Aha OTT: గూగుల్ ప్లేస్టోర్‌లోకి ఆహా యాప్ రీఎంట్రీ.. మరో స్ట్రీమింగ్ యాప్ కూడా..-aha ott android app back on google play store after delisting alt balaji also available now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott: గూగుల్ ప్లేస్టోర్‌లోకి ఆహా యాప్ రీఎంట్రీ.. మరో స్ట్రీమింగ్ యాప్ కూడా..

Aha OTT: గూగుల్ ప్లేస్టోర్‌లోకి ఆహా యాప్ రీఎంట్రీ.. మరో స్ట్రీమింగ్ యాప్ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 03, 2024 05:13 PM IST

Aha OTT App: ఆహా ఓటీటీ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లోకి మళ్లీ వచ్చేసింది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. ఆ వివరాలివే..

Aha OTT: గుడ్‍న్యూస్ చెప్పిన ఆహా ఓటీటీ.. ప్లేస్టోర్‌లోకి రీఎంట్రీ.. మరో స్ట్రీమింగ్ యాప్ కూడా..
Aha OTT: గుడ్‍న్యూస్ చెప్పిన ఆహా ఓటీటీ.. ప్లేస్టోర్‌లోకి రీఎంట్రీ.. మరో స్ట్రీమింగ్ యాప్ కూడా..

Aha OTT App: గూగుల్ తీసుకున్న చర్యల వల్ల కొన్ని ప్రముఖ సంస్థలకు చెందిన యాప్స్ ఇటీవల గూగుల్ ప్లే స్టోర్‌లో మాయమయ్యాయి. సుమారు 11 పాపులర్ యాప్‍లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఇందులో ఆహా, ఆల్ట్ బాలాజీ ఓటీటీ యాప్‍లతో పాటు నౌకరీ, షాదీ.కామ్ సహా మరిన్ని ఉన్నాయి. చెల్లింపులకు నిబంధనలను పాటించని కారణంగా ఆ యాప్‍లను ప్లే స్టోర్ నుంచి డీలిస్ట్ చేసినట్టు గూగుల్ పేర్కొంది. అయితే, గూగుల్ ప్లే స్టోర్‌లో నేడు (మార్చి 3) మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది ఆహా యాప్.

డీలిస్ట్ అయిన ఒక్క రోజు తర్వాత గూగుల్ ప్లే స్టోర్‌లో ఆహా ఆండ్రాయిడ్ యాప్ మళ్లీ అడుగుపెట్టింది. దీంతో యాప్ డౌన్‍లోడ్ చేసుకోవాలనుకున్న ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో తమ యాప్ మళ్లీ వచ్చేసిందని ఆహా నేడు అధికారికంగా వెల్లడించింది.

తమ యాప్ మళ్లీ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిందని, ఇక ఆ ప్లాట్‍ఫామ్‍లో డౌన్‍లోడ్ చేసుకోవచ్చని నేడు ట్వీట్ చేసింది ఆహా. ఇప్పటికే యాప్ ఉన్న వారు వాడుకోవడం కొనసాగించుకోవచ్చని తెలిపింది. కొత్తగా డౌన్‍లోడ్ చేసుకోవాలనుకునే వారు ప్లేస్టోర్‌కు వెళ్లి ఇన్‍స్టాల్ చేసుకోవాలని ట్వీట్‍లో పేర్కొంది.

ఆల్ట్ బాలాజీ యాప్ కూడా..

ఆల్ట్ బాలాజీ (ALTT) యాప్‍ను కూడా ప్లేస్టోర్ ఇటీవల తొలగించింది. అయితే, ఇప్పుడు ఈ యాప్ కూడా మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది.

తమ బిల్లింగ్ నిబంధనలను పాటించలేదని, సర్వీస్‍లకు చెల్లింపులు చేయలేదనే కారణాలతో ఆహా, ఆల్ట్ బాలాజీతో పాటు నౌకరి (ఇన్ఫోఎడ్జ్), భారత్ మాట్రిమోనీ, కూకూ ఎఫ్ఎం, షాదీ.కామ్, 99ఏకర్స్, క్వాక్ క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ, స్టేజ్, స్టేజ్ ఓటీటీ యాప్‍లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ ఇటీవల తొలగించింది. అయితే.. ఆహా, ఆల్ట్ బాలాజీ, నౌకరీతో వీటిలో మరిన్ని యాప్స్ కూడా మళ్లీ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ జోరు

సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మార్చి 1వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతోంది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెలలోగానే ఆహా ఓటీటీలోకి అడుగుపెట్టింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ లవ్ యాక్షన్ చిత్రంగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండును తెరకెక్కించారు దర్శకుడు దుశ్యంత్ కటికనేని. ఈ చిత్రంలో సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్‍‍గా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.