Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీ రిలీజ్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ambajipeta marriage band ott release date revealed by aha ott platform suhas movie will stream from march 1 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ambajipeta Marriage Band Ott Release Date Revealed By Aha Ott Platform Suhas Movie Will Stream From March 1

Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీ రిలీజ్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 26, 2024 11:01 PM IST

Ambajipeta Marriage Band OTT Release date: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. స్ట్రీమింగ్ తేదీని ఆహా (Aha) ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది.

Aha OTT: అంబాజీపేట మ్యారేజ్ బాండ్ ఓటీటీ రిలీజ్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది
Aha OTT: అంబాజీపేట మ్యారేజ్ బాండ్ ఓటీటీ రిలీజ్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది

Ambajipeta Marriage Band on Aha OTT: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందో ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఎట్టకేలకు అధికారికంగా వెల్లడించింది. యువ నటుడు సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టింది. పాజిటివ్ టాక్‍తో మంచి వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్ట్రీమింగ్ డేట్‍ను అధికారికంగా వెల్లడించింది ఆహా ఓటీటీ.

మార్చి 1వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (ఫిబ్రవరి 26) అధికారిగంగా ప్రకటించింది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊహించిన ఆహా ఎట్టకేలకు నేడు స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.

“మార్చి 1వ తేదీ నుంచి మల్లిగాడి డప్పుల మోత. ఆహాలో మార్చి 1న అంబాజీపేట మ్యారేజ్‍బ్యాండ్ మూవీ ఆహాలో ప్రీమియర్ అవుతుంది” అని ఆహా ట్వీట్ చేసింది. స్ట్రీమింగ్ గురించి సుహాస్ చెప్పిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. “మన మోత ఎవరైనా థియేటర్లలో మిస్ అయి ఉంటే ఇప్పటి నుంచి ఇంట్లోనే చూడొచ్చు. ఆహాలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” అని ఆ వీడియోలో సుహాస్ చెప్పారు.

విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్, కామెడీ, యాక్షన్‍ సహా సామాజిక అంశాలతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శరణ్య ప్రదీప్ మరో ప్రధాన పాత్ర చేశారు. సుహాస్‍కు జోడీగా శివానీ నగారం నటించగా.. గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ బండారీ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న కీలకపాత్రలు చేశారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించగా.. సినిమాటోగ్రఫీ చేశారు వాజిద్ బేగ్. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్స్, మహయానా మోషన్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి ఆది నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో అంచనాలకు తగ్గట్టు సుమారు రూ.20కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.

అంబాజీపేట బ్యాక్‍డ్రాప్ ఇదే

మల్లికార్జున అలియాజ్ మల్లిగాడు (సుహాస్) బార్బర్‌గా ఉంటూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‍లోనూ పని చేస్తుంటాడు. లక్ష్మి (శివాని నగారం)తో అతడు ప్రేమలో పడతాడు. మల్లి సోదరి అతడి సోదరి పద్మావతి (శరణ్య ప్రదీప్) ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయురాలిగా ఉంటుంది. ఆ గ్రామంలో ఉండే వెంకట్ (నితిన్ ప్రసన్న)తో పద్మావతికి అక్రమ బంధం ఉందంటూ రూమర్లు వ్యాపిస్తాయి. ఈ క్రమంలో కులం పేరుతో పద్మను వెంకట్ అవమానిస్తాడు. దీంతో మల్లికార్జున, వెంకట్ మధ్య గొడవలు తలెత్తుతాయి. వెంకట్ సోదరి లక్ష్మినే మల్లి ప్రేమిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో ఉంటుంది.

బిగ్‍బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నచించిన బూట్‍కట్ బాలరాజు చిత్రం నేడు (ఫిబ్రవరి 26) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

IPL_Entry_Point