Devara New Trailer: దేవర నుంచి మరో ట్రైలర్ రానుందా? ఆ ఈవెంట్‍లో..!-another trailer may release from jr ntr janhvi kapoor devara movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara New Trailer: దేవర నుంచి మరో ట్రైలర్ రానుందా? ఆ ఈవెంట్‍లో..!

Devara New Trailer: దేవర నుంచి మరో ట్రైలర్ రానుందా? ఆ ఈవెంట్‍లో..!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2024 08:38 PM IST

Devara New Trailer: దేవర చిత్రం నుంచి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారని రూమర్లు బయటికి వచ్చాయి. సినిమా విడుదలకు ముందు దీన్ని తీసుకొచ్చేలా ప్లాన్స్ చేస్తున్నారట. ఆ వివరాలు ఇవే..

Devara New Trailer: దేవర నుంచి మరో ట్రైలర్ రానుందా? ఆ ఈవెంట్‍లో..!
Devara New Trailer: దేవర నుంచి మరో ట్రైలర్ రానుందా? ఆ ఈవెంట్‍లో..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ రిలీజ్ దగ్గర పడుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో పది రోజుల్లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది.

మరో ట్రైలర్

దేవర నుంచి మరో ట్రైలర్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని రూమర్లు బయటికి వచ్చాయి. రిలీజ్ ట్రైలర్ పేరుతో దీన్ని తీసుకురావాలని నిర్ణయించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ చక్కర్లు కొడుతోంది. దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ నయా ట్రైలర్‌ను తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

దేవర మూవీ నుంచి ఇటీవలే సెప్టెంబర్ 10వ తేదీన ట్రైలర్ వచ్చింది. దీనికి ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ మాస్ యాక్షన్, కొన్ని సీక్వెన్సులు అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కొందరు మాత్రం ట్రైలర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైలర్లోని కొన్ని ఫ్రేమ్‍లు, వీఎఫ్‍ఎక్స్ విషయాల్లో కాస్త విమర్శలు వచ్చాయి.

మరింత పవర్‌ఫుల్‍గా..

దేవర మూవీకి హైప్ మరింత పెరిగేలా కొత్త ట్రైలర్ కట్ ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోనున్నారని ఇండస్ట్రీల్లో వర్గాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది. మూవీ బ్యాక్‍డ్రాప్‍లోని మరిన్ని అంశాలు ఉండేలా, మరింత పవర్‌ఫుల్‍గా ఈ ట్రైలర్ ఉంటుందని వినిపిస్తోంది. ఈ ట్రైలర్‌పై రూమర్లు వస్తుండగా.. మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్‍లో నిర్వహించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్‍‍లోనే కొత్త ట్రైలర్ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికైతే రెండో ట్రైలర్‌పై రూమర్లు వస్తున్నా.. మూవీ టీమ్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

దేవర సినిమా హిందీ ప్రమోషన్లను మూవీ టీమ్ ఇప్పటికే షురూ చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలోనే జరిగింది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో టీమ్ ఓ ఇంటర్వ్యూ చేసింది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ కొరటాల శివ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తెలుగులో అడుగుపెడుతున్నారు. దేవర సినిమా తెలుగు ప్రమోషన్లను కూడా టీమ్ త్వరలోనే మొదలుపెట్టనుంది. జోరుగా చేసేలా ప్లాన్ చేస్తోంది.

దేవర చిత్రంలో అండర్ వాటర్ సీక్వెన్స్ గురించి మూవీ టీమ్ చాలా హైప్ ఇస్తోంది. ఈ చిత్రంలో చివరి 40 నిమిషాలు యాక్షన్ అదిరిపోతుందని ఎన్టీఆర్ కూడా చెప్పారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో ఉండే సీక్సెన్సులు అదిరిపోయాయనే అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో దేవరపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ పుంజుకోవాలనే కసితో దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించారు.