Devara Runtime: దేవర సినిమా రన్‍టైమ్ ఇదే.. ఎక్కువ నిడివితోనే వస్తున్న ఎన్టీఆర్ యాక్షన్ మూవీ
Devara Movie Runtime: దేవర సినిమా సెన్సార్ పూర్తయింది. దీంతో రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ ఎక్కువ రన్‍టైమ్‍తోనే వస్తోంది. సెన్సార్ కూడా పూర్తయింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం రిలీజ్ దగ్గరపడుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ వాటిని మరో రేంజ్‍కు తీసుకెళ్లాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ పోషించారు. దేవర మూవీ సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. దీంతో రన్‍టైమ్ (నిడివి) వివరాలు బయటికి వచ్చాయి.
రన్‍టైమ్ ఇదే
దేవర సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ చిత్రం 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల (సుమారు 178 నిమిషాలు) రన్‍టైమ్‍తో రానుంది. అంటే దాదాపు మూడు గంటల నిడివి ఉండనుంది.
మూడు గంటల రన్‍టైమ్ అంటే కాస్త ఎక్కువే. అయితే, దేవర మూవీలో యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా ఉండడం, కథను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉండటంతో ఎక్కువ నిడివికే మేకర్స్ నిర్ణయించుకున్నారు. మూవీ కనెక్ట్ అయితే ఎక్కువ రన్‍టైమ్ పెద్ద సమస్యగా ఉండదు.
ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
దేవర సినిమా నుంచి మంగళవారం (సెప్టెంబర్ 10) ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌కు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ యాక్షన్, డైలాగ్స్ అదిరిపోయాయి. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో వచ్చే విజువల్స్ ఆకట్టుకున్నాయి. షార్క్‌ను పట్టుకొని సముద్రంలో నుంచి ఎన్టీఆర్ పైకి ఎగిరే షాట్ ప్రత్యేకంగా ఆకర్షించింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. మొత్తంగా దేవర ట్రైలర్ అంచనాలను అందుకుంది. ఒక్క రోజులోనే అన్ని భాషల్లో కలిపి ట్రైలర్‌కు 55 మిలియన్ వ్యూస్ దక్కాయి.
దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్ మూవీ కావటంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‍లో భారీ అంచనాలు ఉన్నాయి. దేవర చిత్రంలో చివరి 40 నిమిషాల ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఈ ఈవెంట్‍లో ఎన్టీఆర్ చెప్పారు. డైరెక్టర్ కొరటాల శివ సృష్టించిన ప్రపంచాన్ని వెండితెరపై చూసేందుకు తాను కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నారు.
దేవర సినిమా సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అన్ని భాషల్లో ఈ చిత్రానికి మంచి హైప్ ఉంది. తెలుగు, హిందీల్లో మరింత ఎక్కువగా ఉంది. ట్రైలర్ అదిరిపోవటంతో దేవరకు భారీ ఓపెనింగ్స్ పక్కా. పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. రూ.1000కోట్ల కలెక్షన్లు మార్కును ఈ మూవీ దాటుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.
దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంతోనే తెలుగులో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో నటించాక తాను ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యానని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో జాన్వీ చెప్పారు. దేవరలో విలన్ పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ చిత్రంతోనే టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్స్ భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశాయి.