Baby on Aha OTT: బేబి సినిమా ఓటీటీ రికార్డులను కూడా బద్దలు కొడుతుందా?-baby set to stream on aha from august 25 can this movie beat ott records ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baby On Aha Ott: బేబి సినిమా ఓటీటీ రికార్డులను కూడా బద్దలు కొడుతుందా?

Baby on Aha OTT: బేబి సినిమా ఓటీటీ రికార్డులను కూడా బద్దలు కొడుతుందా?

Baby on Aha OTT: బేబి చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో అద్భుత స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులు బద్దలుకొడుతుందన్న అంచనాలు ఉన్నాయి.

Baby on Aha OTT: బేబి సినిమా ఓటీటీ రికార్డులను కూడా బద్దలు కొడుతుందా? (Photo: Twitter)

Baby on Aha OTT: ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ‘బేబి’ సినిమా థియేటర్లలో సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా జూలై 14న విడుదలై సుమారు రూ.90కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఊహలకు మించి విజయాన్ని సాధించింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ‘బేబి’ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎమోషనల్‍గా సాగిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ యూత్‍ను విపరీతంగా ఆకట్టుకుంది. ‘బేబి’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాగా, బేబి సినిమా ఆహా ఓటీటీలో ఈనెల (ఆగస్టు) 25న స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఓటీటీలోనూ ఈ చిత్రం రికార్డులను బద్దలుకొడుతుందన్న అంచనాలు ఉన్నాయి. వివరాలివే..

బేబి సినిమా థియేటర్లలో 25 రోజులు పూర్తయ్యాక ఓ పాట, మరిన్ని సీన్లను చిత్ర యూనిట్ యాడ్ చేసింది. అంతకు ముందే చాలా మంది ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేశారు. అయితే, ఆ పాట, అదనపు సీన్ల కోసం వారు ఆహా ఓటీటీలో మరోసారి ‘బేబి’ సినిమాను చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే, ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని మళ్లీ చూడాలని కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, థియేటర్లలో చూడని వారు అధిక సంఖ్యలో ‘బేబి’ సినిమాను ఆహా ఓటీటీలో చూస్తారు. దీంతో ‘సామజవరగమన’ ఓటీటీ రికార్డులను బేబి బద్దలు కొడుతుందనే అంచనాలు ఉన్నాయి.

సామజవరగమన సినిమా ఆహాలో 40 గంటల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలతో రికార్డు సృష్టించింది. ఓటీటీలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును వేగంగా అందుకున్న తెలుగు చిత్రంగా నిలిచింది. అలాగే, 72 గంటల్లోనే 200 మిలియన్ల (20 కోట్ల)కు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. దీంతో ఓటీటీల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే, ఆహా ఓటీటీలోనే రానున్న బేబి సినిమా ఈ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనాలు బలంగా ఉన్నాయి.

ఆహా ఓటీటీ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారందరికీ ఆగస్టు 25వ తేదీన బేబి సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని ఆహా ఇటీవల అధికారికంగా ధ్రువీకరించింది.

బేబి సినిమా జూలై 14వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్‍ను ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. సాయి రాజేశ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. ఎస్‍కేఎన్ నిర్మించారు. సుమారు రూ.8కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రూ.91కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.