Pindam OTT Release: లేటెస్ట్ టాలీవుడ్ మూవీస్ పిండం, బబుల్‌గమ్ ఒకే ఓటీటీలో రిలీజ్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bubblegum OTT Releasae Date: డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజైన బబుల్‌గమ్, పిండం సినిమాలు ఆహా ఓటీటీ ద్వారా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Bubblegum OTT Releasae Date: టెస్ట్ టాలీవుడ్ మూవీస్ పిండం, బబుల్‌గమ్ సినిమాలు త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల పోస్టర్స్‌ను ఆహా ఓటీటీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
త్వరలోనే ఈ మూవీస్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 2న పిండం, బబుల్‌గమ్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. పదిహేను రోజుల గ్యాప్‌లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలు ఇప్పుడు ఒకే రోజు ఓటీటీలో రిలీజ్ కానుండటం ఆసక్తికరంగా మారింది.
సుమ కనకాల తనయుడు హీరోగా...
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన బబుల్‌గమ్ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. మానస చౌదరి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. కథ కంటే రొమాంటిక్ అంశాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు బబుల్‌గమ్ సినిమాను తెరకెక్కించాడని విమర్శలొచ్చాయి.
బబుల్‌గమ్ కథ ఇదే...
ఆదిత్య అనే యువకుడిగా రోషన్ తొలి సినిమాలోనే యాక్టింగ్‌తో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆది...జాన్వీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆదిని జాన్వీ దారుణంగా అవమానిస్తుంది. ఓ పార్టీలో అతడి బట్టలు విప్పిస్తుంది. అలా ఎందుకు జరిగింది? జాన్వీ చేసిన అవమానానికి ఆది ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ.
సుమతో ఉన్న అనుబంధంతో బబుల్‌గమ్ ప్రమోషన్స్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, నానితో పాటు స్టార్ హీరోలందరూ పాల్గొన్నారు. అయినా అవేవీ థియేటర్లలో సినిమా విజయానికి ఉపయోగపడలేకపోయాయి. బబుల్ గమ్ సినిమాకు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించాడు. సిద్దు జొన్నలగ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించాడు.
హారర్ మూవీ పిండం...
శ్రీరామ్, ఖుషిరవి, ఈశ్వరీరావు ప్రధాన పాత్రల్లో నటించిన పిండం మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నది. ప్యూర్ హారర్ మూవీగా దర్శకుడు సాయికుమార్ దైదా ఈ సినిమాను తెరకెక్కించాడు. డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు నలభై ఐదు రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. రైసుమిల్లులో అకౌంటెంట్‌గా పనిచేసే ఆంథోనీ తన ఫ్యామిలీతో కలిసి ఓ ఊరి చివర ఉన్న ఇంటిలో దిగుతాడు. ఆ ఇంట్లో అతడికి ఎలాంటి అనూహ్య సంఘటనలు ఎదురయ్యాయి. కొన్ని ఆత్మల కారణంగా ఆంథోనీ ఫ్యామిలీ ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొన్నది. అన్నమ్మ వారి ఫ్యామిలిని ఎలా కాపాడింది అన్నదే పిండం మూవీ కథ.
ది స్కేరియెస్ట్ ఫిలం ఎవర్
ది స్కేరియెస్ట్ ఫిలం ఎవర్ అంటూ వినూత్నమైన ప్రమోషన్స్‌తో ఈ సినిమా ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించింది. పిండం సినిమాలో శ్రీనివాస్ అవసరాల గెస్ట్ పాత్రనులో కనిపించాడు. కృష్ణ సౌరభ్ సూరంపెల్లి పిండం సినిమాకు మ్యూజిక్ అందించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో శ్రీరామ్ హీరోగా నటించిన మూవీ ఇది. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే శ్రీరామ్ కనిపిస్తూ వచ్చాడు. ఒకరికి ఒకరు సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్. ఆ తర్వాత తెలుగులో దడ, రాగల 24 గంటల్లో, రావణాసురతో పాటు పలు సినిమాలు చేశాడు.