Laapataa Ladies Oscars: ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే.. ఈ ఓటీటీలో చూసేయండి-laapataa ladies indias official entry to the oscars 2025 watch kiran rao directed movie on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Laapataa Ladies Oscars: ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే.. ఈ ఓటీటీలో చూసేయండి

Laapataa Ladies Oscars: ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే.. ఈ ఓటీటీలో చూసేయండి

Hari Prasad S HT Telugu
Sep 23, 2024 01:26 PM IST

Laapataa Ladies Oscars: ఆస్కార్స్ కు ఈసారి ఇండియా నుంచి లాపతా లేడీస్ మూవీ అధికారిక ఎంట్రీగా ఉండనుంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ మూవీ వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డు కోసం పోటీ పడనుంది.

ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే.. ఈ ఓటీటీలో చూసేయండి
ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే.. ఈ ఓటీటీలో చూసేయండి

Laapataa Ladies Oscars: ఆస్కార్స్ వస్తున్నాయంటే చాలు.. ప్రతి ఏటా మన సినిమాకు ఏదైనా దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటాం. ఇక మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఏ సినిమాను పంపిస్తున్నారన్నదీ ఆసక్తి రేపే అంశమే. అయితే ఈసారి ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. హిందీ మూవీ లాపతా లేడీస్ మూవీ అకాడెమీ అవార్డులకు ఇండియా అధికారిక ఎంట్రీ కానుంది.

ఆస్కార్స్‌కు లాపతా లేడీస్

97వ అకాడెమీ అవార్డులు వచ్చే ఏడాది జరగనున్న విషయం తెలిసిందే. వీటి కోసం ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా ఏ సినిమాను పంపించాలో నిర్ణయించడానికి చెన్నైలో సోమవారం (సెప్టెంబర్ 23) ది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సమావేశమయ్యారు. ఇందులో లాపతా లేడీస్ మూవీని బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా అధికారిక ఎంట్రీగా పంపాలని నిర్ణయించారు.

కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మించాడు. ఈ మాజీ భార్యాభర్తల మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. తర్వాత ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేసింది. ప్రతిభా రాణా, స్పర్ష్ శ్రీవాస్తవ, నితాన్షి గోయెల్ లాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు.

లగాన్ నుంచి వెయిటింగే..

గతేడాది మలయాళం మూవీ 2018ను అధికారిక ఎంట్రీగా పంపించినా.. అది 96వ అకాడెమీ అవార్డుల కార్యక్రమంలో షార్ట్ లిస్ట్ కాలేకపోయింది. అయితే అంతకుముందు ఏడాది మాత్రం మన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు లభించింది.

అంతేకాదు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ వచ్చింది. చివరిగా ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్స్ లో షార్ట్ లిస్ట్ అయిన మూవీగా 2001లో వచ్చిన లగాన్ నిలిచింది. అయితే చివరికి ఆ సినిమాను వెనక్కి నెట్టి నో మ్యాన్స్ ల్యాండ్ అనే మూవీ ఆ అవార్డు సొంతం చేసుకుంది.

లాపతా లేడీస్ మూవీ ఏంటంటే?

లాపతా లేడీస్ ఓ సెటైరికల్ కామెడీ మూవీ. ఈ ఏడాది మార్చి 1న థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. అయితే ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టిన ఈ మూవీ.. అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. అత్యధిక మంచి చూసిన ఇండియన్ మూవీగా నెట్‌ఫ్లిక్స్ లో చరిత్ర సృష్టించింది. యానిమల్ లాంటి కమర్షియల్ సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.

సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు, లక్ష్యాలు, సంతోషాలు ఎలా అణచివేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకురాలు కిరణ్ రావ్ చూపించారు. పెళ్లి చేసుకొని అత్తవారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తారోననే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించారు.

లాపతా లేడీస్ సినిమా మెప్పించేలా ఉంది. అందరినీ ఆకట్టుకుంటుంది. లోతైన సీరియస్ విషయాలను ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించడంతో ఎక్కడా బోర్ కొట్టదు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా ఉంది. ఇప్పటి వరకూ చూడకపోతే వెంటనే చూసేయండి.