BhamaKalapam 2 OTT Release Date: భామా కలాపం 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్-bhamakalapam 2 ott release date priyamani movie will stream aha on february 16 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhamakalapam 2 Ott Release Date: భామా కలాపం 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్

BhamaKalapam 2 OTT Release Date: భామా కలాపం 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 30, 2024 08:33 PM IST

BhamaKalapam 2 OTT Release Date - Teaser: భామాకలాపం 2 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ మూవీ టీజర్ నేడు వచ్చింది. ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

BhamaKalapam 2 OTT Release Date: భామా కలాపం 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్
BhamaKalapam 2 OTT Release Date: భామా కలాపం 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్

BhamaKalapam 2 OTT Streaming Date: సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం’ సినిమా రెండేళ్ల క్రితం వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా వచ్చిన ఈ చిత్రం ఫేమస్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‍గా ‘భామాకలాపం 2’ ఇప్పుడు వస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. భామాకలాపం 2 సినిమా టీజర్‌ను నేడు రిలీజ్ చేసిన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ డేట్‍ను కూడా ఖరారు చేసింది. ఆ వివరాలివే..

క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్‌గా భామాకలాపం 2 మూవీ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరూ కలిసి ఓ దొంగతనం చేసేందుకు ప్రయత్నించడం చుట్టూ ఈ సినిమా ఉంటుందని అర్థమవుతోంది.

భామాకలాపం 2 సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (జనవరి 30) అధికారికంగా ప్రకటించింది. టీజర్‌తో పాటే స్ట్రీమింగ్ డేట్‍ను కూడా వెల్లడించింది.

టీజర్ ఇలా..

మొదటి భాగాన్ని గుర్తు చేసేలా భామాకలాపం 2 టీజర్ షూరు అయింది. ఈ మూవీలో అనుపమ పాత్రలో ప్రియమణి నటించారు. గతాన్ని మళ్లీ తమ లైఫ్‍లోకి తీసుకురాకూడదని అనుమప వద్ద ఆమె భర్త మాట తీసుకుంటారు. “అనుపమ (ప్రియమణి) అనే నేను.. పక్కనవాళ్ల విషయాల్లో తలదూర్చనని.. నా పని నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాటఇస్తున్నాను” అని అనుపమ చెబుతారు. అయితే, హోటల్ నడిపే ఆమె చాలా విషయాల్లో తలదూరుస్తారని టీజర్లో ఉంది. క్రైమ్ కూడా ఉండనున్నట్టు టీజర్లో తెలుస్తోంది.

అనుపమ, శిల్ప (శరణ్య) కలిసి ఓ శవాన్ని పూడ్చుతున్నట్టు కూడా భామాకలాపం 2 టీజర్లో ఉంది. “ఏ మాటకు ఆ మాట అక్కా.. నీకు.. శవాలకు డీప్ కనెక్షన్ ఉన్నట్టు ఉంది కదా.. అయితే నువ్వు వెతుక్కుంటూ వెళతావు.. లేకపోతే అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి” అని శిల్ప డైలాగ్ చెబుతారు. ఓ బంగారు కోడి ఈ టీజర్లో హైలైట్‍గా ఉంది. దాన్ని దోపిడీ చేయడమే ఈ చిత్రంలో కీలకంగా ఉండనుందని అర్థమవుతోంది. మొత్తంగా భామాకలాపం 2 టీజర్ ఆసక్తికరంగా సాగింది.

“అక్కడ జరిగింది ఒకటి, వీళ్లు చూపించేది ఒకటి! అసలు ఏం జరిగిందో ఆహాలో చూద్దాం. భామాకలాపం టీజర్ వచ్చేసింది. డబుల్ ఎంటర్‌టైన్‍మెంట్ అందించేందుకు డేంజరస్ హౌస్‍వైఫ్ అనుపమ రెడీ అయ్యారు. ఈ మూవీని ఫిబ్రవరి 16వ తేదీన హాట్‍గా సర్వ్ చేస్తాం” అని ఆహా ట్వీట్ చేసింది.

భామాకలాపం 2 చిత్రానికి అభిమన్యు దర్శకత్వం వహించారు. బాపినీడు బీ, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించిన ఈ చిత్రానికి దీపక్ యెరగీర సినిమాటోగ్రఫీ చేశారు.

టీజర్‌తో భామాకలాపం 2పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రుచికరమైన హీస్ట్ ఫీస్ట్ అంటూ ఆహా టీజ్ చేస్తోంది. క్రైమ్ ఎలిమెంట్స్, కామెడీతో పాటు ట్విస్టులు కూడా ఈ చిత్రంలో ఉండనున్నాయని అర్థమవుతోంది.

WhatsApp channel