Actor Naresh on Marriages: పెళ్లిళ్లపై సీనియర్ నటుడు నరేశ్ కామెంట్లు.. గట్టిగా నవ్వేసిన నారా రోహిత్
Actor VK Naresh on Marriages: సీనియర్ యాక్టర్ నరేశ్ పెళ్లిళ్లపై కామెంట్ చేశారు. దీంతో హీరో నారా రోహిత్ సహా సుందరకాండ మూవీ టీమ్ సభ్యులు మొత్తం పడిపడి నవ్వారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‍లో పెళ్లి వచ్చిన ప్రశ్నకు నరేశ్ స్పందించారు.
సీనియర్ నటుడు వీకే నరేశ్ పెళ్లిళ్ల విషయం చాలా కాలం హాట్‍టాపిక్‍గా నడిచింది. నటి పవిత్రా లోకేశ్‍ను ఆయన గతేడాది నాలుగో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన మూడో భార్య రమ్యా రఘుపతి అడ్డుపడేందుకు ప్రయత్నించారు. ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. ఎట్టకేలకు నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు. అందుకే ఆయనకు చాలాసార్లు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ సినిమా కూడా పెళ్లి గురించే తెరకెక్కింది. ఈ చిత్రంలో నరేశ్ కూడా ఓ కీలకపాత్ర చేశారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 26) జరిగింది.
సుందరకాండ టీజర్ ఈవెంట్‍లో నరేశ్‍కు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చెప్పిన సమాధానంతో అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు.
మరొక్కసారి ట్రై చేద్దామని..
వ్యక్తిగత అనుభవం ప్రకారం పెళ్లి అయితే సంతోషమా.. కాకపోతే హ్యాపీనా అని ఈ ఈవెంట్‍లో నరేశ్‍కు ప్రశ్న ఎదురైంది. తమ జనరేషన్ వారు ఇంకోసారి పెళ్లి ట్రై చేద్దామని అనుకుంటున్నారని నరేశ్ అనడంతో అందరూ గట్టిగా నవ్వారు. “ఇప్పటి తరం అసలు పెళ్లి వద్దని. ఇంతకు ముందు తరాలు మరొక్కసారి ట్రై చేద్దామని.. ఎందుకోసం ఇది.. హ్యాపీ ఉండడానికే కదా.” అని నరేశ్ అన్నారు. “కాబట్టి ఈ మధ్యలో నేను” అంటూ తన గురించి చెప్పబోయి అంతే అంటూ ఆపేశారు. దీంతో అందరూ నవ్వారు.
తన మూవీపైనే పై నారా రోహిత్ పంచ్
ప్రతినిధి 2 హిట్ అయిందని, దానికి సీక్వెల్ ఎప్పుడు తీస్తారంటూ నారా రోహిత్‍కు క్వశ్చన్ ఎదురైంది. దీంతో ఆయన స్పందించారు. ప్రతినిధి 2 ప్లాఫ్ అయిందని స్వయంగా నారా రోహిత్ అన్నారు. “అదెక్కడ హిట్ అయిందండి. నిజంగా సినిమా వచ్చిందని కూడా తెలియదు. మీరు అన్నిసార్లు అడిగేసరికి వచ్చిందా సినిమా అనుకుంటున్నాను” అని నారా రోహిత్ తన చిత్రంపైనే పంచ్ వేసుకున్నారు. మూవీ ఆడలేదని అంగీకరించడం గొప్ప అని అంటే.. తాను చెప్పకపోయినా ఈ మూవీ ఆడలేదనే రాస్తారని రోహిత్ అన్నారు.
నారా రోహిత్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా మూవీ ప్రతినిధి 2 ఈ ఏడాది 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అనుకున్నస్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
సుందరకాండ టీజర్ ఇలా..
సిద్ధార్థ్ (నారా రోహిత్)కు వయసు దాటిపోతున్నా పెళ్లి మాత్రం అవుతుండదు. అతడికి పెళ్లి కావడం లేదని అందరూ పంచ్‍లు వేస్తుంటారు. తనది మూలా నక్షత్రమని, ఐదు నిమిషాలకు మించి సంతోషంగా ఉండలేననే డైలాగ్ ఉంది. పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఓ ఐదు క్వాలిటీలు ఉండాలని సిద్ధార్థ్ కోరుకుంటుంటాడు. ఇలా పెళ్లి వయసు దాటిపోతున్నా అతడికి వివాహం జరగకుండా ఉంటుంది. ఈ మూవీలో నారా రోహిత్ తండ్రి పాత్రలో నరేశ్ నటించారు.
సుందరకాండ సినిమాలో నారా రోహిత్, నరేశ్‍తో పాటు శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వర్గనీ, వాసుకీ ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ గోమటం, విశ్వాంత్, రూప లక్ష్మి, రఘుబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.