Janhvi Kapoor about NTR: ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైనా చేయాలనుంది: జాన్వీ కపూర్.. ట్రైలర్ లాంచ్‍లో చీరలో మెరిసిన బ్యూటీ-i became big fan of ntr janhvi kapoor says at devara trailer launch event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor About Ntr: ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైనా చేయాలనుంది: జాన్వీ కపూర్.. ట్రైలర్ లాంచ్‍లో చీరలో మెరిసిన బ్యూటీ

Janhvi Kapoor about NTR: ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైనా చేయాలనుంది: జాన్వీ కపూర్.. ట్రైలర్ లాంచ్‍లో చీరలో మెరిసిన బ్యూటీ

Published Sep 10, 2024 09:55 PM IST Chatakonda Krishna Prakash
Published Sep 10, 2024 09:55 PM IST

  • Janhvi Kapoor about NTR: దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో నేడు (సెప్టెంబర్ 10) జరిగింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‍గా నటించిన జాన్వీ కపూర్ ఈ ఈవెంట్‍కు హాజరై మాట్లాడారు.

దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో  అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 10) ముంబైలో జరిగింది. 

(1 / 5)

దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు చీరకట్టులో హాజరయ్యారు జాన్వీ కపూర్. గోల్డ్ కలర్ శారీలో తళుక్కుమన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన అనుభవాలను ఆమె పంచుకున్నారు.

(2 / 5)

(Instagram)

తెలుగు ఇండస్ట్రీకి వెళుతుంటే తనకు సొంత ఇంటికి వెళుతున్నట్టు అనిపిస్తోందని జాన్వీ కపూర్ చెప్పారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన మూవీ అని అన్నారు. 

(3 / 5)

ఎన్టీఆర్‌కు తాను అతిపెద్ద ఫ్యాన్ అయ్యానని జాన్వీ కపూర్ అన్నారు. “ఎన్టీఆర్‌తో నేను ప్రతీ సినిమా చేయాలని అనుకుంటున్నా. చాలా సరదాగా అనిపించింది. నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. నేను అంతకు ముందే ఆయనకు అభిమానిని. ఆయనతో కలిసి నటించాక చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా” అని జాన్వీ కపూర్ అన్నారు. ట్రైలర్ లాంచ్ తర్వాత చీరకట్టులో ఉన్న ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో జాన్వీ పోస్ట్ చేశారు. 

(4 / 5)

దేవర మూవీలో తంగం అనే పాత్ర చేశారు జాన్వీ కపూర్. పక్కా పల్లెటూరి అమ్మాయిగా లంగావోణీలో మరింత అందంగా కనిపించారు. దేవర మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు