Prathinidhi 2 Review: ప్రతినిధి 2 రివ్యూ.. నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ ఆకట్టుకుందా? ఏ పార్టీకి అనుకూలంగా తీశారు?
Prathinidhi 2 Movie Review In Telugu: నారా రోహిత్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ప్రతినిధి 2. టీవీ 5 మూర్తి దర్శకుడిగా తెరంగేట్రంచేసిన ఈ సినిమా ఎలా ఉందో ప్రతినిధి 2 రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ప్రతినిధి 2
నటీనటులు: నారా రోహిత్, సిరి లెల్ల, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడ్‌కర్, దినేష్ తేజ్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, ప్రధ్వీ రాజ్, సప్తగిరి తదితరులు
దర్శకుడు: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్ర నాథ్ బొల్లినేని
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
విడుదల తేది: మే 10, 2024
Prathinidhi 2 Review In Telugu: 2014లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ప్రతినిధి. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమానే ప్రతినిధి 2. ఈ మూవీతో జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు అలియాస్ టీవీ5 మూర్తి దర్శకుడిగా పరిచయం అయ్యారు. సిరి లెల్ల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇవాళ అంటే మే 10న థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ప్రతినిధి 2 రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే చేతన్ నిజాయితీపరుడు. ఎలాంటి సవాళ్లు ఎదురైన ధైర్యంగా నిజాన్ని బయటపెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అతని ప్రతిభాపాటవాలు చూసి ఎన్సీసీ న్యూస్ ఛానెల్ సీఈవోగా నియమిస్తారు. ఈ క్రమంలోనే ప్రజా శ్రేయస్సు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడ్‌కర్)పై అటాక్ జరుగుతుంది. ఈ దాడిలో సీఎం మరణిస్తారు.
ముఖ్యమంత్రి మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? సీఎం హత్య వెనుక ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి చనిపోతే లాభం పొందేవారు ఎవరు? సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో బయటకు వచ్చిన నిజాలు ఏంటీ? జర్నలిస్ట్ చేతన్ పాత్ర ఏంటీ అతను చేసిన పోరాటం ఏంటీ? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ప్రతినిధి 2 చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రతినిధి 2ని ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో మాత్రం కాస్తా విఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయాలు, పొలిటికల్ లీడర్స్ పనితీరు, వ్యవహార శైలీ, అవినితీ, సిస్టమ్ లోని లొసుగులు ఇలా ప్రతి అంశాన్ని చక్కగా చూపించారు. ఓటర్ల బలహీనతలు, చేసే తప్పులపై సినిమాలో ప్రస్తావించారు.
నారా రోహిత్- మూర్తి దేవగుప్తపు కాంబో మూవీ అనగానే ఒక పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా వచ్చే సినిమా అని చాలా మందికి ఓ అంచనా ఉంది. కానీ, అందుకు భిన్నంగా సినిమాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి హత్య, అనంతరం సీఎం కుమారుడు పదవి చేపాట్టలనుకోవడం వంటి విషయాలు కొన్ని నిజ జీవిత సంఘటనలకు సిమిలర్‌గా ఉన్న ఎక్కువగా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా రూపొందించారు.
రాజకీయ వ్యవస్థలో జర్నలిజం ఎలా ఉండాలనే విషయాన్ని తనదైన కోణంలో చిత్రీకరించారు. ఫస్టాఫ్ ఉత్కంఠంగా సాగిన సెకండాఫ్‌లో స్లో నెరేషన్‌తో ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడు. మరింత బలంగా రాసుకోవాల్సిన సన్నివేశాల్లోనూ పూర్తి పొలిటికల్ డ్రామా ఉండటంతో కాస్తా బోర్ ఫీల్ అవుతారు. కొన్ని సన్నివేశాల్లో బాగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారనిపిస్తుంది.
అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇంటెలిజెన్స్‌కు తెలియకపోవడం వంటివి లాజిక్‌కు దూరంగా ఉంటాయి. మహతి స్వర సాగర్ అందించిన బీజీఎమ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలకు కత్తెర పడి ఉంటే మరింత రేసీగా సినిమా ఉండేది. సాంకేతిక నిర్మాణ విలువలు అంతా ఓకే.
ఫైనల్‌గా చెప్పాలంటే
నిజాయితీ గల జర్నలిస్ట్‌గా నారా రోహిత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాల్లోకి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన అలాంటి ఫీలింగ్ కలగలేదు. మరోసారి తన డైలాగ్ డెలీవరీతో, హావాభావాలతో అలరించాడు. దర్శకుడిగా మారిన మూర్తి దేవగుప్తపు డైరెక్టర్‌గా పూర్తి స్థాయిలో కాకున్న తాను చెప్పాలనుకున్నది చెప్పి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే కాస్తా బోర్ కొట్టిన ఆలోచింపజేసే డైలాగ్స్, కొన్ని ట్విస్టులతో ఎంటర్టైన్ చేసే పొలిటికల్ డ్రామా ప్రతినిధి 2.
రేటింగ్: 2.5/5
టాపిక్