగ్ర వ‌ర్ణాల అధిప‌త్యాన్ని, కుల వివ‌క్ష‌ను ఎదురించి ఓ సాధార‌ణ యువ‌కుడు ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌ది స‌హ‌జంగా ఈ సినిమాలో చూపించారు. ఈ పోరాటంలో అత‌డి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా ఆవిష్క‌రించారు. కుల వివ‌క్ష కార‌ణంగా అట్ట‌డుగు వ‌ర్గాల వారు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌ను ఆలోచ‌నాత్మ‌కంగా అంబాజీపేట మ్యారేంజీ బ్యాండులో చూపించారు. కులం పేర్లు లేకుండా ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా దుష్యంత్ రాసిన డైలాగ్స్‌, కొన్ని సీన్స్ థియేట‌ర్ల‌లో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ప్ర‌తి ఒక్కరు పోటాపోటీగా నటించారు. మ‌ల్లి పాత్ర‌లో సుహాస్ ఒదిగిపోయాడు. ఈ క్యారెక్ట‌ర్‌కు ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అనిపించాడు.. న‌టిగా శ‌ర‌ణ్య‌లోని కొత్త కోణాన్ని ఈ సినిమా చూపించింది. సీరియ‌స్ రోల్స్ వ‌స్తే తాను ఏ స్థాయిలో చెల‌రేగ‌గ‌ల‌దో ఈ సినిమాలో చూపించింది.

సెకండాఫ్‌లో క‌థ మొత్తం శ‌ర‌ణ్య క్యారెక్ట‌ర్ చుట్టే సాగుతుంది. హీరోతో స‌మాన‌మైన క్యారెక్ట‌ర్‌లో యాక్టింగ్‌తో మెప్పించింది. నితిన్ ప్ర‌స‌న్న విల‌నిజం పీక్స్‌లో చూపించాడు. ద‌ర్శ‌కుడు రాసుకున్న పాత్ర‌కు పూర్తిగా న్యాయం చేశాడు. శివాని నాగారం కూడా ఒకే అనిపించింది. రైటర్ పద్మభూషణ్ తర్వాత సుహాస్ కు దక్కిన మరో హిట్ ఇది.

Whats_app_banner