Devara Ticket Rates: తెలంగాణలోనూ దేవర టికెట్ రేట్ల పెంపు.. 29 థియేటర్లలో ఒంటి గంట షోలు.. లిస్ట్ ఇదే-devara tickets prices hikes and additional shows in telangana 1am show in 29 theaters check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Ticket Rates: తెలంగాణలోనూ దేవర టికెట్ రేట్ల పెంపు.. 29 థియేటర్లలో ఒంటి గంట షోలు.. లిస్ట్ ఇదే

Devara Ticket Rates: తెలంగాణలోనూ దేవర టికెట్ రేట్ల పెంపు.. 29 థియేటర్లలో ఒంటి గంట షోలు.. లిస్ట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 23, 2024 09:10 PM IST

Devara Movie Tickets: దేవర సినిమా టికెట్ ధరలపై తెలంగాణలోనూ క్లారిటీ వచ్చేసింది. అదనపు రేట్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఏపీ కంటే పెంపు తక్కువే ఉంది. అలాగే, అదనపు షోలకు కూడా అనుమతి లభించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Devara: తెలంగాణలోనూ దేవర టికెట్ రేట్ల పెంపు.. 29 థియేటర్లలో ఒంటి గంట షోలు.. లిస్ట్ ఇదే
Devara: తెలంగాణలోనూ దేవర టికెట్ రేట్ల పెంపు.. 29 థియేటర్లలో ఒంటి గంట షోలు.. లిస్ట్ ఇదే

దేవర రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది సినీ ప్రేక్షకుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరుగుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సెప్టెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నేడు (సెప్టెంబర్ 23) అనుమతులు ఇచ్చింది. అదనపు షోలకు ఓకే చెప్పింది.

రేట్ల పెంపు ఇలా..

దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తొలి రోజైన సెప్టెంబర్ 27న దేవర సినిమా ఒక్కో టికెట్‍పై రూ.100 అదనంగా ధర పెంచేందుకు సర్కార్ ఓకే చెప్పింది. ఆ తర్వాత తొమ్మిది రోజులు తెలంగాణవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‍పై రూ.25 రేటును పెంచుకునేందుకు ఓకే చెప్పింది.

అదనపు షోలు ఇలా..

తెలంగాణవ్యాప్తంగా దేవర తొలి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండో రోజు నుంచి పదో రోజు వరకు ప్రతీ రోజు ఐదు షోలకు ఓకే చెప్పింది. తొలి రోజు అర్ధరాత్రి 1 గంట షోకు మాత్రం 29 థియేటర్లకే తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. కాగా, తెలంగాణలోనూ దేవర భారీస్థాయిలో రిలీజ్ కానుంది.

ఒంటి గంట షోలు ఈ థియేటర్లలోనే..

29 థియేటర్లలో సెప్టెంబర్ 27న అర్ధరాత్రి దేవర ఒంటి గంట షోలు ఉండనున్నాయి.

  • హైదరాబాద్‍ ఆర్టీసీ క్రాస్‍రోడ్స్‌ - సుదర్శన్ 35ఎంఎం, దేవీ 70ఎంఎం, సంధ్య 35ఎంఎం, సంధ్య 70ఎంఎం థియేటర్లు
  • కూకట్‍పల్లి - విశ్వనాథ్, మల్లికార్జున, భ్రమరాంబ, అర్జున్ థియేటర్లు
  • ఎర్రగడ్డ - గోకుల్ థియేటర్లు
  • మూసాపేట - శ్రీరాములు
  • అత్తాపూర్‌ - ఎస్‍వీసీ ఈశ్వర్
  • ఆర్సీ పురం - ఎస్‍వీసీ సంగీత
  • మల్కాజ్‍గిరి - శ్రీసాయిరాం
  • దిల్‍సుఖ్‍నగర్‌ - కోనార్క్
  • కర్మాన్‍ఘాట్‍ - ఎస్‍వీసీ శ్రీలక్ష్మి
  • మాదాపూర్ - బీఆర్ హైటెక్
  • గచ్చిబౌలీ - ఏఎంబీ సినిమాస్
  • ఆమిర్ పేట్ - ఏఏఏ సినిమాస్
  • కూకట్‍పల్లి - పీవీఆర్ నెక్సస్ మాల్
  • ఎన్టీఆర్ గార్డెన్స్ - ప్రసాద్ మల్టీప్లెక్స్
  • నల్లగడ్డ - అపర్ణ థియేటర్
  • ఖమ్మం - శ్రీతిరుమల, వినోద, సాయిరామ్, శ్రీనివాస, కేపీఎస్ ఆదిత్య
  • మిర్యాలగూడ - విట్రోస్ సినీప్లెక్స్
  • మహబూబ్‍నగర్‌ - ఏవీడీ తిరుమల కాంప్లెక్స్
  • గద్వాల్‍ - ఎస్‍వీసీ మల్టీప్లెక్స్

సెప్టెంబర్ 27న వందలాది థియేటర్లలో దేవర మూవీ ఆరు షోలు ఉండనున్నాయి. పెద్దగా పోటీ లేకపోవటంతో ఈ సినిమాకు భారీస్థాయిలో రిలీజ్ కానుంది. రెండో రోజు నుంచి పదో రోజు వరకు ఐదు షోలు ఉంటాయి.

ఏపీ కంటే తెలంగాణలో పెంపు తక్కువే

ఆంధ్రప్రదేశ్‍లో దేవర టికెట్ల పెంపునకు ఇటీవలే అనుమతి వచ్చింది. ఏపీలోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు ఆ ప్రభుత్వం ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్ బాల్కనీ టికెట్‍పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్‍పై రూ.60 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల పాటు ఈ ధరల పెంపు వర్తిస్తుంది. తొలి రోజు ఆరు షోలు, రెండో రోజు నుంచి పదో రోజు వరకు ఐదు షోలకు అనుమతి దక్కింది. అయితే, టికెట్లపై అదనపు ధరలు ఏపీతో పోలిస్తే తెలంగాణలో తక్కువగా ఉంటాయి.

దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.