Janhvi Kapoor Telugu: జాన్వీ కపూర్ తెలుగులో ఎలా అనర్గళంగా మాట్లాడిందో చూశారా? లంగాఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా..-janhvi kapoor speaks telugu fluently looks stunning in a half saree remembers sridevi jr ntr devara movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi Kapoor Telugu: జాన్వీ కపూర్ తెలుగులో ఎలా అనర్గళంగా మాట్లాడిందో చూశారా? లంగాఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా..

Janhvi Kapoor Telugu: జాన్వీ కపూర్ తెలుగులో ఎలా అనర్గళంగా మాట్లాడిందో చూశారా? లంగాఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా..

Hari Prasad S HT Telugu
Sep 23, 2024 08:01 AM IST

Janhvi Kapoor Telugu: జాన్వీ కపూర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అంతేకాదు బ్లూ కలర్ లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఇక్కడి ప్రేక్షకులకు తన తల్లి శ్రీదేవిని గుర్తు చేసింది. దేవర మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇలా కనిపించింది.

జాన్వీ కపూర్ తెలుగులో ఎలా అనర్గళంగా మాట్లాడిందో చూశారా? లంగాఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా..
జాన్వీ కపూర్ తెలుగులో ఎలా అనర్గళంగా మాట్లాడిందో చూశారా? లంగాఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా..

Janhvi Kapoor Telugu: జాన్వీ కపూర్ ఇప్పుడు దేవర మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. అయితే సినిమా రిలీజ్ కు ముందే తెలుగు భాషపై తనకు ఎంతటి పట్టు ఉందో చూపించే ప్రయత్నం చేసింది. దేవర ప్రమోషన్లలో భాగంగా తాను తెలుగులో మాట్లాడుతున్న వీడియో తీసి దానిని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

yearly horoscope entry point

లంగాఓణీ వేసుకొని.. తెలుగులో మాట్లాడి..

ఈ వీడియోలో జాన్వీ కపూర్ లంగాఓణీ వేసుకొని అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. తాను తెలుగులో మాట్లాడిన ఈ మాటలు నేరుగా కలిసి చెబుదామని అనుకున్నా.. కుదరలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్ కూడా తెలుగులోనూ ఉంచడం విశేషం. ఈ వీడియో, తర్వాత ఆమె చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో జాన్వీ తెలుగు ప్రేక్షకుల ముందు అడుగు పెడుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుండటంతో దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ మధ్యే తమిళనాడు వెళ్లి అక్కడ తమిళంలోనూ అనర్గళంగా మాట్లాడి ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళ భాషలు, ఇక్కడి ప్రేక్షకులతో ఆమె తల్లి శ్రీదేవికి ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

జానూ పాప అని పిలుస్తున్నందుకు థ్యాంక్స్

"అందరినీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి, నామీద ప్రేమను చూపించిన తెలుగు ఆడియెన్స్, నన్ను జానూ పాప అని పిలస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు నన్ను అలా సొంత మనిషిలా ఫీలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలాగే నాకు కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడేలా ప్రతి రోజూ కష్టపడతాను. దేవర నా తొలి అడుగు. శివ సర్, ఎన్టీఆర్ సర్ నన్ను ఈ మూవీకి ఎంచుకోవడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్" అని జాన్వీ చెప్పింది.

ఈ వీడియోతోపాటు లంగాఓణీలో చేసిన ఫొటోషూట్ ను కూడా జాన్వీ ఈ సందర్భంగా అభిమానులతో పంచుకుంది. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. "నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబ్ధామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్న. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్. సెప్టెంబర్ 27న థియేటర్లలో కలుద్దాం" అని తెలుగులో క్యాప్షన్ ఉంచడం విశేషం.

వచ్చే శుక్రవారమే (సెప్టెంబర్ 27) మోస్ట్ అవేటెడ్ దేవర మూవీ థియేటర్లలోకి వస్తున్న విషయం తెలిసిందే. కొరటా శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించాడు. రెండున్నరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ రిలీజ్ కానుండటంతో అతని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.

Whats_app_banner