The Raja Saab: ఆ తర్వాతి నుంచే ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ అప్‍డేట్లు.. హింట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ-tollywood news director maruthi talks about prabhas the raja saab movie updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Raja Saab: ఆ తర్వాతి నుంచే ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ అప్‍డేట్లు.. హింట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ

The Raja Saab: ఆ తర్వాతి నుంచే ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ అప్‍డేట్లు.. హింట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2024 08:01 PM IST

Director Maruthi on The Raja Saab Updates : రాజాసాబ్ సినిమా అప్‍డేట్ల గురించి దర్శకుడు మారుతీకి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. ఎప్పటి నుంచి ఈ సినిమా అప్‍డేట్లు వచ్చే ఛాన్స్ ఉందో హింట్ ఇచ్చారు.

దర్శకుడు మారుతీ.. రాజాసాబ్ పోస్టర్
దర్శకుడు మారుతీ.. రాజాసాబ్ పోస్టర్

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సలార్ మూవీతో ఆయన బ్లాక్‍బాస్టర్ సొంతం చేసుకున్నారు. మళ్లీ సూపర్ హిట్ బాట పట్టారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ చేస్తున్నారు ప్రభాస్. హాలీవుడ్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోంది. కల్కి సినిమా మే 9వ తేదీన పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది. కాగా, మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్’ సినిమాను కూడా ప్రభాస్ చేస్తున్నారు.

రాజాసాబ్ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. పంచెకట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ రోల్ చేస్తున్నారు డార్లింగ్. రాజాసాబ్ నుంచి మరిన్ని అప్‍డేట్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు (జనవరి 29).. ‘ట్రూలవర్’ అనే మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‍లో మారుతీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ డేట్, అప్‍డేట్లపై మారుతీకి ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన స్పందించారు.

ప్రభాస్ నుంచి ముందుగా ఓ పెద్ద సినిమా (కల్కి 2898 ఏడీ) రానుందని, దీంతో ఇప్పుడు ఆ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలని మారుతీ అన్నారు. ఆ మూవీ తర్వాత ఎలాగూ రాజాసాబ్ గురించి అప్‍డేట్లు వస్తాయని ఆయన చెప్పారు. అంటే.. కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్ అప్‍డేట్లు వస్తాయనేలా మారుతీ హింట్ ఇచ్చారు.

“ఈ సినిమా (రాజాసాబ్) గురించి కంటే.. ఆయనది ముందు ఒక పెద్ద సినిమా (కల్కి 2898 ఏడీ) ఉంది. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎలాగూ మాది ఉంటుంది. వచ్చినప్పుడు చూద్దాం” అని మారుతీ చెప్పారు.

అందరికీ నచ్చే డేట్‍లోనే రాజాసాబ్ సినిమా రిలీజ్ అవుతుందని మారుతీ చెప్పారు. అయితే, ఎప్పటి కల్లా విడుదల చేయాలనుకుంటున్నది స్పష్టం చేయలేదు. అయితే, ఈ ఏడాది డిసెంబర్‌లోనే రాజాసాబ్‍ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని రూమర్లు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజాసాబ్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

రాజాసాబ్ సినిమా నుంచి ప్రతీ నెలా అప్‍డేట్లు ఇస్తామని ఫస్ట్ లుక్ రివీల్ సమయంలో మారుతీ చెప్పారు. అయితే, కల్కి 2898 ఏడీ రిలీజ్ తర్వాత అప్‍డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నట్టు తాజాగా సంకేతాలు ఇచ్చారు.

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ, పశుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా క్యామియో రోల్ చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024