OTT: అఫీషియల్: ఓటీటీలోకి నాలుగున్నర నెలల తర్వాత నారా రోహిత్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-prathinidhi 2 ott release date revealed aha ott platform nara rohit political action thriller streaming details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: అఫీషియల్: ఓటీటీలోకి నాలుగున్నర నెలల తర్వాత నారా రోహిత్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT: అఫీషియల్: ఓటీటీలోకి నాలుగున్నర నెలల తర్వాత నారా రోహిత్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 23, 2024 09:24 PM IST

Prathinidhi 2 OTT Release Date: ప్రతినిధి 2 సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. థియేటర్లలో రిలీజైన చాలా రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..

Prathinidhi 2 OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి నాలుగున్నర నెలల తర్వాత  నారా రోహిత్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Prathinidhi 2 OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి నాలుగున్నర నెలల తర్వాత నారా రోహిత్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ కొన్నాళ్లు హాట్ టాపిక్ అయింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ మంచి క్రేజ్ మధ్య వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో రావటంతో ఈ పొలిటికల్ సినిమా క్యూరియాసిటీ పెంచింది. కొన్ని వాయిదాల తర్వాత మే 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, అనుకున్న స్థాయిలో ప్రతినిధి 2 సక్సెస్ కాలేదు. ప్రతినిధికి ఐదేళ్ల తర్వాత సీక్వెల్‍గా వచ్చిన ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేదు.

ప్రతినిధి 2 చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు. అయితే, ఆలస్యమవుతూనే వచ్చింది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. డేట్ అధికారికంగా ఖరారైంది.

స్ట్రీమింగ్ తేదీ ఇదే

ప్రతినిధి 2 చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (సెప్టెంబర్ 23) అధికారికంగా వెల్లడించింది. “ప్రశ్నించేందుకు ప్రతినిధి-2 వస్తున్నాడు. ఆహాలో సెప్టెంబర్ 27వ తేదీన ప్రీమియర్ కానుంది” అని సోషల్ మీడియాలో ఆహా పోస్ట్ చేసింది. త్వరలో అంటూ ఇటీవల టీజ్ చేసిన ఆహా ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్‍ను ఖరారు చేసింది.

నాలుగున్నర నెలల తర్వాత..

ప్రతినిధి 2 చిత్రం థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగున్నర నెలలకు ఆహా ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రం మే 10న థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ డీల్ కూడా ఆలస్యమైంది. అయితే, ఎట్టకేలకు ఆహా ఓటీటీ ఈ చిత్రాన్ని తీసుకుంది. సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు రెడీ అయింది.

ప్రతినిధి 2 చిత్రానికి జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. ఇది కూడా ఈ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచింది. సీఎం హత్య కేసును వెనుక మిస్టరీని ఓ జర్నలిస్ట్ ఛేదించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో నారా రోహిత్‍తో పాటు సిరి లేళ్ల, దినేశ్ తేజ్, ఉదయభాను, సప్తగిరి, సచిన్ ఖేడెకర్, జుస్సు సెంగుప్తా, అజయ్ ఘోష్ కీలకపాత్రలు పోషించారు.

ప్రతినిధి 2 మూవీని వానర ఎంటర్‌టైన్‍మెంట్స్, రాణా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేందర్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కుమారుడు మహతీ స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేశారు.

ప్రతినిధి 2 స్టోరీలైన్

ఓ ప్రముఖ జర్నలిస్ట్ (ఉదయభాను).. ఎన్‍ఎన్‍సీ పేరుతో ఓ ఛానెల్ ప్రారంభిస్తారు. నిజాలు చెప్పాలనే లక్ష్యంతో ఛానెల్ పెడతారు. నిజాయితీతో ఉండే జర్నలిస్ట్ చేతన్ (నారా రోహిత్)ను సీఈవోగా చేస్తారు. ఆ తర్వాత అవినీతి పరులైన రాజకీయ నాయకుల గుట్టు బయటపెడుతుంటాడు చేతన్. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడెకర్) హత్యకు గురవుతారు. ఈ హత్యకు కారణాలేంటి? ఎవరు చేశారు? ఈ మిస్టరీని చేతన్ ఛేదిస్తాడా? అనే అంశాలు ప్రతినిధి 2 మూవీలో ప్రధానంగా ఉంటాయి.