Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‍కు తొలి వారం వచ్చిన కలెక్షన్లు ఇవే.. థ్యాంక్స్ చెప్పిన సుహాస్
Ambajipeta Marriage Band 1 week Collections: అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా తొలి వారం మంచి వసూళ్లను రాబట్టింది. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకుంది. ఈ తరుణంలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు సుహాస్.
Ambajipeta Marriage Band Box office Collections: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రీసౌండ్ చేస్తోంది. సుహాస్ హీరోగా నటించిన ఈ హార్డ్ హిట్టింగ్ లవ్ యాక్షన్ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయింది. దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కాయి. అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం ఆకట్టుకోవడంతో పాటు మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేసింది. దీంతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా తొలివారం మంచి కలెక్షన్లను దక్కించుకుంది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం తొలి వారం (7 రోజుల్లో) ప్రపంచవ్యాప్తంగా రూ.11.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. మల్లిగాడి కథ అందరికీ తెగనచ్చేస్తోంది అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.
“బాక్సాఫీస్ దగ్గర మల్లిగాడి మోత. తొలివారంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం రూ.11.7కోట్ల గ్రాస్ సాధించింది. అన్ని సెంటర్లలో స్ట్రాంగ్‍గా కొనసాగుతోంది” అని మూవీ టీమ్ వెల్లడించింది.
ఈవారం ఈగల్, యాత్ర 2 చిత్రాలు రావటంతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‍కు వసూళ్లు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే, రేపు (ఫిబ్రవరి 10) ‘ట్రూ లవర్’ చిత్రం కూడా రిలీజ్ కానుంది. దీంతో ఆ మూవీ రన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే, పాజిటివ్ టాక్ ఉండడం అంబాజీపేట మూవీకి ప్లస్ పాయింట్‍గా ఉంది.
హ్యాట్రిక్‍కు థ్యాంక్స్: సుహాస్
తన చిత్రాలను వరుసగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు సుహాస్. కలర్‌ఫొటో చిత్రం ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకోగా.. గతేడాది రైటర్ పద్మభూషణం థియేటర్లలోకి వచ్చి అంచనాలకు మించి హిట్ అయింది. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా అదరగొడుతోంది. ఈ తరుణంలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ ఓ నోట్‍ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సుహాస్.
“యూట్యూబ్‍లో షార్ట్ ఫిల్మ్ లకు కామెంట్స్ పెట్టడం దగ్గరి నుంచి.. ఇప్పుడు బుక్‍మైషోలో టికెట్లు కొనే వరకు.. నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమతో నడిపిస్తున్నారు. మీ ఆదరణ ఎప్పటి మరిచిపోలేనిది. నటుడిగా నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు.. నా స్థాయిలో కథలను ఎంచుకొని మీ ముందుకు తీసుకురావడమే ఈ చిన్న ప్రయత్నం” అని సుహాస్ రాసుకొచ్చారు. తన మూడు సినిమాలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.
లైనప్‍లో మూడు చిత్రాలు
సుహాస్ హీరోగా మరో మూడు సినిమాలు లైన్‍లో ఉన్నాయి. ఈ విషయాన్ని అతడే తన నోట్‍లో కన్ఫర్మ్ చేశాడు. ప్రసన్న వదనం, కేబుల్ రెడ్డి చిత్రాలతో పాటు దిల్‍రాజు నిర్మాణంలో మరో మూవ చేస్తున్నట్టు తెలిపారు. అందరూ హాయిగా నవ్వుకునేలా మరో మూడు సినిమాలతో ముందుకు వస్తున్నానని చెప్పాడు.
హ్యాట్రిక్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అని, మరొక హ్యాట్రిక్ ఇస్తారని తాను ప్రయత్నం చేస్తూనే ఉంటానని సుహాస్ రాశాడు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంలో సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్‍గా చేయగా.. శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, జగదీశ్ ప్రతాప్ బండారీ కీరోల్స్ చేశారు. జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మెగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్స, మహయానా మోషన్ పిక్చర్స్ పతాకాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.