Telugu Cinema News Live September 16, 2024: OTT Spy Thriller: ఓటీటీలో దుమ్మురేపుతున్న స్పై థ్రిల్లర్ చిత్రం.. మూడు రోజుల్లోనే మైల్‍స్టోన్ దాటేసిన మూవీ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 16 Sep 202403:56 PM IST
- Berlin - Spy Thriller OTT Movie: బెర్లిన్ చిత్రం ఓటీటీలో దూసుకెళుతోంది. నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ ఆరంభం నుంచి మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. దీంతో ఈ స్పై థ్రిల్లర్ సినిమా మూడు రోజుల్లోనే ఓ మైలురాయి అధిగమించింది.
Mon, 16 Sep 202403:01 PM IST
- Devara New Trailer: దేవర చిత్రం నుంచి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారని రూమర్లు బయటికి వచ్చాయి. సినిమా విడుదలకు ముందు దీన్ని తీసుకొచ్చేలా ప్లాన్స్ చేస్తున్నారట. ఆ వివరాలు ఇవే..
Mon, 16 Sep 202401:16 PM IST
- Leela Vinodam OTT Telugu web series: లీలా వినోదం వెబ్ సిరీస్ టీజర్ వచ్చింది. ఈ సిరీస్‍లో షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్ చేస్తున్నారు. అతడి పుట్టిన రోజు సందర్భంగా నేడు టీజర్ రిలీజ్ అయింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే కాస్త ఆలస్యంగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది.
Mon, 16 Sep 202411:09 AM IST
- Demonte Colony 2 OTT Release Date: డిమోంటి కాలనీ 2 చిత్రం థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. మంచి ట్విస్టులు ఉండే ఈ మూవీ ఎప్పుడు, ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ చూడండి.
Mon, 16 Sep 202410:20 AM IST
- Bigg Boss Shekar Basha: తనను బిగ్‍బాస్ హౌస్ నుంచి పంపించేందుకు కంటెస్టెంట్లు ఎందుకు నిర్ణయించుకున్నారో శేఖర్ బాషా వెల్లడించారు. ప్రేమతో తనను ఎలిమినేట్ చేశారని తెలిపారు. బిగ్‍బాస్ ఎవరు గెలిస్తే బాగుంటుందో కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Mon, 16 Sep 202410:19 AM IST
- Shakira Video: స్టార్ సింగర్ షకీరాకు చేదు అనుభవం ఎదురైంది. పొట్టి డ్రెస్ వేసుకొని స్టేజ్ పై పర్ఫార్మ్ చేస్తుండగా.. ఓ అభిమాని ఆమె కాళ్ల మధ్యలో నుంచి వీడియో షూట్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె షో మధ్యలోనే స్టేజ్ దిగి వెళ్లిపోయింది.
Mon, 16 Sep 202409:45 AM IST
- OTT Horror Thriller: ఈ వారం ఓటీటీలోకి ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. చాలా రోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందటే ఎంతో ఆసక్తి రేపేలా ఉన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ పేరు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్.
Mon, 16 Sep 202409:25 AM IST
- Tiragabadara Saami OTT Release Date: తిరగబడరా సామీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే..
Mon, 16 Sep 202409:23 AM IST
Mathu Vadalara 2 : మత్తు వదలరా 2 మూవీ ఫస్ట్ వీకెండ్‌లోనే లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. మూడు రోజుల్లో ఈ మూవీ 16.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీలో శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలు పోషించారు.
Mon, 16 Sep 202408:34 AM IST
- Lal Salaam OTT: లాల్ సలామ్ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ వెల్లడించారు. పోయిన హార్డ్‌వేర్ దొరికినట్టు వెల్లడించారు. ఆ వివరాలివే..
Mon, 16 Sep 202407:54 AM IST
Mukesh Gowda: గుప్పెడంత మనసు రిషి తెలుగు డెబ్యూ మూవీ గీతాశంకరంపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్నట్లు వెల్లడించారు. గీతా శంకరం మూవీకి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ పాటలు సమకూర్చుతున్నారు.
Mon, 16 Sep 202407:03 AM IST
Telugu Tv Shows Trp: లేటెస్ట్ టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్‌లో బిగ్‌బాస్ 8 అదరగొట్టింది. బిగ్‌బాస్ వీక్ ఎపిసోడ్స్‌కు అర్బన్ ఏరియాస్‌లో 5.79 టీఆర్‌పీ వచ్చింది. బిగ్‌బాస్ తర్వాత శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
Mon, 16 Sep 202407:01 AM IST
- Aditi Siddharth Wedding: అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ పెళ్లితో ఒక్కటయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న ఆరు నెలల తర్వాత ఈ జంట ఇప్పుడు కలిసి ఏడు అడుగులు వేయడం విశేషం. వీళ్ల పెళ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mon, 16 Sep 202406:08 AM IST
- OTT Horror Movie: ఓ హారర్ మూవీ రీరిలీజ్ లోనూ రికార్డులు తిరగరాస్తోంది. నిజానికి తొలిసారి రిలీజైనప్పటి కంటే కూడా ఇప్పుడే ఎక్కువ కలెక్షన్లు రాబట్టేలా కనిపిస్తోంది. మరి ఈ హారర్ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
Mon, 16 Sep 202406:04 AM IST
Keerthy Suresh: కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ రఘు తాత ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోంది.కామెడీ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఇటీవలే జీ5 ఓటీటీలో రిలీజైంది. 24 గంటల్లోనే రఘు తాత మూవీకి యాభై మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్ వచ్చినట్లు జీ5 ఓటీటీ ప్రకటించింది.
Mon, 16 Sep 202405:21 AM IST
- OTT Top Movies: ఓటీటీల్లోకి ఈ మధ్యే కొన్ని టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. వరుస హాలీడేస్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమాల్లాంటి ఓటీటీల్లో ఈ మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి.
Mon, 16 Sep 202404:36 AM IST
Shekar Basha : బిగ్బాస్ 8 తెలుగు సెకండ్ వీక్‌లో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ విషయంలో శేఖర్ బాషాకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. కాగా రెండు వారాలు హౌజ్‌లో కొనసాగినందుకు శేఖర్ బాషాకు ఐదు లక్షల రెమ్యునరేషన్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
Mon, 16 Sep 202403:34 AM IST
గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 16 ఎపిసోడ్‌లో తమ్ముడు రవికి గొప్పింటి సంబంధం కుదరనుందని తెలిసి మనోజ్ జెలసీగా ఫీలవుతాడు. తమ్ముడు చేసేది చెఫ్ జాబ్ అంటూ చీప్‌గా మాట్లాడుతాడు. రవి జాబ్‌ను మనోజ్ కించపరుస్తూ మాట్లాడటం బాలు సహించలేకపోతాడు.
Mon, 16 Sep 202403:20 AM IST
- Saripodhaa Sanivaaram OTT Release Date: నాని నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై బజ్ క్రియేటైంది.
Mon, 16 Sep 202402:55 AM IST
- NNS 16th September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్లో అంజు మెడలో దుర్గ లాకెట్ చూసి భయంతో వణికిపోతుంది మనోహరి. మరోవైపు రణ్‌వీర్ ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తున్నాయి.
Mon, 16 Sep 202402:11 AM IST
Brahmamudi: బ్రహ్మముడి సెప్టెంబర్ 16 ఎపిసోడ్‌లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన అపర్ణకు కావ్య కనిపించదు. కోడలు ఇంట్లో లేకపోవడంతో కావ్యను రుద్రాణి ఏదో చేసి ఉంటుందని అపర్ణ అనుమానిస్తుంది. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి రాజ్ కారణమని స్వప్న నిజం బయటపెడుతుంది.
Mon, 16 Sep 202401:33 AM IST
- Karthika deepam 2 september 16th:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీని కలిసి తనను ఇంటికి తీసుకెళ్లాలని పెళ్ళికి ఒప్పుకున్నట్టు చెప్పి సర్ ప్రైజ్ చేయాలని శ్రీధర్ అనుకుంటాడు. కానీ కాశీ దాసు కొడుకని తెలుసుకుని షాక్ అవుతాడు.
Mon, 16 Sep 202412:41 AM IST
Horror OTT: మలయాళం హారర్ మూవీ హంట్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. హంట్ మూవీ జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భావన హీరోయిన్‌గా నటించిన హంట్ మూవీకి మలయాళం సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించాడు.