True Lover Trailer: ట్రూ లవర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. లవ్, ఎమోషన్‍తో ‘బేబీ’లా..-tollywood news true lover movie trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  True Lover Trailer: ట్రూ లవర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. లవ్, ఎమోషన్‍తో ‘బేబీ’లా..

True Lover Trailer: ట్రూ లవర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. లవ్, ఎమోషన్‍తో ‘బేబీ’లా..

True Love Trailer Released: ట్రూ లవర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. మణికందన్ హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇంటెన్స్‌గా ఉంది.

True Lover Trailer: ట్రూ లవర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. లవ్, ఎమోషన్‍తో ‘బేబీ’లా..

True Love Trailer: ట్రూ లవర్ సినిమాపై మంచి బజ్ ఉంది. బేబి చిత్రాన్ని నిర్మించిన ఎస్‍‍కేఎన్, డైరెక్టర్ మారుతీ సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తమిళ నటుడు మణికందన్, శ్రీ గౌరి ప్రియ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ట్రూ లవర్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్. ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా, నేడు (ఫిబ్రవరి 4) ట్రూ లవర్ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది.

ట్రూ లవర్ సినిమా.. అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరి ప్రియ) లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరు లవర్స్ మధ్య తరచూ గొడవలు జరిగి.. మళ్లీ కలుస్తుంటారు. అయితే, అరుణ్‍కు పెద్దగా డబ్బు ఉండదు. ప్రేమ గురించి ఇంట్లో చెప్పేందుకు, పెళ్లి చేసుకునేందుకు మరింత సమయం కావాలని దివ్య అడుగుతుంటుంది. దీంతో అరుణ్ కోప్పడుతుంటాడు. “డబ్బుకే రెస్పెక్ట్ ఇక్కడ. ఈ లవ్ బొక్కా ఇవన్నీ టైమ్ పాసే” అని అరుణ్ డైలాగ్ ఉంది. అరుణ్ మాటలతో దివ్య చాలాసార్లు బాధ పడుతుంది.

ఈ క్రమంలో దివ్యకు మదన్‍ అనే వ్యక్తితో పాటు వాళ్ల గ్యాంగ్ పరిచయం అవుతుంది. దీంతో అరుణ్ మరింత ఆగ్రహం చెంది దివ్యపై అరుస్తుంటాడు. దీంతో ఆమె మరింత వేదనకు గురవుతుంది. అయితే, అరుణ్‍తోనే ఉండాలని దివ్య అనుకుంటుందనేలా ట్రైలర్‌లో ఉంది. అరుణ్ కూడా దివ్య కోసం ఆరాపడుతుంటాడు. “ఆరేళ్ల రిలేషన్‍షిప్. వాడితో నేను ఓ లైఫ్ టైమ్ ఊహించుకున్నా” అని దివ్య డైలాగ్ ఎమోషనల్‍గా ఉంది. వీరి ప్రేమ సక్సెస్ అయిందా అనేదే ఈ ట్రూ లవర్ ప్రధాన అంశంగా ఉంటుందని అర్థమవుతోంది. సీన్ రోల్డన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా ఉంది.

బేబీను గుర్తు చేసేలా..

ట్రూ లవర్ సినిమా ట్రైలర్ ఎమోషనల్‍గా సాగింది. హార్డ్ హిట్టింగ్‍ మూవీలా అనిపిస్తోంది. గతేడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘బేబి’ చిత్రాన్ని ఈ మూవీ గుర్తు చేస్తోంది. ముందుగా ఇద్దరు ప్రేమించుకోవడం.. మారిన పరిస్థితుల వల్ల వారి మధ్య గ్యాప్ పెరగడం.. గొడవలు.. అమ్మాయికి వేరే వ్యక్తి పరిచయం అవడం లాంటి అంశాలు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. వాలైంటైన్స్ డేకు ముందు ఫిబ్రవరి 10న ట్రూ లవర్ చిత్రం రిలీజ్ కానుంది.

ట్రూ లవర్ మూవీలో మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లు కాగా.. కన్నా రవి, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు, అరుణాచలేశ్వరన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీతం అందించారు.

మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై నజరేత్ పాసిలియాన్, మేఘేశ్ రాజ్ పసిలియాన్, యువరాజ్ గణేశన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ మూవీ మేకర్స్, మారుతీ టీమ్ ప్రొడక్ట్ బ్యానర్లపై ఎస్‍కేఎన్, డైరెకర్ మారుతీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మూవీకి శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ చేయగా.. భరత్ విక్రమన్ ఎడిటింగ్ చేశారు.