Zee Telugu Serials TRP: ఆదివారం సీరియల్స్‌తో దూసుకెళ్తున్న జీ తెలుగు.. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
Zee Telugu Serials TRP: ఆదివారం సీరియల్స్‌తో జీ తెలుగు ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కొన్నాళ్ల కిందటే బ్రేక్ లేకుండా ఆదివారం కూడా సీరియల్స్ ను ప్రసారం చేయనున్నట్లు సదరు ఛానెల్ వెల్లడించిన విషయం తెలుసు కదా.
Zee Telugu Serials TRP: తెలుగు సీరియల్స్ టీఆర్పీల్లో ఎప్పుడూ స్టార్ మా, జీ తెలుగు మధ్యే గట్టి పోటీ ఉంటుంది. అయితే ఇందులో స్టార్ మానే పైచేయి సాధిస్తూ వస్తోంది. కానీ కొన్నాళ్లుగా ఆదివారం కూడా సీరియల్స్ ప్రసారం చేస్తూ జీ తెలుగు రేసులోకి దూసుకురావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా జీ తెలుగు సీరియల్స్ ఆదివారం టీఆర్పీ రేటింగ్స్ కూడా బయటకు వచ్చాయి.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగులో ఆదివారం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. 37వ వారానికిగాను ఈ రేటింగ్స్ రిలీజ్ చేశారు. ఇవి కేవలం అర్బన్ మార్కెట్ కు సంబంధించిన రేటింగ్స్. ఇందులో మేఘ సందేశం సీరియల్ 7.88 రేటింగ్ తో టాప్ లో నిలిచింది. ఆ తర్వాత 7.40 రేటింగ్ తో నిండు నూరేళ్ల సావాసం రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో పడమటి సంధ్యారాగం (6.70), మా అన్నయ్య (5.92), త్రినయని (5.29), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి (4.30) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
నిజానికి అన్ని తెలుగు ఛానెల్స్ సీరియల్స్ ను సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నాయి. అయితే జీ తెలుగు మాత్రం కొన్ని రోజుల నుంచీ ఆదివారం కూడా ఈ సీరియల్స్ ప్రేమికులకు వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో అసలు గ్యాప్ లేకుండా కొనసాగిస్తోంది. సండే రోజు మిగిలిన ఛానెల్స్ లో సీరియల్స్ రాకపోవడంతో ఆ రోజు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ క్రమంగా మెరుగవుతూ వస్తున్నాయి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక ఈ మధ్యే స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ కూడా రిలీజయ్యాయి. జీ తెలుగు కంటే ఈ ఛానెల్ సీరియల్స్ చాలా మెరుగైన రేటింగ్స్ సాధిస్తున్నాయి. మొత్తంగా టాప్ 5 సీరియల్స్ అన్నీ స్టార్ మావే కావడం విశేషం. వీటిలో 12.00 రేటింగ్ తో బ్రహ్మముడి టాప్ లో కొనసాగుతుండగా.. 11.60 రేటింగ్ తో కార్తీకదీపం 2 సీరియల్ రెండో స్థానంలో ఉంది. ఇక గుండెనిండా గుడిగంటలు 10.63, ఇంటింటి రామాయణం 10.31తో రెండంకెల రేటింగ్స్ అదుకున్నాయి.
అటు తెలుగులో మరో రెండు టాప్ ఛానెల్స్ అయిన ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్ మాత్రం ఈ రెండు ఛానెల్స్ తో పోటీ పడలేకపోతున్నాయి. వాటిలో వచ్చే సీరియల్స్ రేటింగ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈటీవీ షోల విషయంలో మాత్రం స్టార్ మాకు గట్టి పోటీ ఇస్తోంది.